Archive for the ‘India’ Category
హిందూనా? ఐతే ఓకే!
పీ.టీ.అలీ! పేరు చూస్తే ముస్లిం అనుకునేరు. ఇతని అసలు పేరు పైడి తల్లి. ఆ పేరు నచ్చక ఇలా సెటిల్ అయిపోయాడు. ఒక ఆరు నెలల కిందే ఇతనికి అమెరికాలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దానికి సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. అసలే ఉగ్రవాదం ఎక్కువైన ఈ రోజుల్లో ఆ క్లియరెన్స్ దొరకడం మరీ కష్టమైపోయింది.
ఇంకో ఐదు నిమిషాల్లో అతనికి ఇంటర్‌వ్యూ ఉంది. ఎఫ్.బీ.ఐ వాళ్ళు చేస్తారు. గతంలో అతను నింపిన అప్ప్లికేషన్‌లో ఉన్న అన్ని వివరాలని తిరగతోడి అతను చెప్పింది నిజమో కాదో ఒకటికి వంద సార్లు పరిశీలించి అతనికి ఎలాంటి ఉగ్రవాదులతో గానీ, ఉగ్రవాద సంస్థలతో గానీ సంబంధం లేదని నమ్మాకే, ఆ క్లియరెన్స్ ఇస్తారు. అందుకే పైడి తల్లి కాస్త టెన్షన్‌గా ఉన్నాడు.
అప్పాయింట్‌మెంట్ టైం దగ్గర పడింది కాబట్టి అప్పటి దాకా తాగుతున్న సిగరెట్‌ని ట్రాష్ క్యాన్ మీదున్న యాష్‌ట్రేలో నలిపేసి లోపలికి వెళ్ళాడు అతను.
ఆ రూంలో ఏకంగా నలుగురు కూర్చుని ఉన్నారు. అందరూ సూట్లు ధరించి ఉన్నారు. మొహాలు కందగండల్లా ఉన్నాయి (కోపమొచ్చి కాదులెండి, అందరు తెల్ల వాళ్ళు కావడం వల్ల సహజంగానే అలా ఉన్నాయి). అంత మందిని చూసి కంగారు పడ్డాడు పైడి తల్లి. అర చేతుల్లో చెమట్లు పట్టాయి. బలవంతాన మొహం మీద నవ్వు పులుముకుని వాళ్ళ ముందు కూర్చున్నాడు.
ఒకాయనకి బట్టతల ఉంది. ఇంకో ఆయనకు పొడుగు ముక్కు (మన హీరో గోపిచంద్‌లా). మూడో అతనికి కాస్త మెల్లకన్ను ఉంది. నాలుగో అతను బాగా పొట్టి. తనకు తెలీకుండానే మనసులో వాళ్ళకు “బట్టతల, పొడుగు ముక్కు, మెల్ల కన్ను, పొట్టాయన” అని నామకరణం చేసేశాడు పైడి తల్లి.
సంభాషణ అంతా ఆంగ్లంలో సాగుతూంది.
ముందు కుశల ప్రశ్నలు, ఆ తరువాత కొంత వెరిఫికేషన్ అయ్యాక బట్టతల అడిగాడు, “మీ దగ్గర చుట్టాల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నట్టు మీకు తెలుసా? కనీసం అనుమానం ఉందా?” అని.
అడ్డంగా తలూపాడు పైడితల్లి. వాళ్ళ మామయ్య ఒకతను రామ జన్మ భూమిలో కట్టబోతున్న మందిరానికి చందాలు వసూలు చేశాడు అంతే. అది ఉగ్రవాద చర్య కిందకి వస్తుందా? ఏమో, ఎందుకొచ్చిన గొడవ. చెప్పకపోతేనే మంచిది.
“మీరు అల్లాని ఎంత వరకు నమ్ముతారు? అల్లా కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తారా?” అడిగాడు పొడుగు ముక్కు.
పైడి తల్లి ఖంగారు పడ్దాదు. కొంప తీసి తను తప్పు ఇంటర్‌వ్యూకి రాలేదు కద? అంతలో తమాయించుకుని, “నేను అల్లాని నమ్మను. అహ! అంటే అసలు నమ్మనని కాదు. అందరు దేవుళ్ళనూ నమ్ముతాను. అందులో అల్లా ఒకడు. కానీ అల్లా మా దేవుడు కాడు,” అన్నాడు గజిబిజిగా.
“అదేంటి? మీ పేరు అలీ కద?” అన్నాడు మెల్లకన్ను.
బల్బ్ వెలిగింది పైడి తల్లికి. “లేదు లేదు నా పేరు పైడి తల్లి. షార్ట్ కట్‌లో పీ.టీ. అలీ అని పిలుస్తారు,” వివరించాడు.
“ఐతే మీరు..” ఆపేశాడు పొట్టాయన.
“నేను హిందూని,” చెప్పాడు పైడి తల్లి.
ఆ నలుగురు ఒక్క సారి పెద్దగా ఊపిరి వదిలి వెనక్కు వాలి రిలాక్స్ అయ్యారు.
