Senior – Part 18

బిందు మాధవితో సంభాషణ తరువాత రమణ రావులో చాలా మార్పు వచ్చింది. తను పూర్తిగా చదువుకే అంకితం అయిపోయాడు. ముందులా అందరితో కలివిడిగా ఉండడం లేదు. మాటలు కూడా చాలా తగ్గించేశాడు. ఎవరికీ ఈ మార్పు అర్థం కాలేదు. అయినా ఎవరూ రమణ రావుని అడిగే సాహసం చేయలేకపోయారు.

ఇటు బిందు మాధవి కూడా చాలా ముభావంగా తయారయ్యింది. ఎప్పటిలా సోమూ చేతుల్లోనుంచి lunch box లాక్కుని అందులోది తినెయ్యడం, లేదా నర్సింలు సైకిల్ అతనికి చెప్పకుండా తీసుకుని వెళ్ళడంలాంటివి మానేసింది. ముందు వారిద్దరూ ఈ మార్పుకి బోల్డు ఆనందించినా, తరువాత కొంత వెలితిగా ఫీల్ అయ్యారు.

కాలచక్రం మాత్రం ఎవ్వరికోసం ఆగకుండా అలా గిర్రున తిరుగుతూనే ఉంది. సోమూ, బిందు మాధవి ఒకే సారి graduate అయ్యారు. అక్కడి రివాజు ప్రకారం graduate అయిన దేశీ students అంతా వచ్చి రమణ రావుకి పాదాభివందనం చేశారు. రమణ రావు వారిని తడి కళ్ళతో ఆశీర్వదించాడు. “మళ్ళీ M.S. చేయాలని కోరిక ఉంటే, నాకు చెప్పండి. మంచి Universtiyలో సీటు ఇప్పిస్తా,” అన్నాడు గద్గదమైన స్వరంతో.

ఒకరి తరువాత ఒకరు students అంతా వెళ్ళిపోసాగారు. బిందు మాధవి వెళ్ళిపోయే రోజు, రమణ రావు దగ్గర వచ్చి కాసేపు మౌనంగా కూర్చుంది.వారి పెదవులు కదలకపోయినా, మనసులు మాట్లాడుకున్నాయి. రమణ రావు కళ్ళతోనే బిందు మాధవికి వీడ్కోలు చెప్పాడు.

మళ్ళీ fall semester వచ్చింది. కొత్త students రావడం మొదలు పెట్టారు.వాతవరణం మళ్ళీ సందడిగా మారింది. కాలచక్రం దాని పని అది చేసుకుపోతూంది.

Advertisements
This entry was posted in Senior. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s