Senior – Part 10

Carలో ఘోరమైన నిశ్శబ్దం నెలకొంది. car suddenగా slow ఐనట్టు గ్రహించగలిగాడు సోమూ. car మెల్లగా gas station ముందు ఆగింది.

“దిగండి, దిగండి. ఆకలిగా ఉన్న వాళ్ళకు ఇంకా 5 గంటల వరకూ ఇదే last chance. Next stop Indianapolis,” అరిచాడు రావు, Indiaలో super deluxe bus driverలా.

సోమూ బాధగా మూలిగాడు. గర్భస్థ శిశువు position చాలా నొప్పి పుట్టించేదిగా ఉంది. ఆకలి మాట దేవుడెరుగు, కడుపు విపరీతంగా నొస్తోంది.

“అరే, సోమూ పాపం అటకాయించిపోయిండన్న,” అని సోమూని బయటకు లాగాడు నర్సింలు. సోమూ footballలా బయటకి దొర్లాడు. “పట్టుకోండిరా, అసలే ఇక్కడ slope ఉంది, ఎంత దూరం పోతాడో ఏమిటో,” అన్నాడు రావు.

అప్పటికే సుందర మూర్తి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు సోమూ. gas stationలో అంతా కోలాహలంగా ఉంది. weekend కావడం వల్ల చాల మంది ఉన్నారు. అందరూ ప్రయాణీకుల్లా కనిపిస్తున్నారు.

సోమూ rest roomకోసం చుట్టూ చూశాడు. అదెక్కడుందో కనపడలేదు కాని ఒక పెద్ద line కనిపించింది. “వీళ్ళంతా ఎందుకు lineలో నిల్చున్నారబ్బా,” అని ఆశ్చర్య పోయాడు సోమూ.

వాళ్ళలో ఒకరిని “Excuse me, what’s this line for?” అంటూ అడిగాడు. ఆ నల్లబ్బాయి “*@@@@!@!,” అని ఏదో గొణిగి చేతులు విచిత్రంగా తిప్పాడు. ఆ చేతుల కదలికలో ఎక్కువ సార్లు చిటికెనవేలు కనపడడంతో విషయం అర్థం చేసుకున్నాడు సోమూ.

అప్పుడే అక్కడికి వచ్చిన నర్సింలు అది చూసి, “గీడ లాభం లేదు, సోమూ. Indianapolisల try చేయడం better,” జాలిగా అన్నాడు.

రావు అక్కడికి హడావుడిగా వచ్చాడు. అతని చేతిలో 20 chips packets ఉన్నాయి. “ఇవేంటి?” అనుమానంగా అన్నాడు సోమూ. “ఏరా, నీకు ప్రతీది explain చేయాలా? Pittsburg వరకు ఇదే మన ఆహారం. 20 కొన్నా కాబట్టి deal వచ్చింది,” గర్వంగా అన్నాడు రావు. సోమూ vending machineలలో అమ్మే burger తిన్నట్టు మొహం పెట్టాడు.

Carలో మళ్ళీ ఎక్కే తరుణం వచ్చింది. “సోమూ, నువ్వు glove box కింద లుంగ చుట్టుకుని పడుకొ,” అంటున్న రావును ఆపి, సోమూ, “లాభం లేదు, ఏ మాత్రం pressure ఎక్కువైనా, దారుణాలు జరిగిపోతాయి. ఆ పై మీ ఇష్టం,” అన్నాడు.

రావు నాలుక కరుచుకొని, “సరే, నువ్వు వెనకాల seat మీద, ముంగాళ్ళ మీద కూచో, ఏం?” అన్నాడు.

మూలుగులూ, నిట్టూర్పుల మధ్య car కదిలింది. సోమూ, “ఇది ఒక కల. నేను కాసేపట్లో మేలుకుంటాను. ఇది ఒక కల. కాసేపట్లో …,” తనలో తాను అనుకోసాగాడు.

Advertisements
This entry was posted in Senior. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s