“ఓ, హిందూనా? ఐతే ఓకే. అనవసరంగా నలుగురం వచ్చాము. ఈ సంగతి ముందే తెలుసుంటే మొక్కుబడిగా ఎవరో ఒకరం వచ్చుండే వాళ్ళంగా?” కొంత చిరాకుగా అన్నాడు బట్టతల.
“యా, యా! మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడిగే వాళ్ళమే కాదు అసలు. ఐనా పాపం మీరేం ఉగ్రవాదం చేస్తారు లెండి. మిమ్మల్ని ఊచకోత కోస్తూంటేనే పాపం మీరు ఎదురు తిరగరు,” జాలిగా చూస్తూ అన్నాడు పొడుగు ముక్కు.
పైడితల్లికి వొళ్ళు మండింది. “మాకూ బోలెడు పౌరుషం ఉంది. మా దేశంలోనూ చాలా వయొలెన్స్ జరుగుతుంది,” గట్టిగా అన్నాడు.
“జరుగుతుంది లెండి. కులాలు అని వర్గాలు అని ఫ్యాక్షన్లు అని, కొట్టుకు చస్తారు. మాకు తెలుసు. బలవంతుడు బలహీనుడిని హింసించడం అనేది మామూలే. మేమనేది, మీ జాతిని కబళించే ప్రమదం ముంచుకు వచ్చినా మీరు ఎదుర్కోరూ అని. పైగా దేశంకోసమో, మీరు నమ్మిన విలువలకోసమో, అతి కొద్ది మంది తప్ప, మీరు ప్రాణ త్యాగాలు చేయరు. మాకు కావల్సింది ఆ పాయింట్ మాత్రమే,” ఎక్స్‌ప్లేయిన్ చేసాడు మెల్ల కన్ను.
పైడి తల్లికి ఏమనాలో తెలీలేదు. ఇంతలో పొట్టాయన, “మరే, మొన్నే చూశాం కద, వీళ్ళ ముంబాయి నగరంలో జరిగిన దాడి. అదే కాదు అంతకు ముందు ఒకసారి పార్లమెంట్ మీద కూడా అటాక్ అయ్యింది. అయినా వీళ్ళు చలించలేదు. గంగిగోవుల్లాంటి వాళ్ళు,” అంటూ తాఖీదు ఇచ్చాడు.
పైడి తల్లికి అతను పొగుడుతున్నాడో తిడుతున్నాడో అర్థం కాలేదు.
“ఓకే మిస్టర్ పీ.టీ. అలీ, ఐ మీన్, పైడి తల్లి, మీకు క్లియరెన్స్ వచ్చేసినట్టే! కంగ్రాచులేషన్స్!” అంటూ కరచాలనం చేశాడు బట్టతల.
“పదండి లంచ్‌కి వెళ్దాం. నేను చెప్పిన రెస్టారెంట్‌లో బీఫ్ భలే రుచిగా ఉంటుంది,” అన్నాడు పొడుగు ముక్కు.
వాళ్ళు పైడి తల్లిని తన మానానికి తనను వదిలేసి, బయటకు నడిచారు.
“బీఫ్ అంటే ఆవు మాంసం. పాపం వెర్రి గోవులు. ఏం చేస్తాయి. తమని తాము కాపాడుకోలేవు కద. వీళ్ళకి ఇలా బలయిపోతాయి,” అనుకుంటూ తను కూడా బయలుదేరాడు పైడి తల్లి.
War is an ugly thing, but not the ugliest of things. The decayed and degraded state of moral and patriotic feeling which thinks that nothing is worth war is much worse. The person who has nothing for which he is willing to fight, nothing which is more important than his own personal safety, is a miserable creature and has no chance of being free unless made and kept so by the exertions of better men than himself.
– John Stuart Mill
సైనికుడు
తెల్లటి కంబళిలా చుట్టూ పరుచుకున్న మంచు.
ఐదు వందల గజాల దూరంలో నియంత్రణ రేఖ అంచు.
నాకు దిగులుగా వుంది, చెప్పలేనంత దిగులు.
నాకున్న ఏకైక నేస్తాలు, చలి, రాత్రి, పగలు.
తాజా కబురు అందింది ఇప్పుడే, శత్రువులు ఇంకో గంటలో సరిహద్దు దాటచ్చని.
గాలి హోరు కంటే బిగ్గరగా వుంది వేగంగా కొట్టుకుంటున్న నా గుండె ధ్వని.
శపథం తీసుకున్న రోజు వున్న ధైర్యం ఇప్పుడు నా వద్ద లేదు.
చిగురుటాకులా వణుకుతున్నాను అంటే అది అతిశయోక్తి కాదు.
కాల్పులు మొదలైతే మొట్ట మొదటి వరుసలో నేనే వుంటాను.
బహుశా శత్రువు కాల్చిన మొదటి bullet నేనే తీసుకుంటాను.
ఆ బాధ ఎలా వుంటుందో తెలీదు, ఒక అగ్నికణం నిలువునా చీల్చినట్టేమో.
