Cricket Commentary

క్రికెట్ కామెంట్రి


ROLES: ముగ్గురు commentators. ఇద్దరు తెలంగాణా మాండలీకం. ఒకరు కోస్తా.
ACTORS:
SETTING:
COSTUMES:
OTHER ACCESSORIES:
BEGIN
LIGHTS ON

యాదగిరి: నమస్తే! మీ ప్రేక్షకులకూ, గీడ umpiresకి, pavillionల ఉన్న playersకి, అందరికి దండం పెడతాండ. గీ కామెట్రి డబ్బల నేనూ, నన్ను యాదగిరి అంటరు లే, నా దోస్తు కామేశం, expert comments చెప్పెటందుకు పెద్దాయన ఏడుకొండలూ ఉన్నరు. ఇప్పుడు కామెంట్రి కామేశం ఖతర్ నాక్ గా షురూ చేస్తడు.

కామేశం: నమస్కారం. భారత జట్టు toss గెలిచి batting మొదలు పెట్టింది. ఆస్ట్రేలియా క్షేత్ర రక్షకులు తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. Glen McGrath వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బంతి విసిరారు. Tendulkar నెమ్మదిగా దాన్ని బిందువు వైపు తోశారు. Steve Waugh బంతిని ఆపారు. పరుగులు ఏవీ జరుగలేదు. భారత జట్టు సున్నా పరుగులు, Tendulkar సున్నా పరుగులు.

యాదగిరి: (మధ్యలోనే cut చేసి) మొత్తం అందరు గల్పి సున్నా పరుగులు. సాల్ దీ! ఏంది వయా, గట్ల dullగ కామెంట్రి చెబ్తవు! నన్ను చూడు. Glen McGrath గంత దూరంకెల్లి సర్కె సర్కె పరుగెత్తుకుంటా వచ్చిండు. అచ్చి shoot చూసి బాల్ ఏసిండు. బాలు జోరుగ Tendulkar మీదకు సర్రన వచ్చింది. Tendulkar ఎంబటే కొట్టిండనుకున్నావు? లే! రెండు అడుగులు ఎనక్కేసి, మూడడుగులు ముందుకేసి, పక్క పొంటి slipల కెల్లి cut చేసిండు. First Slipల ఉన్న Ricky Ponting ఎలుగుబంటిలెక్క dive గొట్టిండు. కాని బాలు దొర్కలే. గింతల Tendulkar, Ganguly ఉర్కబట్టిర్రు. Boundary తాన బాలు field చేయబోయిన Shane Warne, గబ్రాయించి బాలుని కాల్తో తన్నేసిండు. ఇంకేముంది. బాలు boundary దాటింది. expert comments చెప్పే, ఏడుకొండలు మామా!

ఏడుకొం: ఏమిడిదిరా చెప్పెడిది? ఆ! మా జమానల ఐతే, fielders చేతులతో బాలు ఆపుతూండె. ఈడు సూడు. ఔ గాని యాదగిరి, 1967మె ఒకపారి కాన్పూర్ల నేను కామెంట్రి చెబ్తూంటే ఏమైందనుకున్నవు?

కామేశం: (తనలో తాను) చచ్చాం! ఇక ఈయన సోది వినాలి కామోసు.

యాదగిరి: ఏమయ్యిందే?

ఏడుకొం: Stadiumలకి కుక్కొచ్చింది బిడ్డా. అదేమన్న చిన్న కుక్కనుకున్నావు? లే! పూరా చే ఫుట్ ఉన్నది.

కామేశం: (మధ్యలో అడ్డుపడి) కుక్క ఆరడుగులు ఉండడం ఏంటండీ బాబూ! ఐనా ఇక్కడ ఒక వైపు ఆట ఐపోతూంటే, ఆ కుక్క గొడవెందుకు?

ఏడుకొం: గదే నాకు కోపమొస్తది. expert comments చెప్పమంటరు. మధ్యల వద్దంటరు. ఆటేమున్నది? మన Indian Cricket Team ఐతే గీ మధ్య రోజూ ఆడ్తనే ఉన్నది. ఆడనికి ఎవ్వరు దొరక్కపోతే ఊరు పేరు తెల్వని దేశాలకు cricket నేర్పించి మరీ ఆడ్తూండ్రు భై. Sponsor చెయ్యనికి Coca Cola వాళ్ళు ఐతే బేకార్ గాళ్ళ లెక్క ఎప్పుడు ready గానే ఉంటరాయె! గిసొంటి ఫాల్తూ ఆట కావాల్నా, నా expert comments కావాల్నా?

