Senior – Part 8

“టక్, టక్, టక్ “, అంటూ ఎవరో తలుపు కొడుతున్నారు. రాత్రి ఎప్పుడో మూడింటికి పడుకున్న సోమూ చాల చిరాకుగా కళ్ళు తెరిచాడు. పొద్దున 8 గంటలు అయ్యింది, అంతే.

“ఈ timeలో ఎవరబ్బా వచ్చింది?”, అనుకుంటూ విసుగ్గా వెళ్ళి తలుపు తెరిచాడు. బయట ఇద్దరు పొడుగాటి gowns తొడుక్కుని నించుని ఉన్నారు.

వారిలో ఒకతను “Good morning son! Do you know the world is soon coming to an end?” అన్నాడు సోమూతో.

సోమూకి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. రెండవ అతను, “We are Jehova’s witnesses. We have come to lead you onto the path,” అన్నాడు. సోమూకి confusion మరీ ఎక్కువయ్యింది.

“ఏంటి ఇతను అంటున్నాడు? path చూపిస్తానంటాడేమిటి? నాకు schoolకి దారి బాగానే తెలుసు కద!” సోమూ మనసులో ఆలోచనలు దొర్లుతున్నాయి.

అంతలో ఆ ఆలొచనలకు అడ్డు కళ్ళెం వేస్తూ మొదటి gown మళ్ళీ ఇలా అన్నాడు. “Resign your soul to Jehova! He is the only saviour.”

సోమూకి విషయం మెల్లమెల్లగ అర్థం కావడం మొదలెట్టింది. “ఓహో, వీళ్ళు పొద్దున్నే ఇళ్ళకెళ్ళి మతాలు మార్చే type అన్న మాట,” అనుకుంటూ పైకి, ” గర్వ్ సే కెహ్తా హూ కె మై హిందూ హూ. I am proud to be a Hindu” అన్నాడు. (సోమూ Indiaలో ఉన్నప్పుడు ఒక hotelలో బాల్ థాకరే picture కింద ఆ caption చదివాడు. అప్పటినుంచి అతని మనసులో ఆ వాక్యం బాగా ముద్ర పడి పోయింది.)

ఇద్దరు gowns మొహాల్లో కళ తగ్గింది. మొదటి gown కొద్దిగా ఏడుపు గొంతుతో, “Please son! We too, have our quotas to meet! Why don’t you try on a risk free basis being a Jehova’s witness for three months. You will receive a surprise free gift. If you are not satisfied after 3 months, you can go back to Hinduism. But the gift is yours to keep as a token of our appreciation,” అన్నాడు.

సోమూకి చిరాకు వెయ్యడం మొదలెట్టింది. ఇంతలో తలుపు తెరుచుకొని నర్సింలు బయటకు వచ్చాడు. వాళ్ళని చూసి, “హూ,” అన్నాడు. gowns ఇద్దరూ, “hi,” అంటూ embarrassingగా నవ్వారు.

నర్సింలు మళ్ళీ, “హూ, హూ,హూ,” అని తన చూపుడు వేలుని అటూ ఇటూ తిప్పాడు. gowns ఇద్దరు తలలు బరుక్కొని, “Remember Son, Jehova is the only saviour,” అని సోమూ వైపు ఆశగా ఇంకో సారి చూసి ముందుకి సాగిపోయారు.

“Thanks, నర్సింలు,” అన్నాడు సోమూ. నర్సింలు, ” ఫికర్ చెయ్యకు, ఇది దిన్నం ఉండేదే. మీ మతమేదో మీది, మా మతమేదో మాది అంటె ఇనిపించుకోరు. అసలు “Die Hard” movie Bruce Willis బదులు వీళ్ళని పెట్టి తియ్యాల్సిండె. bumperగా hit అయ్యెడిది,” అంటూ లోపలకు వెళ్ళిపోయాడు.

సోమూ ఉన్న నిద్ర పోకుండా ఉండడానికి, కళ్ళను సగం సగం మూసుకొని తన roomలోకి వెళ్ళి తన పరుపు ఉన్న చోట దబ్బున పడ్డాడు. అంతే! సుందర మూర్తి కెవ్వుమంటూ ఒక కేక పెట్టాడు.

“sorry, గురూ,” సోమూ నొచ్చుకున్నాడు. “ఆ roomలో మావు టాంగు గాడు ఒకటే గుర్రు. అందుకని ఇక్కడకి వచ్చి పడుకుంటే, నువ్వు ఇలా పగ తీర్చుకున్నావు,” అని గొణుక్కుంటూ room బయటకు వెళ్ళిపోయాడు సుందర మూర్తి.

Advertisements
This entry was posted in సీనియర్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s