మరణం తొందరగా వస్తుందో రాదో, వికలాంగుడిలా బతకాల్సి వస్తుందో ఏమో.
నాకు ఈ యుద్ధం చేయలని లేదు, ఆపాదమస్తకం ఊపేస్తున్న భయం.
పారిపోదామని ప్రయత్నించినా, నా వాళ్ళే నన్ను కాల్చివేయడం ఖాయం.
అదిగో, siren మోగింది, నీడల్లా సరిహద్దును దాటుతున్నారు శత్రు సైనికులు.
లీలగా వారి ఆకారాలు, చేతుల్లో గురి పెట్టి వున్నాయి తుపాకులు.
మొదటి బుల్లెట్ ఎవరు కాల్చారో నాకు తెలీదు.
మొదటి గ్రనేడ్ ఎవరు విసిరారో నేను చూడలేదు.
ఒకే సారి, భూకంపం వచ్చినట్టూ, అగ్ని పర్వతం పేలినట్టు వుంది.
నా మాతృభూమి ఎరుపు రంగు దాల్చింది, ఇరు వైపు సైనికుల రక్తం చింది.
పక్కన వున్న నా తోటి సైనికుడి తల రెండు ముక్కలుగా విడిపోయింది
విసురుగా వచ్చి ఒక మాంస ఖండం నా మొహానికి అతుక్కుంది.
నా కళ్ళ ముందే బ్రతుకు తెరువులు తారుమారై పోతున్నాయి.
నాలోని భయం, అందోళన పొగ మంచులా కరిగి పోతున్నాయి.
నా ప్రమేయం లెకుండానే నా అడుగు ముందుకు పడుతూంది.
నాకు తెలీకుండానే నా చేతిలో తుపాకి నిప్పులు కక్కుతూంది.
ఎంత మంది నేల కూలినా వాళ్ళు ముందుకు దూసుకు వస్తూనే వున్నారు.
అందులో ముగ్గురు మా జండాని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆవేశం ఎనలేని శక్తిని ప్రసాదిస్తూంటే, నేను ముందుకి దూకాను.
అచ్ఛాదన లేదని తెలిసీ వారి వైపు తుపాకి గురి పెట్టి కాల్చాను.
వారు నేలకు ఒరుగుతూంటే నా నుంచి వెలువడింది మా యుద్ధ నినాదం.
నా శరీరం కూడా బుల్లెట్లతో తూట్లు పడింది, కళ్ళ ముందు పెద్ద అగాధం.
ప్రాణం పోతూందని నాకిప్పుడు బాధ లేదు, నా విధి నేను నిర్వర్తించాను.
నా కన్న తల్లిని రక్షించడం కోసం ఒక నిజమైన సైనికుడిలా ప్రవర్తించాను.
వందే మాత…………..
(చాలా రోజుల కింద రాసిన కవిత. Seems relevant more than ever.)
ది ఎలెవెన్ కాజెస్ ఫర్ ది డిజెనరేషన్ అఫ్ ఇండియా
1. నిస్పృహ
అన్నిటి కంటే భయంకరమైనది నిస్పృహ. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడిని నిర్వీర్యుడిని చేసి, ఆలోచన సైతం స్తంభింప చేసే చలిలా, ఈ నిస్పృహ మనల్ని అచేతనులను చేస్తుంది. ఏం చేసినా చేయకపోయినా ఫలితం ఒక్కటే అనే నిరర్థకమైన వేదాంత ధోరణి అలవాటు చేస్తుంది. ప్రస్తుతం మన దేశం ఉన్న పరిస్థితి చూసి చాలా మంది ఈ నిస్పృహని ఆశ్రయించారు.
ఈ నిస్పృహ మనకు తరతరాల బానిసత్వం నుండి వచ్చింది. మన దేశ సంస్కృతిని గౌరవించడం మానేయడం వల్ల వచ్చింది. పరిస్థితులు మారవు అన్న నైరాశ్యం వల్ల వచ్చింది. కానీ విషాదకరమైన విషయం ఏంటంటే ఇది ఒక విష వలయం. పరిస్థితి విషమించిన కొద్ది నిస్పృహ పెరుగుతుంది. నిస్పృహ వల్ల ఏమీ చేయకుండా కూర్చుంటే పరిస్థితి మరింత విషమిస్తుంది.
2. సోషలిజం
నెహ్రూ ఆమాత్యుడు వృద్ధిలోకి తీసుకుని వచ్చిన రాజకీయ సిద్ధాంతం. ఆయనెప్పుడో పోయాడు కదా, ఇంకా ఆయన మీద పడి ఏడవడం ఎందుకూ అంటారా? “పిల్ల పోయినా పురిటి వాసన పోలేదు” అనే నానుడి వుంది. ఆ రకంగా ఆయన లేకపోయినా, ఆయనగారి పార్టీ ఐన కాంగ్రెస్, 1991 వరకూ ఈ failed ideologyని కొనసాగించింది. ఇప్పటికీ ఎన్నో “పేదల” పార్టీలు, సోషలిస్ట్ అన్న పదాన్ని తమ పార్టీ పేర్లకు జోడించి, సోషలిజం అనే నినాదాన్ని ఇంకా వెలువరిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం కలగ చేసుకుని సబ్సిడీలూ, రుణాలూ, రాయతీలూ ఇచ్చి ప్రజలలో సమానత్వం స్థాపించాలనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని వల్ల మన దేశానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.
