Senior – Part 13

కాల చక్రం గిర్రున తిరిగింది. సోమూ, బిందు మాధవి group university కి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది. రమణ రావు తన మూడో M.S. మొదలుపెట్టాడు. మల్లేష్ కి అదే ఊర్లో job వచ్చింది. సోమూ, బిందు మాధవి తమ last semesterకి చేరుకున్నారు.

రమణ రావు కీర్తి అక్కడి local educational circles వరకు పాకింది. ఆ ఊర్లోని local newspaper వాళ్ళు రమణ రావువిద్య దాహాన్ని గురించి, తమ paperలో ప్రచురించే “పుర్రెకో బుధ్ధి, జిహ్వకో రుచి” శీర్షిక కింద (English పేరుకి తెలుగు అనువాదం లెండి.) రమణ రావుతో interview తీసుకున్నారు.

“తీరిక వేళల్లొ మీరేం చేస్తుంటారు?”అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు రమణ రావు చిలిపిగా ఇచ్చిన సమాధానం, “Thesis చేస్తుంటాను,” బాగా పేలింది.

ఆఖరి semester కావడంతో బిందు మాధవి, సోమూలు ఉద్యోగాల వేట ప్రారంభించారు. బిందు మాధవి labలో కుర్చుని ఉండగా రమణ రావు అక్కడికి వచ్చాడు.

“ఏంటి సంగతులు, బిందు మాధవి గారు? job search ఎంత వరకు వచ్చింది?” ఆప్యాయంగా అడిగాడు.

బిందు మాధవి మనసు ఒక్క సారి ఆనందంతో నిండి పోయింది. ఈ మధ్య బిందు మాధవి గమనించిన విషయం అది. రమణ రావు గురించి ఆలోచించినా, అతని సాన్నిధ్యంలో ఉన్న ఆమెకి చాల సంతోషంగా ఉంటోంది. ఈ ఒకటిన్నర సంవత్సరం నుంచి రమణ రావుని పరిశీలించి అతని వ్యక్తిత్వం మీద ఎంతో అభిమానం పెంచుకుంది ఆమె.

ఎంత సేపటికీ బిందు మాధవి మాట్లాడక పోయేటప్పటికి రమణ రావుకి చిరాకు ముంచుకొచ్చి, “ఏంటండీ? అప్పుడే job చేసేస్తున్నట్టు ఊహించుకుంటున్నారా?” గొంతు పెంచి గట్టిగా అడిగాడు.

బిందు మాధవి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి ఘొల్లున నవ్వేసింది. ఆమె గమనించిన ఇంకో విషయం అది! రమణ రావు ఏం మాట్లాడిన ఆమెకు ఆపుకోలేని నవ్వు వచ్చేస్తోంది. ఆమెకి తన స్థితి తనకే అర్థం కావట్లేదు. రమణ రావు ఆమె వంక విచిత్రంగా చూస్తూ, తన తల బరుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ప్రియమైన పాఠకులార! బిందు మాధవి ప్రేమలో పడిందని మీరిప్పటికే గ్రహించి ఉంటారు. విశ్వజనీనమైన ప్రేమలో కొట్టుకు పోతున్న ఆమె జీవితం ఏ మలుపు తిరగనుందో మరి!

Advertisements
This entry was posted in Senior. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s