Senior – Part 16

ఎవరూ అనుకోని విధంగా జరిగిపోయింది ఆ సంఘటన. బిందు మాధవి రమణ రావు ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం తటస్థపడలేదు. కానీఒక రోజు ఇద్దరూ administrative building ముందు ఎదురయ్యారు. ఆ chance వదలదలుచుకోలేదు బిందు మాధవి.

“మీతో కొద్దిగా మాట్లాడాలి. మనం green monkeys parkకి వెళ్దామా?” అడిగింది రమణ రావుని. “ఎందుకు, ఇక్కడమాట్లాడుకుంటే ఏమౌతుంది,” నిర్లక్ష్యంగా తల ఎగరేస్తూ అన్నాడు రావు.

“Please, నా కోసం,” request చేసింది బిందు మాధవి. “సరే పదండి,” అన్నాడురావు. వారిద్దరూ ఎక్కిన కారు green monkeys park వైపు దూసుకుపోయింది.

“ఛెప్పండి, ఏం మాట్లాడాలో,” అన్నాడు రావు. బిందు మాధవి “ఎలా మొదలుపెట్టాలో తెలియడం లేదు,” అంది. “మొదట్నుంచీ మొదలు పెట్టండి,” అన్నాడు రావు.

“కొద్ది రోజులుగా, నేను నాలా లేను. ఆకలి వేసినట్టు ఉన్నా అన్నం సహించదు.ఎంత అలసిపోయి ఉన్నా నిద్ర రాదు. ఎప్పుడూ మనస్సు గజిబిజిగా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు,” గట్టిగా నిట్టూర్చింది బిందు మాధవి.

“My God, ఇలాంటి రోగం గురించి నేనెప్పుడూ వినలేదు. మీరు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి,” ఆందోళనగా అన్నాడు రావు.

“అబ్బా, మీరు అర్థం చేసుకోవట్లేదు. మిమ్మల్ని చూస్తూంటే నాకు కళ్ళు తిరుగుతాయి. ఒంట్లో దడ పుట్టుకొస్తుంది. చేతులు చెమటలు పడతాయి,” explain చేసింది బిందు మాధవి.

“ఓ, ఐతే ఇది nervous weaknessలా ఉంది,” కొద్దిగా confuse అయ్యాడు రావు.

“ఒక స్త్రీ ఇంతకంటే సూటిగా ఇంకెలా చెప్పగలదు? నేను నిన్ను ప్రేమిస్తున్నారమణ,” అంది బిందు మాధవి. ఘోరమైన నిశ్శబ్దం అక్కడ నెలకొంది.

“ఎన్ని రోజులకు తనను ఒకరు రమణ అని పిలిచారు,” రమణ రావు ఆశ్చర్యపోతూ అనుకున్నాడు. నిజం, రావుని గత రెండు సంవత్సరాలుగా ఎవ్వరూ రావు సాబ్,లేదా అన్నా, లేదా రమణ బాబూ, తప్ప ఇలా మొదటి పేరుతో సంబోధించింది లేదు.

“నువ్వు చెప్పేది నిజమా, బిందూ,” అన్నాడు రావు. ఈ సారి ఆశ్చర్యపోవడం బిందు మాధవి వంతయ్యింది. ఆమెను అమెరికా వచ్చాక బిందూ అంటూ పిలిచిన మొదటి మగాడు రావు. ఆ పిలుపు ఆమెలో పులకింతలు రేపింది.

“నిజం రమణ,” సిగ్గుతో బిందూ కళ్ళు వాలిపోయాయి. “నువ్వు సరేనంటే ఇప్పుడే మన పెద్దలతో మట్లాడవచ్చు,” అంది.

“ఇప్పుడు day-time phone rates ఉంటాయి, బిందూ. పేలిపోతుంది,”అన్నాడు రావు. “అంటే రాత్రి పూట ఫర్లేదన్న మాట, కాబట్టి నువ్వు ఒప్పుకున్నట్టేనా?” ఆనందంగా అడిగింది బిందు మాధవి. రమణ రావు సమాధానం చెప్పడానికి గొంతు సవరించుకున్నాడు.

Advertisements
This entry was posted in Senior. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s