ఇదేంటి కమ్యూనిజాన్ని వదిలేశాడు అనుకుంటున్నారా? సోషలిజం అంటే వేరే ఏదో కాదు. కమ్యూనిజం యొక్క అక్రమ సంతానమే!
3. సూడో సెక్యూలరిజం
మిగతా మతాలకు, ముఖ్యంగా మైనారిటీ మతాలకు పెద్ద పీట వేసి, వాటిని కావలసిందానికంటే ఎక్కువగా గౌరవిస్తూ, మెజారిటీ మతాన్ని మాత్రం, అయిన దానికీ కాని దానికీ దుమ్మెత్తి పోయడం. తద్వారా సదరు మైనారిటీలలో అభద్రతా భావాన్ని మరింత పెంపొందించడం, ఆ రకంగా వాళ్ళనుంచి వోట్లు దండుకోవడం. ఐతే ఈ ప్రహసనంలో మైనారిటీ నాయకులది కూడా చాలా పెద్ద పాత్రే ఉంది. ఈ “ఉభయకుశలోపరి” విధానాన్ని తుంచడం చాలా ముఖ్యం.
4. కాశ్మీర్ సమస్యని మొగ్గలోనే తెంపి వేయకపోవడం
దీనికి మళ్ళీ మన పూజ్య నెహ్రూని తలుచుకోక తప్పదు. గోటితో పోయే సమస్యని అనవసరంగా పెంచి ఇప్పుడు గొడ్డలితో కూడా పరిష్కారం కాని స్థితికి తెచ్చిన ఘనత ఏలినవారిదే. ఆ తరువాత 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించి కూడా, ఆ ఆధిక్యతతో కాశ్మీర్ సమస్యని మళ్ళీ లేవనెత్తకుండా చేయగలిగిన సువర్ణావకాశాన్ని జార విడుచుకోవడం ఇంకొక historical blunder. అప్పుడు మన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నది నెహ్రూగారి పుత్రికా రత్నం ఇందిరమ్మ అని అందరికీ తెలిసిన విషయమే.
5. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మొదలగు పనికి మాలిన చట్టాలు
ఈ పని కూడా మన నెహ్రూ పుత్రి ఇందిరమ్మదే. పైగా దీనికి ఎర్ర మేధావుల మద్దతు కూడా పూర్తిగా ఉంది.
Urband Land Celing Act ప్రకారం ఎవరి దగ్గరన్నా ఒక పరిమితికి మించి ఎక్కువ భూమి ఉంటే (ఈ పరిమితి రాష్ట్రాన్ని బట్టి మారుతుంది; మహారాష్ట్రాలో ఇది 5,382 చదరపు గజాలు ఉండేది), ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పక్కా ఇళ్ళు కట్టడానికి ఉపయోగించవచ్చు. ఐతే దీని వల్ల పక్కా ఇళ్ళ మాట దేవుడెరుగు, భూమి ధరలు విపరీతంగా పెరిగాయి. పైగా ఎన్నో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటు పడ్డాయి. 1999లో కేంద్ర ప్రభుత్వం దీని వైఫల్యాన్ని అంగీకరించి ఈ చట్టం ఎత్తివేసింది.
6. కాంగ్రెస్‌ని వదిలించుకోలేకపోవడం
1977లో కాంగ్రెస్‌ని గద్దె దించిన జనతా పార్టీ 1979లో పతనమయ్యింది. ఇది కాంగ్రేసేతర పార్టీలు భారత దేశానికి చేసిన క్షమించరాని ద్రోహం. చావు తప్పి కన్ను లొట్ట పోయిన కాంగ్రెస్ భూస్థాపితం కావడానికి బదులు జనత పార్టీ వైఫల్యం వల్ల తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ దేశాన్ని మహమ్మారిలా పట్టుకునే ఉంది.
7. మత మార్పిడులని అరికట్టకపోవడం
మన రాజ్యాంగంలో నిషేధించినప్పటికీ, భారీ ఎత్తున జరిగే మతం మార్పిడులని ప్రభుత్వం, వోటు బాంక్ రాజకీయల వల్ల అరి కట్టకపోవడం. స్వచ్ఛందంగా మతం మారడం వేరు. డబ్బూ ఇతర ప్రలోభాలూ చూపించి మూకుమ్మడిగా మతాలు మార్చడం వేరు. ఈ కొత్త మతస్తులు అందరు వెంటనే భారతదేశ ద్వేషులు అవుతారు. దీనికి కారణం ఉంది. హిందు మతాన్ని ద్వేషిస్తూ, భారతదేశాన్ని ప్రేమించడం కష్టం. ఈ మతం మార్పిడులు హిందూ మతం మీద ద్వేషం ప్రాతిపదికగా జరుగుతాయి కాబట్టి, ఈ భారతదేశంపై ద్వేషం కూడా తప్పని సరిగా జరిగే ఒక side effect. ఇది భారతదేశం ఉనికికే ప్రమాదం.
