Senior – Part 19

ఇరవై సంవత్సరాలు దొర్లిపోయాయి. University వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఐతే మార్పు లేనిది ఒకటే! ఆ universityలో రమణ రావు ఉనికి. రమణ రావు తన పదమూడో M.S. programలో ఉన్నాడు.

ఆరోజు కూడా యధావిధిగా పొద్దున్నే Universityకి బయలుదేరాడు రమణ రావు. ముందుగా cafetariaకి వెళ్ళాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర ముగ్గురు professors కూర్చుని వున్నారు. రమణ రావు రాగానే వాళ్ళందరూ లేచి వినయంగా నిలబడ్డారు.

“కూర్చోండి, కూర్చోండి! work ఎలా సాగుతోంది?” ప్రశ్నించాడు రావు. “ఈ semesterకి syllabus ఈ విధంగా సెట్ చేశానండీ. కొద్దిగా మీరు చూసి correct చెయ్యాలి,” అన్నాడు వారిలో ఒకాయన.

“సరే, చేస్తాను లెండి. రేఫు నేను ఫ్రీ,” అన్నాడు రావు. “రేపు నేను ఒక course first time offer చేయబోతున్నాను. మీరు demonstration studentలా రావాలి,” request చేశాడు, ఇంకొక professor. “ఏదో, మీ అభిమానం,” నిర్లిప్తంగా అన్నాడు రావు.

అప్పుడే cafetaria entrance వైపు ఎందుకో ఒకసారి చూశాడు రావు. అదే సమయానికి cafetariaలో ఒక అమ్మయి enter అయ్యింది. అంతే! రమణ రావు ఊపిరి ఒక్కసారి స్థంబించింది. “బిందూ …” మెల్లగా గొణిగాడు రావు.

“ఇదెలా సాధ్యం. ఈ అమ్మాయి బిందూ లానే ఉంది అచ్చూ. కాని వయసు చూస్తే 19 ఏళ్ళు ఉన్నట్టుంది. ఇది ఎలా సాధ్యం?” రమణ రావు మనసులో ఆలోచనలుదొర్లుతున్నాయి.

ఆ అమ్మాయి సూటిగా వారు కూర్చున్న టేబుల్ దగ్గరే వచ్చిఆగింది. “ఇక్కడ రమణ రావు అని ఒక student ఉండాలి, మీకు తెలుసా, uncle?”అంది.

అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని, “నేనే రమణ రావుని. మీరూ?” ప్రశ్నార్థకంగా చూశాడు రావు. సమధానంగా ఆ అమ్మాయి ఒక ఉత్తరం అందించింది. వణుకుతున్న చేతులతో ఆ వుత్తరాన్ని విప్పి చదవడం మొదలుపెట్టాడు రావు.

“రమణ్! …………………………………”ఆ సంబోధన చూసి ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు రావు. బిందూ ఒక్కతే తనను అలా పిలిచేది.

“రమణ్! గుర్తు పట్టావా నన్ను! నేనే బిందూని! ఇన్ని రోజుల తరువాత నాకు నువ్వు ఒక్క సారి ఎలా గుర్తుకొచ్చావు అని అనుకుంటున్నావా? నేను నిన్ను మరిచిపోయింది ఎప్పుడు రమణ్! పెళ్ళి చేసుకున్నఒక భారత స్త్రీ ఇలా మాట్లాడకూడదు. కాని ఏం చెయ్యను? నీ స్థానంలోఆయన్ని ప్రతిష్టించాలన్న నా ప్రయత్నంలో నేను పూర్తిగా ఓడిపోయాను.

ఆయన నన్ను ప్రేమగా చూసుకోరని కాదు. నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. ఆయనకు నీ గురించి కూడా అంతా తెలుసు. కానీ నన్నుఆయన ఏమీ తప్పు పట్టలేదు. కానీ నా మనసు ఏనాడో నీకు అంకితం చేశాను రమణ్! నీ తరువాతే ఎవరయినా! ఇలా చెప్పడానికి నేనేమీ సిగ్గుపడడంలేదు. పై పెచ్చు గర్వపడుతున్నాను.

నీ ముందు నిలుచుని వున్నది నా రక్తం పంచుకుని పుట్టిన నా కూతురు. నీ పేరే పెట్టాలని అనుకున్నాను. అమ్మాయి కాబట్టి రమణమ్మ అని ఆయనకు suggest చేశాను. అది విన్నప్పటినుంచి ఆయనకి ఒకటే వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి. నా మాంగల్యం కాపాడుకోవడానికి ఆ పేరుపెట్టాలన్న కోరిక అణుచుకున్నాను. నా పోలికలతోనే పుట్టింది కాబట్టినాలాంటి పేరే పెట్టాను. సింధు మాధవి. నీకు నచ్చిందా?

అది 19 ఏళ్ళకే Bachelors complete చేసింది. Masters చదువుతానని గొడవపెట్టింది. అది నీ పర్యవేక్షణలో తన masters complete చేయాలని నా ప్రగాఢమైన కోరిక. అందుకే నీ దగ్గరికే పంపాను. ఇప్పుడు నాకు ఎంతో నిశ్చింతగా ఉంది రమణ్. దీన్ని నీ స్వంత కూతురిలా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. దాని graduation dayకి మిమ్మల్ని కలవడానికి వస్తాను.

నీ దాన్ని అని చెప్పుకోలేని అభాగ్యురాలు,

బిందూ.”

ఉత్తరం ముగించి అలా శిలావిగ్రహంలా ఉండిపోయాడు రావు.

Advertisements
This entry was posted in సీనియర్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s