Senior – Part 9

“ఏరా సోమూ, నువ్వింకా తయారు కాలేదా?” హడావుడిగా లోపలికి వచ్చాడు రావు.

“తయారు కావడమేమిటి? రాత్రి మూడు అవుతూంటే?” ఆశ్చర్యంగా చూసాడు సోమూ.

“ఓ! నీకు నర్సింలు చెప్పలేదా? మనం ఇప్పుడు బయలుదేరితే గాని Pittsburgకి ఈ weekendలో వెళ్ళి రాలేము,” అన్నాడు రావు.

Crossword puzzleలా ఉన్న సోమూ మొహం చూసి, “అబ్బా, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది బాబూ. ప్రతి semester midtermsకి ముందు ఇలా దైవదర్శనం చేసుకుని రావటం ఇక్కడ సాంప్రదాయం,” అన్న రమణ రావు explanation మధ్యలోనే అందుకుని, “ఔ, నే Hyderabadలో ఉన్నప్పుడు యాదగిరి గుట్టకి కూడా పోలేదు. గీడ వచ్చినంక సాల్ కి మూడు పార్లు గుడి బోతా,” పరవశంగ అన్నాడు నర్సింలు.

అందరూ తెమిలి బయటకి వచ్చేసరికి నాలుగున్నర అయ్యింది. దాదాపు ఒక ఎనిమిదిమంది పోగయ్యారు. రమణ రావు driver seatలో కూచుని, “ఊ, తొందరగా అందరూ కూర్చోండి,” అంటూ engine start చేశాడు.

సోమూ ఆశ్చర్యంగా, “అదేంటి రమణ బాబూ? రెండో car రాకుండా మనం బయలుదేరితే ఎలా? అందరూ కలిసి వెళ్ళడం మంచిది కదా!,” రమణ రావు కూచున్న “Geo Metro” వంక చూస్తూ అన్నాడు.

“రెండో కారేమిటి? మనమంతా ఈ car లోనే వెళ్తున్నాము,” కసురుతున్నట్టు అన్నాడు రావు. సోమూకి కళ్ళు తిరిగాయి. “ఈ carలో ఎనిమిది మందా? నలుగురు కూడా పట్టేలా లేరు?” అన్నాడు.

“మాకిది అలవాటేలే, ఈ weekendకి cheapగా 40 dollars deal దొరికింది. ఎనిమిది మంది ఉన్నాం కనుక ప్రతి ఒకరికీ 5 dollars share పడుతుంది. Co-drivers కూడా ఎవ్వరూ లేరు. నేను ఒక్కడినే drive చేస్తాను,” explain చేశాడు రావు.

“మరి lodging ఖర్చులు? తిండీ తిప్పలు?” అనుమానం వెలిబుచ్చాడు సోమూ.

“lodging లేదూ, boarding లేదూ. Pittsburg చేరుకున్నాక మనకు correctగా పది నిముషాలు time ఉంటుంది. ఆ timeలో దర్శనం చేసుకుని మళ్ళీ car ఎక్కి return వచ్చేస్తాం. ఇక ఆకలేసినప్పుడు ఏ gas stationలోనో లాగిస్తాం,” వివరించాడు రమణ రావు.

“అరే, ఎక్కుర్రివయ్యా జల్ది జల్ది,” విసుగ్గ అన్నాడు నర్సింలు. ఎన్నో రోజుల నుంచీ training ఉన్నట్టు react అయ్యారు అందరూ, సోమూ తప్ప. ముందుగా passenger seatకి dashboardకి మధ్య స్థలంలో, గర్భస్థ శిశువు typeలో ఒకబ్బాయి ముడుచుకొని పడుకున్నాడు. అతని వీపు మీద ఇంకొకడు కూర్చున్నాడు. Passenger seatలో నర్సింలు కూర్చుని కాళ్ళు window బయటకి వేలాడదీశాడు. ఇద్దరు students వెనుక seatలో ముంగాళ్ళ మీద కూర్చున్నారు.

రమణ, “సోమూ, నువ్వు floor మీద వెల్లకిల్ల పడుకో,” అన్నాడు. సోమూ car పక్కనే పడక scene వేశాడు. అందరూ ఘొల్లున నవ్వారు. “అక్కడ కాదు నాయన, carలో వెనుకాతల,” నవ్వాపుకుంటూ చెప్పాడు రమణ రావు.

“ఎందుకు?” ప్రశ్నించాడు సోమూ. “నీ మీద సుందరమూర్తి పడుకుంటాడు. మొత్తం ఎనిమిది మందీ carలో పట్టేస్తాం,” ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేడేంటా అన్నట్టు చూశాడు రమణ రావు.

“నేను, ఈ poseలో Pittsburg వరకూ రావాలా?” గొంతులో తడి ఆరిపోయింది సోమూకి. “ప్రతి రెండు గంటలకు, position మారుతుంది. కాసేపయ్యాక, నువ్వు వెనుక seatలో ముంగాళ్ళ మీద కూర్చుంటావు.

ఇంకో రెండు గంటలకి dashboard కింద ముడుచుకొని పడుకుంటావు. ఇంకాసేపటికి…” అంటున్న రమణ రావుని మధ్యలోనే ఆపేసి, “ఇంకేమి చెప్పక్కర్లేదు! నాకు విషయం అర్థమయ్యింది,” అంటూ car ఎక్కాడు సోమూ.

ఎనిమిది మంది ఉన్న ఆ car నిండు గర్భిణిలా కదిలింది.

Street corner దగ్గర బిందు మాధవి ఎదురయ్యింది వీళ్ళకి. “ఏంటి, ఎక్కడికో వెళ్తునట్టున్నారు,” అని car ఆగగానే లోపలికి చూసి shock తింది.

“అరేరే, ఏమయ్యింది వీళ్ళందరికీ,” ముఖ్యంగా వెనుక seatలో శవాకృతిలో ఉన్న రెండు శాల్తీలను చూసి అంది. “మేమంతా Pittsburg గుడికెళ్తున్నాం,” చెప్పాడు రమణ.

“ఇంకా నయం, లోపల పరిస్థితి చూస్తూంటే వీళ్ళందరిని hospitalకి తీసుకెళ్తునట్టు ఉంది. అన్నట్టు సోమూ ఏడి,” అంది బిందు మాధవి.

“నేను కింద ఉన్నానండీ,” బావిలో కప్పలా హీనంగా వినిపించింది సోమూ గొంతు.

“OK, మాకు time లేదు, అసలే పది నిముషాల్లో దర్శనం ముగించాలి. వస్తామండీ,” car start చేసాడు రావు. కొద్ది సేపట్లొ car freeway చేరుకుంది.

“పోయిన సారి, మస్తు మజా వచ్చిందన్నా. మల్లేష్ గాడు మనం back వచ్చినంక రెండు రోజులు మోకాళ్ళు పట్టుకుపోతే గట్లనే కుంటుకుంటూ తిరిగిండు,”నర్సింలు రావుతో అంటున్న మాటలు విని తను తిరిగి University చేరుకుంటానన్న ఆశలు వదిలేశాడు సోమూ.

Advertisements
This entry was posted in సీనియర్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s