8. కులానికి ప్రాధాన్యత ఇవ్వడం
కులం మనని వదలకుండా పీడిస్తున్న జాడ్యం. కులం కంటే సంస్కారం గొప్పది అన్న విషయం అర్థం చేసుకోలేనంత వరకూ మనం వెనుక పడే ఉంటాం. దీని అర్థం నిమ్న కులాల వారంతా మంచివారూ, అగ్ర కులాల వారంతా చెడ్డవారూ అని కాదు. దీని అర్థం కులానికీ సంస్కారానికీ సంబంధం లేదూ అని మాత్రమే.
కులం ప్రభావం రాజకీయల మీద చాలా ఉంది. ఇప్పటికీ పార్టీలు ఎన్నికలలో నిలబడే అభ్యర్థులని ఆ నియోజక వర్గంలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో అన్న దాన్ని బట్టే నిర్ణయిస్తాయి. కొన్నేళ్ళ కింద బీహార్‌లో జరిగిన ఎన్నికల సంగ్రామంలో రాష్ట్రీయ జనతాదల్ స్లోగన్స్‌లో ఇదొకటి. “న ఫూల్ చాహియే, న సడక్ చాహియే, హమే తో లాలూ జైసా మర్ద్ చాహియే.” (మాకు బ్రిడ్జులూ వద్దు, రోడ్లూ వద్దు, మాకు లాలూ లాంటి మగాడు కావాలి.) ఎందుకు? లాలూ వాళ్ళ కులం వాడు కాబట్టి.
9. కుల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వడం
కులాన్ని నిర్మూలిస్తే సమ సమాజం దానంతట అదే వచ్చి పడుతుందని కొందరి నమ్మకం. కులాన్ని నిర్మూలించడంకంటే కులం అప్రస్తుతం (irrelevant) అయ్యే వాతావరణం సృష్టించాలి. అందరికి చదువుతో పాటూ సంస్కారం నేర్పడం ఒక్కటే దీనికి మార్గం. ఎప్పుడైతే మనిషి ఔన్నత్యాన్ని అతని గుణాన్ని బట్టి కొలిచే సంప్రదాయం వస్తుందో, అప్పుడు కులం యొక్క ప్రభావం దానంతట అదే అదృశ్యం అవుతుంది.
అంతే కానీ చదువుల్లో, ఉద్యోగాల్లో, ఆఖరికి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి సామర్థ్యం ఉన్న వాళ్ళ కడుపు కొడితే కులం “పోదు”. పైగా కుల తత్వం మరింత ఎక్కువవుతుంది. ఎవరిది ఏ కులమో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. కుల ప్రాతిపదిక మీద జీవితంలో పైకి వచ్చిన వాళ్ళ మీద చిన్న చూపు మరింత ఎక్కువవుతుంది.
ఇవి మన రాజకీయ నాయకులకు తెలీక కాదు. కానీ మొదటి పద్ధతి కంటే రెండోది సులభం. వోట్లు రాబట్టుకోవడం ఈజీ. ఇది ప్రజలు గుర్తించనంతవరకూ ఇలాగే నిరాటంకంగా సాగుతుంది.
10. Non-aligned movement
చాలా రోజుల వరకూ అలీన సిద్ధాంతం మన foreign policyని నిర్దేశించింది. దీని అర్థం అమెరికా కూటమి కానీ రష్యా కూటమి కానీ దేనిలోనూ చేరకుండా తటస్థంగా ఉండడం. ఇది కూడా చాచా నెహ్రూ అద్భుత ఆలోచనే. తటస్థంగా ఉన్నామని మనం అనుకున్నాం. రష్యా తొత్తులని West అనుకుంది. చిన్న తేడా, అంతే. దీని వల్ల మన తరువాత అతి పెద్ద ప్రజాస్వామ్యిక దేశమైన అమెరికాతో చాలా రోజుల వరకూ మనకు సరైన సంబంధ బాంధవ్యాలు లేవు. మనం ఇంకా సోషలిజంలో మగ్గడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం.
11. Paliamentary democracy
అమెరికాలో ప్రజలు తమ నాయకుడిని నేరుగా ఎన్నుకుంటారు. తరువాత ఆ నాయకుడు తన క్యాబినెట్ సభ్యులని వివిధ రంగాలనుంచి ఎన్నుకుంటాడు. ఇది presidential democracy. దీనిలో సౌలభ్యాలు రెండు. 1. ఎక్కువ మంది మార్బలం లేని ఒక గొప్ప నాయకుడికి ఎన్నిక కాగలిగే అవకాశం. (Of course, దీనికి multi party system ఉండాలనుకోండి. అది ఎలాగూ మన దగ్గర ఉంది.) 2. తనని ఎప్పుడు తన వాళ్ళే కుర్చీ నుంచి లాగేస్తారా అన్న భయం సదరు నాయకుడికి ఉండకపోవడం. కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టగలగడం.
