Senior – Part 12

రాధా కృష్ణ గారి ఇంటి నుంచి వచ్చాక ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు.ఎవరైనా ఏమన్నా మాట్లాడాలని చూస్తే అంతా వాణ్ణి ఉరిమి చూసేవారు. పాపం వాడు silent అయిపోయేవాడు. రాధా కృష్ణ గారి వాగ్ధాటి effect వాళ్ళ మీద అన్ని రోజులు ఉంది మరి! కొన్నాళ్ళకు అందరూ మనుషుల్లో పడ్డారు.

ఒక రోజు నర్సింలు హడావుడిగా లోపలికి వచ్చాడు. నర్సింలు ఎప్పుడూ అంతే. వచ్చీ రాగానే “జగదీష్ అని నాకు ఎరుకైన ఇంకొకాయన పిలిచిండు భై. ఇయ్యాల సాయంత్రం 6 గంటలకు dinner,” అన్నాడు.

అంతే. రావు నర్సింలుని కింద పడేసి వాడి గొంతు పట్టుకున్నాడు. “ఏరా, పోయిన సారి జరిగింది అప్పుడే మరిచిపోయావురా,” అన్నాడు కోపంగా. “ఒక్కటి గుంజన్నా. సాలె గాడు, దావత్ అని తోలుకపోయి జీనా హరాం చేసిండు,” మల్లేష్ రావుకి వత్తాసు పలికాడు.

“నా మాట వినుర్రి భై! ఈల్లు అందరు మన తీర్నే young and dynamic. గిప్పుడిప్పుడే ఉద్యోగాలు చేస్తుర్రు కాబట్టి ఈల్లకు మన students గురించీ ఎరుకే,” బ్రతిమాలాడు నర్సింలు. అందరూ కాసేపు ఆలోచించి “సరే,” అన్నారు.

సాయంత్రం కానే అయ్యింది. రావు బృందం జగదీష్ ఇంటికి చేరుకున్నారు. అప్పుడే జనాలు అక్కడ గుమిగూడుతున్నారు.కార్లలోనుంచి దిగుతున్న యువతీ యువకులను చూపించి నే చెప్పలే అన్నట్టు కళ్ళు ఎగరేశాడు నర్సింలు. అంతా ఇంట్లోకి ప్రవేశించారు.

సోమూకి లోపలికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది. సోమూ drawing hallలోకి రాగానే ఒకాయన ఎదురై, “మీరు H-1 కదూ,” అన్నాడు ఆప్యాయంగా. సోమూ sincereగా “కాదండి, నా పేరు సోమూ,” అన్నాడు. ఆయన ఘొల్లున నవ్వాడు. “అబ్బ, యేం జోక్ వేశారండీ,” అంటూ కడుపు పట్టుకున్నాడు. సోమూ ఇంకేదో అనేంత లోపల ఆయన, “ఇంకేం చెప్పకండి బాబూ, నేను తట్టుకోలేను,” అంటూ పొట్ట పట్టుకొని అక్కడినించీ వెళ్ళిపోయాడు. సోమూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూసి ముందుకి కదిలాడు.

అక్కడ ఉన్న ఉద్యోగస్తుల గుంపు సోమూని చూడగానే టక్కున react అయ్యారు. “Multiple entryకి Mexico ఎప్పుడు వెళ్తున్నారు?”, “Green card processing start అయ్యిందా?”, “లేక పోతే మీకు Labor Clearance వచ్చేసిందా?”, రక రకాల ప్రశ్నలు ఒక్క సారి దూసుకొని వచ్చాయి. సోమూ ఖంగారు పడి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. జగదీష్ వచ్చి అతన్ని రక్షించాడు. “ఈయన ఇంకా student లెండి,” అంటూ.

“ఓ, స్టూడెంటా!” అక్కడ ఉన్న జనానికి అప్పుడే interest పోయింది. వాళ్ళలో ఒకాయన సోమూ వైపు ఈర్ష్యగా చూస్తూ, “అబ్బా, ఈ students బ్రతుకులే హాయండీ. ఎంచక్కా అనందంగా ఉంటారు,” complaining toneలో అన్నాడు. సోమూకి మతి పోయింది. “Employees మనని చూసి కుళ్ళుకోవడం ఏమిటి?” అనుకున్నాడు.

చుట్టు పక్కల మిగతా students పరిస్థితి అలానే ఉంది. ఇక్కడ భోజనాలు ఐతే తొందరగానే అయ్యాయి కానీ, అక్కడి జనం H-1 visas, labor clearance, multiple entry తప్ప ఏమీ మట్లాడుకోవడం లేదు. మావు టాంగు పడుకొని గురక పెడుతూంటే మధ్యలో లేపి మరీ వాణ్ణి సంభాషణలో పాల్గొనేలా చేసారు.

రాత్రి 2 గంటలకు అందరూ బ్రతుకు జీవుడా అనుకుంటూ బయట పడ్డారు.ఇంటికి రాగానే అందరు నర్సింలు కోసం వెతికారు. కాని వాళ్ళకు అతను కనపడలేదు.

వారం రోజుల తరువాత local news paperలో ఒక ప్రకటన వచ్చింది. “బాబూ, నర్సింలూ, నీ మీద నీ apartment-mates అందరం బెంగ పెట్టుకున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నా ఇంటికి తిరిగి వచ్చేయి. నిన్ను ఎవరూ ఏమీ అనమని, నిన్ను నరికి పోగులు పెట్టమని హామీ ఇస్తున్నాం,” అంటూ.

Advertisements
This entry was posted in సీనియర్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s