Senior – Part 11

Pittsburg కల నుంచి మేలుకోవడానికి సోమూ కి ఒక వారం పట్టింది. అప్పటికీ అతనికి shock పూర్తిగా పోలేదు. ఒక రెండు నెలల వరకునిద్రలో లేచి “No, నేను glove box కింద కూచోను,” అని గట్టిగా అరిచి అందరిని నిద్ర లేపి మళ్ళీ పడుకునే వాడు.

Fall semester అయిపోయింది.

ఒక రోజు హడావుడిగా లోపలకు వచ్చాడు నర్సింలు. “సోమూ, గీ రొజుమనల్ని ఒకాయన ఇంటికి బోజనానికి పిల్చిండు. మన Hyderabad వోడు.evening పోదాం. మంచిగా ఉడికిన అన్నం తిని చాలా రోజులు అయ్యింది,” అనందంగా అన్నాడు.

“వంట అంటే గుర్తు వచ్చింది. సోమూ, నిన్న నువ్వు వండిన కూర పేరేంటి?” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుందర మూర్తి. “వంకాయ కూర,” చెప్పాడు సోమూ. “ఛ, ఐతే ఇద్దరం bet ఓడిపోయాం అన్న మాట,” బాధగా అన్నాడు మూర్తి.

“Bet ఏమిటీ, ఓడిపొవడం ఏమిటీ?” ఆశ్చర్యంగా చూసాడు సోమూ. “నువ్వు వండింది మాడిపోయిన ఆలు కూర అని నేను, కాదు jamaicaలో పెరిగే జింగ్ జుంగ్వా కూర అని మల్లేష్ వాదించుకున్నాం. అసలు అది వంకాయ కూర అని మాలో ఎవరికీ తట్టలేదు,” సుందర మూర్తి గొంతులో బాధ కనిపించింది.

సోమూ కోపంగా యేదొ అనబోయేంతలో, నర్సింలు “సాయంత్రం ఆరు గంటలకుready గా వుండండి,” అని బయటకు వెళ్ళిపోయాడు.

Scene మారితే …..

“ఆ, అలా నేను 1975 లో, ఏంటి వింటున్నారా? 1975 లో నా ఆరవ jobమారాను,” విశాలంగా నవ్వారు రాధా కృష్ణగారు. చుట్టూ కూర్చునివింటున్న students మొహాల్లో అణుచుకుంటున్నా ఆగని బాధ కనిపించింది.

అప్పటికి 8:30 కావస్తోంది. ఆయన దాదాపు 2 గంటలనుంచి శ్రోతలనుచీల్చి చెండాడుతున్నారు. సోమూ dining table మీద ఉన్న పదార్థాలనుచూసి తన లో తానే గుటకలు వేశాడు. ఈ చిత్ర హింస తరువాత తిండి అనే program లేకపోయింటే ఆ పాటికి రాధా కృష్ణ గారు murder ఐపోయిండేవారు.

“ఊ, మీ మొహాలు చూస్తూంటే ఆకలిగా ఉన్నట్టుంది. పదండి భోజనానికి లేద్దాం,” అన్నారు ఆయన.

సోమూ labలో MCI dealతరువాత మనుషులు అంత వేగంగా కదలడం ఇంకోసారి చూసాడు. 15 నిమిషాల వరకు అక్కడ అప్పుడప్పుడు plates కదలిక తప్ప ఏమీవినిపించలేదు.

“పాపం పిల్లలు, సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులుఅయ్యిందో,” అనుకున్నారు రాధా కృష్ణగారి ఆవిడ.

Advertisements
This entry was posted in సీనియర్. Bookmark the permalink.

2 Responses to Senior – Part 11

 1. Chandu says:

  మురళి గారు , ఏదో టైం పాస్ కోసం browse చేస్తు మీ “సీనియర్” కధ చదవటం మొదలు పెట్టాను. ఆద్యంతం చాల ఆసక్తికరంగా, చమత్కారం సెంటిమెంటు మేళవించి బహు చక్కగా వ్రాశారు. చాల కాలం తర్వాత ఒక మంచి కధ చదివిన ఆనందం లో మిత్రులందరికి ఈ కధను అనువదించి మరి చెప్పాను.
  I love the compiler.. the messages are hilarious 🙂 …

  • Murali says:

   చందూ గారూ,

   థాంక్స్! ఇది నా మొట్ట మొదటి కథ.

   నాకు కూడా అత్యంత ప్రీతి పాత్రమైనది.

   🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s