రాజీవ్ గాంధి 400 పై చిలుకు సీట్లు గెలిచి కూడా తన హయాంలో ఆఖరి రెండు సంవత్సరాలు ఎక్కడ తన పార్టీ ఎం.పీలే తనను పదవీచ్యుతుణ్ణి చేస్తారో అన్న భయంతో ఏమీ చేయలేకపోయాడు. ఇక సంకీర్ణ ప్రభుత్వాల గురించి చెప్పేది ఏముంది?
ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ ఈ పదకొండు మాత్రం నా దృష్టిలో “ద డిజెనరేషన్ అఫ్ ఇండియా”కి ముఖ్య కారణాలు.
ఇప్పుడు ఏది దారి?
ఇది కేవలం మొన్న ఢిల్లీలో జరిగిన పేలుళ్ళ గురించి కాదు. ఎందుకంటే ఇదే ఆఖరి ఉగ్రవాద చర్య అవుతుందని ఏమీ గ్యారంటీ లేదు. బాధకరమైన విషయమైనప్పటికి, భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటివి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రతి సంఘటనకి విడి విడిగా నిరసన తెలపడం కంటే, ఇలాంటి వాటిని నిరోధించేందుకు ఒక జాతీయ ప్రణాలిక రూపొందించడం ముఖ్యం.
ఎర్ర పార్టీలని, “మేధావులని,” కాసేపు పక్కన పెడదాం. మొదటి వర్గం ధ్యేయం భారత దేశంలోని మెజారిటీ మతాన్ని ఎలాగైన ధ్వంసం చేసి కార్ల్ మార్క్స్ రాజ్యాన్ని స్థాప్పించడమైతే, రెండో వర్గం వారు చప్పట్లకోసం, పనికి రాని అవార్డులకోసం, ఏం చేయడానికైనా వెనుకాడరు. రెండు వర్గాలూ, “అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం” పేరున, మన దేశాన్ని నయా పైసాకి కూడా అమ్మేయడానికి సిద్ధమే. వీళ్ళు మారరు.
మారాల్సింది, మార్పు తేవాల్సింది మనమే. అది ఎవరికి చేతనైన రీతిలో వారు చేయాల్సిన విషయం. ఐతే ప్రజలైనా, పార్టీలైనా, ప్రభుత్వమైనా పాటించాల్సిన మౌలిక ప్రమాణాలు కొన్ని ఉన్నాయి.
ఇవి మనకు ఎప్పుడూ లేవు అని కాదు. పూర్తిగా కొత్తవి అని కూడా కాదు. కాని వందల ఏళ్ళ బానిసత్వంలో ( ముందు ముస్లింల చేతిలో, తరువాత బ్రిటీష్ వాళ్ళ చేతిలో) ఉన్నాక, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కమ్యూనిస్టులు చేసిన అబద్ధపు ప్రచారం (చరిత్ర గురించి కానివ్వండి, కరెంట్ ఎఫైర్స్ గురించీ కానివ్వండి) విన్నాక, మనం ఈ విలువలని మళ్ళీ ఒక సారి నిర్ధారించుకోవల్సిన అవసరం ఉంది.
1) ప్రాణం విలువైనదే, కానీ దానికి ఆత్మ గౌరవం తోడైనప్పుడే ఆ విలువ వచ్చేది.
అన్ని రకాల అవమానాలనీ దిగమింగుకుని, ఎప్పుడూ బెదిరిపోతూ కాపాడుకునే ప్రాణం విలువ అంత ఎక్కువేం కాదు. ఉదాహరణకు జంతువులు కూడా కొన్ని సార్లు చావు తథ్యమని తెలిసినా, తమ పిల్లల్ని కాపాడుకోవడానికి సిద్ధ పడతాయి. ఎందుకంటే తమ పిల్లల్ని రక్షించుకోలేక పోతే అవి తమ బతుకు నిరర్థకం అని భావిస్తాయి.
ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది అవి తాము ఏది విలువయ్యింది అని భావిస్తాయో వాటి గురించి నిస్సంకోచంగా పోరాడతాయని. మనకు సంబంధించింత వరకు ఈ విలువలు పిల్లలైనా కావచ్చు, స్వేచ్చైనా కావచ్చు,ఇంకేదైనా కావచ్చు. కాని మనం ఇది తప్పని సరిగా నేర్చుకోవాల్సిన విషయం.
నా అర్థం ప్రతి చిన్న ఎత్తి పొడుపుకీ, అవమానానికీ, అన్యాయానికీ, ఆత్మాహుతి చేసుకోమని కాదు. నేను చెప్పేది కొన్ని సార్లు మన విలువలని రక్షించుకోవడానికి మన ప్రాణాలు సైతం ఫణంగా పెట్ట వలసి వస్తుందని.
2) అహింస అన్ని వేళలా పనికి రాదు.
