Senior – Part 20

సింధు మాధవి రాక తరువాత రమణ రావులో మునుపు లేని చురుకుదనం వచ్చింది. ఎప్పుడూ గాంభీర్యంతో నిండి ఉండే అతని మొహంలో అప్పుడప్పుడు చిలిపిదనం చోటు చేసుకోవడం మొదలు పెట్టింది.

రమణ రావుకి ఇది ఆఖరి M.S. program. University Dean రమణ రావుకి కొద్దిగా బాధగానే చెప్పాడు. “చూడు రమణ్, ఇక ఈ universityలో ఉండే programs అన్నీ అయిపోయాయి. నువ్వు ఇంక studentగా ఉండేది మరో మూడు semesters మాత్రమే,” అని. అప్పుడే రమణ రావు decide చేసుకున్నాడు, తనతో పాటే సింధూ కూడా graduate కావాలని.

ఒక semester తరువాత…

“అబ్బబ్బా సింధూ, అల్లరి చేయడం మానేసి కొద్దిగా నా మాట వింటావా?” విసుగ్గా అన్నాడు రమణ రావు. అంతకు ముందే మల్లేష్‌కి కాఫీలో epsom salt వేసి ఇచ్చింది సింధు మాధవి. అది తాగిన మల్లేష్ పాపం అటూ, ఇటూ పరిగెడుతున్నాడు. సింధు మాధవి అతన్ని చూసి ఫక్కున నవ్వుతూ రావు వైపు తిరిగింది.

“నేను అల్లరి చేయకపోతే, నువ్వూ, మల్లేష్ uncle చేస్తారా?” కొంటెగా అడిగింది. “అది కాదమ్మ, రేపు exam ఉందా? నిన్ను test చేయాలి. అన్నిటికీ టక టకా సమాధానం చెప్పేయి. తరువాత మల్లేష్ uncleని ఏడిపించవచ్చు,” బుజ్జగిస్తున్నట్టు అన్నాడు రావు. అప్పుడే toilet నుంచి బయటకు పాక్కుంటూ వస్తున్న మల్లేష్ అది విని, అదే speedతో బయటకు పాక్కుంటూ వెళ్ళిపోయాడు. అది చూసిన రమణ రావు, సింధూ ఘొల్లున నవ్వుకున్నారు.

కాల చక్రం ఇంకో సారి గిర్రున తిరిగితే ….

ఆ రోజు graduation day. కానీ ప్రతి graduation dayకి, ఆ graduation dayకి చాలా తేడా ఉంది. ఆ రోజు రమణ రావు ఆఖరి graduation day. ముందుగా సింధు మాధవి dias మీదికి వెళ్ళి పట్టా పుచ్చుకుంది. అందరు హర్షధ్వానాలు చేశారు.

ఆఖర్లో రమణ రావు వంతు వచ్చింది. రావు stage మీదికి వెళ్ళగానే auditorium అంతా “రావు సాబ్ జిందాబాద్, రావు అన్న కి జై,” అన్న అరుపులతో నిండి పోయింది. రావు పైకి వెళ్ళగానే , Dean రావుకి “MS-e-Hind” అన్న బిరుదును ప్రసాదించి ఇలా అన్నాడు.

“I always thought that most of the international students were really after jobs rather than pursuing higer studies. Rao has proven me wrong time and again. I have waited for him to abandon school and go get that job. It has not happened.

I think he cannot stay away from school. May be scientists will find a name for this peculiar phenomenon in the days to come. But I think that I should do my bit to make him stay where he belongs.

On the behalf of the university, Rao will be the honorary professor for all the departments in the University. He won’t belong to any specific department. Give him a big five,” అని కూర్చున్నాడు.

Auditoriumలో ఎప్పుడూ లేని అలజడి. ఒక సముద్రం ఘోషిస్తూందా అనేలా ఉంది అక్కడి ధ్వని! రావు తడి కళ్ళతో చుట్టుతా చూశాడు. సింధు మాధవి చిన్న పిల్లలా కేరింతలు కొడుతూ ఎగురుతూంది. మల్లేష్ పిల్లి మొగ్గలు వేస్తూ తనకు చేతనైన రీతిలో తన ఆనందాన్ని ప్రకటిస్తున్నాడు. అప్పుడే auditoriumలోకి ప్రవేశిస్తున్న బిందు మాధవి రావుని చూసి తన బొటన వేలును విజయ సంకేతంలా చూపించింది. రావు కూడ reciprocate చేసి బిందు మాధవికి మాత్రమే అర్థమయ్యేలా నిర్లక్ష్యంగా తలెగరేశాడు. ఆ చర్యలో “చూశావా! అనుకున్నది సాధించాను,” అన్న అర్థం ఉంది.

Advertisements
This entry was posted in సీనియర్. Bookmark the permalink.

5 Responses to Senior – Part 20

 1. Jyothi says:

  I Really enjoyed alot and can’t stop laughing…especially Pittsburg episode.
  Expecting more from you….

 2. venu says:

  Excellent…..

 3. kowsik says:

  ఈ కథలో చాలా ఎమోషన్ ఉందండీ… అదరగొట్టేసారు!

 4. Yogi says:

  Really enjoyed alot and can’t stop laughing…especially Pittsburg episode.Super one…
  Expecting more from you….

 5. MADHU says:

  CHALA BAGUNDI ANDI ( RAMAN LANTI VARU EKKADO OKARU VUNTARU)HE IS GREAT

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s