యాదగిరి: అరే, నువ్వు గట్ల పరేషాను అవుతవేంది, ఏడుకొండలు మామా? నీ ఎక్స్పర్ట్ కామెంట్సే కావాలె. చెప్పు, చెప్పు.

ఏడుకొం: గా కుక్క, లోపటికి దూరి, పిచ్చు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చింది. బాలు నోట్ల కర్చుకుని, batsman ఎనుక పడింది. ఆడేమి చేస్తడు? ముందుకీ వెనక్కీ, వెనక్కీ ముందుకీ, పిచ్ మీద ఉరక పట్టిండు. ముందు bastman ఎనుకాల కుక్క, ముందు bastman ఎనుకాల కుక్క. ఇంకేమున్నది? రన్నుల మీద రన్నులు ఐపోతున్నాయి. గా batsmanని runout చేద్దమంటే బాలేమో కుక్క నోట్ల ఉన్నదాయె. దీని తల్లి, గా ఒక్క బాల్లోనే ఆడి సెంచరీ అయిపోయింది.

కామేశం: (తనలో తాను) చస్తున్నాం ఈయన గారి కోతలు వినలేక. Old Age Homeలో ఉండాల్సిన వాళ్ళని expert comments చెప్పమంటే ఇలానే అఘోరిస్తుంది. (పైకి) అయ్యా, తమరు ఈ కుక్కోపాఖ్యానం చెబ్తూండగా మధ్యలో ఇక్కడ చాలా సంఘటనలు ఐపోయాయండయ్య. ఇక ఆటకి వద్దామా?

ఏడుకొం: అగో యాదగిరి, సూడ్రా ఆడు! మళ్ళ నా మీదకు ఒంటి కాలి మీద లేస్తూండు! గా కుక్కేదో ఈణ్ణి కరిచినా బాగుండె! గిట్లైతే నేను expert comments చెప్ప పో!

యాదగిరి: మామా, నువ్వుండు. నేను కామేశాన్ని సమ్లాయిస్త గద! కామేశం, ఊకే పెద్దాయన్ని ఎందుకయ్యా పరేషాన్ చేస్తవు? గంత పెద్ద ముచ్చటేమయ్యిందని ఫికర్ చేస్తున్నావు? ఏడు కొండలు మామ మాట్లాడుతునప్పుడు ఇద్దరు batsmen out అయ్యి pavillionల వాపస్ పోయిండ్రు. గంతే కద?

కామేశం: (బాధగా జుట్టు పీక్కుంటూ) ఈఈఈఈఈఈ

యాదగిరి: ఆణ్ణి పట్టించుకోకు మామా! ఆ తర్వాతేమయ్యింది?

ఏడుకొం: ఇంకేమున్నది, గందరూ గా కుక్క నోట్లకెల్లి బాలు గెట్ల తీయాలా అని సోచాయించిండ్రు. ఆఖరికి నేనిచ్చిన idea తీసుకొని, పిచ్ మీదకు ఒక పిల్లిని వదిలిండ్రు. గంతే! గా పిల్లిని చూసి గీ కుక్క, నోట్ల బాలు వదిలి, పిల్లెంబడి పడింది. ఖేల్ ఖతం!

కామేశం: (లేచి నిలబడ్తాడు.)

యాదగిరి: గదేందిరో కామేశం, గట్ల లేచి నిలబడ్డవూ?

కామేశం: ఆ, ఏమీ లేదు. ఈయన ఇలా expert comments చెబ్తూంటే, ఇక్కడ ఖేల్ నిజంగానే ఖతం అయ్యేలా ఉంది. ఈ బాధ నేను భరించలేను. దీనికంటే, ఆ stadiumలో జనం మధ్యకెళ్ళి, బటాణీలు అమ్ముకోవడం better. వస్తా!

ఇద్దరూ: ఆఆ!

END
LIGHTS OFF

Advertisements
This entry was posted in నాటికలు. Bookmark the permalink.

One Response to Cricket Commentary

  1. netsri says:

    very good concept, natural dialogues in telangana accent. hilarious.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s