గాంధీ గారు మనకు అహింస ద్వారా స్వాంతంత్ర్యం తెచ్చారు, తద్వారా హింస తప్పనీ, కాబట్టి వీధిలో కత్తి చూపెట్టి బెదిరించి దోచుకునే ఆకు రౌడీదీ, సరిహద్దుల్లో చలికి గజ గజ వణికిపోతూ కాపల కాసే సైనికుడిదీ, ఇద్దరిదీ హింసే, రెండిటికి తేడా లేదు, అని వాదించే pacifists భారత దేశానికి చాలా హాని చేశారు.
ఒక వేళ మనకు స్వాతంత్ర్యం అహింస వల్లే వచ్చింది అనుకున్నా, పిడుగుకి బియ్యానికి ఒకటే మంత్రం ఎప్పటికీ పని చేయదు. అవసరాన్ని బట్టి సామ దాన భేద దండోపాయాలని మార్చి మార్చి ప్రయోగించాల్సి వస్తుంది. కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు ఒకోసారి “అనివార్యం యుద్ధం, శరసంధానమే ధర్మం.” దీని అర్థం ముస్లింల మల్లే ప్రతి చిన్న మాటకు కత్తులు దూయడం కాదు. సిక్కుల మల్లే, అవసరమైనపుడు కత్తి దూయడానికి వెనుకాడకపోవడం.
3) సోషలిజం/కమ్యూనిజం/సబ్సిడీలు/రిజర్వేషన్లు పని చేయవు.
కావల్సింది, కొందరిని కొల్ల గొట్టి అందరికీ పంచడం కాదు. అర్హత లేకుండా అందలమెక్కించడమూ కాదు. అందరికి అర్హతను సంపాదించుకోగలిగే వాతవరణాన్ని కలిగించడం. బలవంతుడు బలహీనుడిని అణిచి వేయనీయకుండా అరికట్టడం.
తాత్కాలికమైన సహాయం తాత్కాలికంగానే పని చేస్తుంది. కావల్సింది Long term solution. అందరూ చెప్పే, కాని పెద్దగా పాటించని, “ఆకలితో ఉన్న వాడికి చేపలు ఇవ్వకు. చేపలు పట్టడం నేర్పించు” పరిష్కారం. మళ్ళీ నేను చెబ్తూంది, నిర్ధాక్షిణ్యంగా, ఆకలితో చావబోతున్న వాడికి వల ఇవ్వమని కాదు. ముందు ఆకలి తీర్చు. కానీ అదే అలవాటు చేయకు. అలానే అందరినీ పోటీకి తయారు చెయ్యి. కానీ కొందరికోసం పోటీ రూల్స్ మార్చొద్దు.
4) కులం, మతం, డబ్బు, వంశం, ఆఖరికి ప్రతిభ కంటే కూడా సంస్కారానికి ఎక్కువ గౌరవం ఇవ్వాలి.
దీని అర్థం ప్రతిభని పక్కకి తోసేయమని కాదు. ఆత్మ గౌరవం లేకుంటే ప్రాణానికి ఎలా విలువ ఉండదో, సంస్కారం లేని ప్రతిభ కూడా పనికి రాదు.
కులాన్ని, మతాన్ని, వంశ గౌరవాన్ని, డబ్బుని ప్రాతిపదికగా పెట్టుకుని, ఉద్యోగులనీ, బిజినెస్స్ పార్ట్నర్స్‌ని, జీవిత భాగస్వాము(మిను)లని ఎంచుకుంటే తప్పని సరిగా కావలిసిన ఫలితాలను సాధించలేమని ఇప్పటికే ఋజువు అయ్యింది.
వీటన్నిటికంటే ప్రతిభ ప్రాతిపదిక మీద ఎంపిక చేయడం ఉత్తమం. కానీ, కొద్దిగా ప్రతిభ తక్కువ ఉన్నా, సంస్కారం ఎక్కువ ఉన్న వాళ్ళని ఎన్నుకోవడం ఉత్తమోత్తమం.
5) అభివృద్ధి సాధించాలంటే, అన్నిటికంటే ముఖ్యమైనది infrastructure, law and order మరియు free markets. మిగతావన్నీ కంటి తుడుపు కోసమే.
రోడ్లు, టెలికమ్యూనికేషన్స్, కరెంటూ దేశం నలుమూలలా లభ్యం కావాలి. ఎంత హై పొజిషన్‌లో ఉన్న వారైనా సరే, తప్పు చేస్తే శిక్షించే న్యాయ వ్యవస్థ కావాలి. ప్రభుత్వం regulation పూర్తిగా తగ్గాలి.
ప్రభుత్వం రైళ్ళు నడపక్కర్లేదు. కో-ఆపరేటివ్ బ్యాంకులు పెట్టక్కర్లేదు. ఉచిత మద్యాహ్న భోజన పథకాలు వద్దు, ఋణాల మాఫీలూ వద్దు. Infrastructure, Law & Order, Capitalist markets నిర్మిస్తే, ప్రగతి దానంతట అదే వస్తుంది.
భారతదేశం ఎంత తొందరగా ఈ పై ప్రమాణాలు అమలు చేస్తే అంత తొందరగా super power అవుతుంది. అన్ని రకాలుగా super power…
మరి జునాగఢ్‌ని ఇండియా లాక్కోలేదా?
