Senior – Part 7

Lab:

సోమూ తిరిగి labకి వచ్చేటప్పటికి, lab studentsతో కిక్కిరిసి పోయి ఉంది.

“ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడ studentsకి చదువు అంటే చాలా శ్రద్ధ ఉన్నట్టుంది”, తనలో తాను అనుకున్నాడు సోమూ.

ఒక cornerలో చాలామంది ఓ workstation ముందు గుమిగూడి ఉండడం చూసి అటు వెళ్ళాడు సోమూ. అక్కడ ఓ పది మంది students Madhuri Dixit gif fileని fullగా blow up చేసి చూస్తున్నారు. “ఏమండీ! మీరెవరూ పని చేసుకోకపోతే నేను ఈ station మీద work చేస్తానండీ,” భయపడుతూనే మెల్లగా అన్నాడు సోమూ.

వాళ్ళలో ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడు గమనించాడు సోమూ. వాళ్ళలో ఒక్కరూ కనీసం రెప్ప కూడా వేయడం లేదు. కొద్దిగా సాహసం చేసి సోమూ వాళ్లలో ఒక అబ్బాయి కంటి ముందు చిటికలు వేసాడు. ఊహూ, లాభం లేకపోయింది. వాళ్ళందరూ అలా శిలా విగ్రహాల్లా నిలబడి Madhuri Dixit వంక చూస్తూనే ఉన్నారు.

ఇక్కడ లాభం లేదనుకొని పక్కకు వెళ్ళాడు సోమూ. అక్కడ ఉన్న నాలుగు workstations, అన్నీ screen lock చేసి ఉన్నాయి. పక్క రెండు workstations దగ్గర ఇద్దరు students శరవేగంతో ఏదో type చేస్తున్నారు.

ఏమిటో అనుకొంటూ దగ్గరికి వెళ్ళి చూసాడు సోమూ. ఆశ్చర్యం! వాళ్ళిద్దరూ ఒకరి తొ ఒకరు ‘talk’ చేస్తున్నారు. “ఇదేంటండీ, వీళ్ళు ఎంచక్కా directగా మాట్లాడుకోవచ్చు కదా! ఇలా workstations మీద talk చేసుకోవడం దేనికి?” సోమూ నర్సింలుని అడిగాడు.

“వాళ్ళిద్దరూ, కొట్లాడుకున్నారు భై! అప్పటికెల్లి directగా మాట్లాడుకోరు” అన్నాడు నర్సింలు.

“మరింక నా assignment ఈ రోజు పూర్తి కాదా?”, అనుకున్నాడు తనలో తాను సోమూ.

బిందు మాధవి ముందే పరిగెత్తుకొని వచ్చేయడం వల్ల తనకి workstation దొరికింది. ఏమి చేయాలో తోచక సోమూ బిందు మాధవి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. బిందు మాధవి సోమూ వైపు చూసి, “ఇంతకీ ఆ burger తిన్నావా?” అని అడిగింది.

“మీరు మరీనండీ, అది నేను Indiaలో ఇక్కడికి రావడానికి flight ఎక్కినప్పుడు తయారు చేసినట్టున్నారు,” ఆ burgerని తలుచుకొని ఒక్క సారి చిన్నగా వణుకుతూ అన్నాడు సోమూ.

అప్పుడే తను ముగించిన C programని compile చేసింది బిందు మాధవి. వెంటనే compiler చాల fatal errors చూపించి ఆఖర్లో “You are better off in India,” అని ఒక message print చేసింది. బిందు మాధవికి బుర్ర తిరిగింది.

అది వెనుకనుంచి చూసిన నర్సింలు ఘొల్లున నవ్వాడు. “గా compiler మా రమణ రావు అన్న code చేసిండు. మరీ ఎక్కువ తప్పులైతే గా compiler user name read చేసి నువ్వు ఏ countryనో ఎరుక పట్టి గా typeలో message print చేస్తుంది,” గర్వంగా అన్నాడు.

“మీ రమణ అన్నకి వేరే పని లేదా?” కోపంగా అడిగింది బిందు మాధవి.

“ఎల్లెల్లవమ్మా చెప్పొచ్చావు, గింతకు ముందు ఉన్న compiler కోపమొచ్చినప్పుడు నీ home directoryలో ఉన్న files అన్నీ delete చేస్తుండె. పోని అని మా రావు అన్న గీ compiler design చేసిండు, ఆ!” దురుసుగా అని నర్సింలు అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

అప్పుడే labలోకి ఒక కుర్రాడు వేగంగా దూసుకొని వచ్చాడు. “అందరు వినండహో! M.C.I ఇప్పుడు ATT కంటే నిముషానికి రెండు cents తక్కువ charge చేస్తూంది. ఇంకో గంటలో ఈ offer expire ఔతుందంట,” అని ఎంత వేగంగా వచ్చాడొ అంతే వేగంగా వెళ్ళిపోయాడు అతను.

అంతే! సోమూ తన చిన్ని జీవితంలో ఎప్పుడూ జనం అంత వేగంగా react కావడం చూడలేదు. అందరూ ఒకరి మీదనుంచి ఒకరు దూకుతూ, ఒకరినొకరు తోసుకుంటూ lab బయటకు అడ్డం పడి పరిగెత్తారు. 1.39 secondsలో lab ఖాళీ అయిపోఇంది. తుఫాను వెలిసిన తరువాత ఉండే ప్రశాంతత అక్కడ నెలకొంది.

“ఈ M.C.I నా assignment కోసమే ఈ పని చేసినట్టుంది,” అనుకుంటూ సోమూ assignment చేయడానికి ఉపక్రమించాడు.

Compiler రెండో సారి ఇచ్చిన “Book your ticket to India, NOW,” అన్న message చూసి తనలో తాను పళ్ళు కొరుక్కుంది బిందు మాధవి.

Advertisements
This entry was posted in సీనియర్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s