Senior – Part 17

జవాబు చెప్పడానికి ముందు రమణ రావు ఒకాసారి గాఢంగా నిశ్వసించాడు.

“నేను day time వద్దు అన్నది , నిన్ను రాత్రి ఫోన్ చేయమని కాదు. నీకు ఊరికే facts గుర్తు చేశానంతే. అసలు నీ status ఏంటి, నా status ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా?” అడిగాడు.

“ఎంత మాటన్నావు రమణ్! ఆస్తి మన ప్రేమకు ఎప్పుడూ అడ్డు రాదు,” ఆవేశంగా అంది బిందు మాధవి.

“అది కాదు బిందూ, మన visa status గురించి, నేను మాట్లాడేది,” అన్నాడు రావు.

“మనం ఇద్దరం F-1 కద?” ప్రశ్నించింది బిందు మాధవి.

“అదే నేననేది! నువ్వు కొన్ని రోజుల్లో H-1కి, ఆ తరువాత గ్రీన్ కార్డ్‌కి, ఆ పైన citizenshipకి అలా అలా ఎదిగి పోతావు. నేనేమో ఇలా F-1 గానే ఉండిపోతాను,” కొద్దిగా బాధగా అన్నాడు రావు.

“అదేంటి? నువ్వు మాత్రం ఉద్యోగం చేయవా, H-1, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవా?” అయోమయం బిందూ గొంతులో ధ్వనించింది.

“అందుకే, బిందూ, ఒక వ్యక్తిని చూసి ఎప్పుడూ తొందరపడకూడదు. ఎప్పుడూ నిర్లక్ష్యంగా కనిపించే నా వెనుకాతల ఒక పెద్ద విషాద గాధ ఉంది,” రమణ రావు గొంతు బరువయ్యింది.

“ఇది చిన్నప్పటి కథ. నేను అప్పుడు టెంత్ క్లాస్. సెలవుల్లో మా ఊరు వెళ్ళాను.మా దాయాదులు కూడా అక్కడే ఉన్నారు. అనుకోకుండా ఒక సారి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. దాయాదుల సంగతి నీకు తెలీనిదేముంది. మధ్యలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అదృష్ట వశాత్తూ మేము ఇంట్లో ఉన్నాం, పచ్చ గడ్డి బయట ఉండడంతో ఏమీ హాని జరగలేదు.

కానీ, ఒకరినొకరు హాస్యం చేసుకోవడం జరిగింది. చివికి చివికి గాలి వాన అయినట్టు, హాస్యం కాస్తా అపహాస్యం అయ్యింది. మా దాయాదులు బాగ చదువుకున్నారు. మా వంశం అంతా చదువు తక్కువ వాళ్ళని ఎగతాళి చేశారు. అసలు మాలో ఒక్కరు కూడా Masters డిగ్రీ తెచ్చుకోలేక పోయారని, వాళ్ళకైతే మొత్తం కలిపి 12 masters డిగ్రీలు ఉన్నాయని గొప్పలు పోయారు. అప్పుడే నేనొక నిర్ణయం తీసుకున్నాను.మొత్తం మా చుట్టాల ముందు ప్రమాణం చేశాను: నేనొక్కడినే 13 masters చేసి మా పరువు నిలబెడతానని.

అప్పటినుంచి నా జీవితంలో చదువు తప్ప వేరే ధ్యేయం లేదు. ఇప్పటికి రెండు masters తెచ్చుకోగలిగాను. కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో వుంది. ఎవరో కవి అన్నట్టు, ‘The beds are crowdy, dank and deep. But I have promises to keep and miles to go before I weep, I have miles to go before I weep’. ఇప్పుడు చెప్పు బిందూ, నా జీవిత ధ్యేయం నెరవేరేవరకూ నేనెలా పెళ్ళి చేసుకోను? ఎలా చేసుకోను?” ఆవేశంతో రమణ రావు గొంతు వణికింది.

బిందూ స్థాణువులా రమణ రావుని అలానే చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళకు రమణ రావు ఒక మేరు పర్వతంలా కనపడుతున్నాడు. తన వంశ గౌరవానికోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహానుభావుడితడు.

“రమణ్, నేనూ నీతోనే ఈ universityలో ఉండిపోతాను. ఇద్దరం చెరి 6 M.Sలు చేద్దాం. అప్పటివరకు నేను నీ కోసం వేచి ఉంటాను. ఆ తరువాతే మనం పెళ్ళిచేసుకుందాము. సరేనా?” అంది.

“లేదు బిందూ, ఇది నా యజ్ఞం. దీనికి నేనే సమిధను కావాలి. వేరే ఎవరి జీవితం పాడవ్వడానికి వీల్లేదు. నామాట విని నువ్వు ఇంకెవరైనా మంచి అబ్బాయిని పెళ్ళి చేసుకో. నాకు ఆ టైంలో semester exams లేకుంటే నీ పెళ్ళికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను.ఈ జీవితం ఇలా పుస్తకాలకే అంకితం కావాలి,” శూన్యం లోకి చూస్తూ అన్నాడు రమణ రావు.

బిందు మాధవి కళ్ళలోనుంచి ధారాపాతంగా నీళ్ళు కారుతున్నాయి. ఆ నీరెండలో వాళ్ళు సమాంతర రేఖల్లా, ఎప్పుడూ కలువని రైలు పట్టాల్లా ఉన్నారు.

Advertisements
This entry was posted in సీనియర్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s