వంశీ,
నిజానికి ఇది అధోగతి రాయ్ – షాక్మీర్ సమస్య లోని మీ క్యామెంట్‌కి సమాధానం. ఐతే నిడివి పెరిగిపోవడం వల్ల, విషయం ముఖ్యమైనది కనుక, ఒక కొత్త టపా రాయాల్సి వచ్చ్చింది.
I am quoting a portion of your comments verbatim here. People who want to follow the complete thread can read the comments by going to this link.
ఇది మీరు చెప్పింది:
“ఇప్పుడు మీరు చేసిన పై commentని ఒక్క సారి చూసి టిబెట్ సమస్యని పక్కన పెట్టి
కాశ్మీర్ సమస్యని గురించి ఆలోచించండి…:)”
“if you think ‘Instrument of accession’ is the basis… what about junagadh? (dont bring plebiscite here..even if you do..i am sure you will help urselves…)…”
“I never made any arguments if you can see.. All I did was, just posted some of my doubts…. spare my ignorance
…
నా సమాధానం:
మీరు చెప్పినంత ignorant ఏం కాదు మీరు. టిబెట్ గురించి ఒక్క క్షణం ఆలోచించి మళ్ళీ కాశ్మీర్ సమస్యని పట్టించుకోండి అనడంలోనే మీ చాకచక్యం తెలుస్తూంది.
Instrument of accession అనేది ఇండియా పాకిస్తాన్ ఇద్దరూ కట్టుబడిన ఒడంబడిక. అది కేవలం మనం మాత్రమే గాలిలోంచి సృష్టించలేదు. కాబట్టి instrument of accession ఇద్దరికీ శిరోధార్యమే!
హరి సింగ్ జమ్ము, కాశ్మీర్, లడక్ మూడింటికి మహారాజు. ఆయన instrument of accession పై సంతకం చేయగానే ఆ మూడూ మనవయ్యాయి. పాకిస్తాన్‌కి నోరెత్తే అధికారం కూడా లేదు. అలాంటిది వాళ్ళు ఏకంగా దాడి చేశారు.
ఇక జునాగఢ్ అంటారా? ఇండియా జునాగఢ్‌కి తనంత తాను ఎప్పుడూ సైన్యాన్ని పంపలేదు. I repeat. There was never an Indian agression in Junagadh like there was a Pakistani agression in Kashmir.
జునాగఢ్ నుంచి పాకిస్తాన్‌కి land route లేదు. సముద్రం గుండా చూస్తే, అతి సమీపమైన ఓడ రేవు 300 మైళ్ళ దూరంలో ఉన్న కరాచీ. ఈ “విరిగి పడిన ముక్క” పాకిస్తాన్‌లో భాగంగా ఉండే అవకాశమే లేదు.
ఇదే సంగతి కాస్త ఆలస్యంగా జునాగఢ్ అకటావికటపు నవాబుకి, అవివేకపు దీవాన్‌కి తెలిసింది. అసలు జునాగఢ్ పాకిస్తాన్‌లో కలిసిపోగానే ( అవును, జునాగఢ్ పాకిస్తాన్‌తో కలిసింది. భారత్ అడ్డు కూడా పడలేదు!), లక్ష మంది హిందువులు జునాగఢ్ వదిలి పారిపోయారు. జునాగఢ్ ప్రభుత్వం స్తంభించి పోయింది.
ఇంతే కాకుండా చుట్టు పక్కల ఉన్న్న ఇతర సంస్థానాలు (ఇవి భారత దేశంలో విలీనమయ్యాయి), జునాగఢ్‌తో వ్యాపారం చేయడానికి నిరాకరించడం వల్ల, జునాగఢ్ పరిస్థితి చాలా అద్వానంగా తయారయ్యింది.
అక్టోబర్ ఆఖర్లో జునాగఢ్ నవాబు ఖజానాలో ఉన్న డబ్బులన్ని తీసుకుని పాకిస్తాన్‌కి పారిపోయాడు. నవంబర్ 9న జునాగఢ్ దీవాన్ భారత ప్రభుత్వానికి జునాగఢ్‌ని అప్పగించాడు. (అదే రోజు ఆయన కూడా జునాగఢ్ వదిలేసి కరాచికి పారిపోయాడు.)
ఐనా భారత ప్రభుత్వం వెంటనే జునాగఢ్‌ని కలిపేసుకోకుండా ప్లీబిసైట్ ప్రకటించింది. అందులో 91మంది పాకిస్తాన్‌కి అనుకూలంగా వోటు వెయ్యగా, 1,90,779 మంది భారత్‌కి అనుకూలంగా వోటు వేశారు.
కాశ్మీర్‌కి జునాగఢ్‌కి, నక్కకీ నాగలోకానికి ఉన్నంత సామ్యం ఉంది.
జునాగఢ్ విషయంలో భారత్ ఎంత హుందాగా ప్రవర్తించిందో, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అంత దరిద్రంగా ప్రవర్తించింది.
స్వస్తి.
Comments (29)