Senior – Part 15

Computer Lab సంఘటన:

Spring semester ఆఖరికి వచ్చేసింది. బిందు మాధవి తన roomనుంచి బయలు దేరుతూ ఒక సారి lab వైపు నడిచింది. అప్పుడు రాత్రి 3 గంటలు కావస్తూంది. Labలో ఒక్క రమణ రావు తప్ప ఎవరూ లేరు.

రమణ రావుని చూసి ఖంగు తింది బిందు మాధవి. రమణ రావు జుత్తు చెదిరి పోయి ఉంది.గడ్డం బాగా మాసి పోయి ఉంది. కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. ఐనా తదేక దీక్షతో monitor వంకే చూస్తున్నాడు.

బిందు మాధవి రమణ రావు పక్కన వెళ్ళి నిల్చుంది. ఒక ౠష్యశృంగుడిలా, రమణ రావు ఏకాగ్రత చెదరలేదు. బిందు మాధవి గట్టిగా గొంతు సవరించుకొంది. తపోభంగం చెందిన మునిలా చూశాడు రమణ రావు.

“Sorry, మిమ్మల్ని disturb చేయాలనికాదు. కానీ ఇంత రాత్రి పూట మీరొక్కరే ఏం చేస్తున్నారు?” ప్రశ్నించింది బిందు మాధవి. “సుందర మూర్తి assignment చేస్తున్నాను,” చెప్పాడు రావు. “మరి సుందర మూర్తి ఏం చేస్తున్నాడు?” ఆశ్చర్యంగా చూసింది బిందు మాధవి.

“వాడు newspapers deliver చేస్తున్నాడు. వాడికి ఇప్పుడు డబ్బులు అవసరం. అందుకే నేను వాడి బదులు ఇలా …” మెల్లగా అన్నాడు రావు.

“మీరు భోజనం చేసి ఎన్ని రోజులు అయ్యింది?” అడిగింది బిందు మాధవి. రమణ రావు రెండు వేళ్ళు చూపెట్టాడు. “నిద్ర పోయి?” రమణ రావు నాలుగువేళ్ళూ పిడికిలి బయటకు తెరుచుకున్నాయి. “My God!” అనేసింది బిందు మాధవి.”మరి మీ course?” అడిగింది.

“నా courseలో నేను ‘Incomplete’ grade తీసుకున్నాను, బిందు మాధవి. నేను ఇంకా ఇక్కడ ఉంటాను. సుందర మూర్తి గాడు graduate కావాలి,” నిర్లక్ష్యంగా తలెగరేసాడు రావు.

బిందు మాధవి ఏదో అనేంతలో, అడ్డుపడ్డాడు రమణ రావు. “నాకు తెలుసు మీరేమంటారో. నాది ఎంతో గొప్ప మనసు అంటారు. నిస్వార్థానికి ప్రతిరూపం అంటారు. కాని నాకు పొగడ్తలు నచ్చవు. మీరు ఇంటికెళ్ళండి. నన్ను నా పని చేసుకోనివ్వండి,” అదే నిర్లక్ష్యంతో అన్నాడు రావు.

ఆ నిర్లక్ష్యమే తనను రమణ రావు వైపు ఆకర్షితం చేసింది, గట్టిగా నిట్టూర్చింది బిందు మాధవి, ఇహలోకంలోకి వస్తూ. ఆమె మనసులో ఒక నిర్ణయం రూపు దిద్దుకోసాగింది. స్త్రీ హృదయం అగాధం కదా!

Advertisements
This entry was posted in Senior. Bookmark the permalink.

One Response to Senior – Part 15

  1. another_old_timer says:

    Read all 15 parts at a stretch. It was a bit nostalgic – Geo Metro, Radha Krishna, Workstations etc. I assume you did your Masters in Chicago area? Keep up the good work.
    Wonder no one stumbled on this (Mine was the first comment) before.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s