Archive for the ‘పాతికం’ Category

మురళి పాతికం – 25


ప్రతి నవ్వు వెనకాల ఆనందముండదు
ప్రతి జోకు వెనకాల హాస్యమూ ఉండదు
కడుపు మండినా కూడా వస్తుంది కామెడీ
మురళి మాట మూడు ముక్కలాట

మురళి పాతికం – 24

ధర్మము ఓడితే దేవుడు దిగి రాడు
ఎదురు చూపు వల్ల ఏమియూ జరుగదు
మనిషి దైవమగుట ఒక్కటే మార్గము
మురళి మాట మూడు ముక్కలాట

మురళి పాతికం – 23


శాంతి దొరుకుటంత సులభమ్ము కాదు
యుద్ధమన్నది అంత నీచమూ కాదు
శాంతి నిలుపుటకు యుద్ధమ్ము అవసరము
మురళి మాట మూడు ముక్కలాట

మురళి పాతికం – 22

ముందు ఏమగునో ఎవరికీ తెలియదు
చావు అన్నది ఎపుడు చెప్పి రాదు
ఉన్నన్ని రోజులూ మిన్నగా బతుకుము
మురళి మాట మూడు ముక్కలాట

మురళి పాతికం – 21


గ్రహాంతర యాత్ర సాధ్యమ్ము కావచ్చు
గరళమ్ము మింగినూ బ్రతుకవచ్చు.
మత మౌఢ్యుడిని మటుకు మార్చనే లేము
మురళి మాట మూడు ముక్కలాట

Follow

Get every new post delivered to your Inbox.

Join 73 other followers