Senior – Part 6

Lab:

రాత్రి పదకొండు గంటలు కావొస్తూంది. మధ్యాహ్నంనుంచీ ఏమీ తినకపోవడంతో సోమూ కడుపులో బుల్లి బుల్లి dinosaurs పరిగెడుతున్నాయి. బిందు మాధవి పరిస్థితి అలాగే ఉంది.

“ఏమండీ, ఇక్కడికి ఎం సీ డొనాల్డ్స్ ఎంత దూరం?” అడిగాడు సోమూ, నర్సింలుని.

“ఎం సీ డొనాల్డ్సా?” ఆశ్చర్య పోయాడు నర్సింలు.

వెంటనే వెలిగింది అతనికి. “ఓ, McDonalds గురించి మట్లాడుతున్నావా నువ్వు?” అని “అది ఇక్కడికి చాలా దూరం. car కావాలె. పద vending machine కాడికి పోదాం,” అని నర్సింలు lab బయటకి నడిచాడు. బిందు మాధవి, సోమూ అతన్ని follow అయ్యారు.

Vending machine దగ్గర ఆగాడు నర్సింలు. డబ్బులు slot లో వేసి burgerలా కనిపిస్తున్న ఒక పదార్థాన్ని బయటకు తీశాడు. “ఇదిగో, తిను,” ఆప్యాయంగా సోమూ చేతిలో పెట్టాడు.

“ఇదేంటండీ? ఇలా బూజు పట్టి ఉంది? నేను తినను,” భయంగా అన్నాడు సోమూ.

“అరె, మల్ల నఖ్రాలు చేస్తావు? బూజు లేకుంటె నువ్వు ఇచ్చె ముష్టి dollarకి బంగారం పూత పూసి ఇస్తడనుకుంటున్నావు? మొదటి సారి డోక్కుంటావు కాని, యెనకసిరికి అలవాటు ఐపోతుంది లే! గీ burger తిని హరాయించుకున్నవనుకో, దునియాల ఏడన్న బతుకుతవు,” అంటూ బిందు మాధవి వైపు తిరిగాడు నర్సింలు.

“అరె ఈమె ఏడ పోయింది?” అంటూ ఆశ్చర్య పోయాడు. “మరేనండీ, మీరు నా ముష్టి dollar గురించి మాట్లడుతున్నప్పుడే తను labవైపు వేగంగా పరిగెత్తుకొంటూ వెళ్ళి పోయిందండి. పాపం, భయపడినట్లుందండి,” అన్నాడు సోమూ.

“సరే, ఏం చేస్తం. పోనీ freshersకి ఏదో help చేద్దమనుకుంటే గిట్ల thanx కూడా చెప్పకుండా ఉర్కుతరు,” బోల్డంత బాధ పడ్డాడు నర్సింలు. “ఔ, మల్ల నువ్వు తిన్నవా?” అడిగాడు సోమూని.

“ఓ, తినేసి మూతి కూడా తుడుచుకున్నానండి,” అన్నడు సోమూ trash canలో పడేసిన burger గురించి తలుచుకొంటూ. “గంత fast ఎట్ల తిన్నావు భై,” ఆశ్చర్య పోయాడు నర్సింలు మళ్ళీ.

“నేనంతేనండీ. నమలకుండా మింగేసే పాడు అలవాటు ఉందండీ నాకు,” జాలిగా అన్నాడు సోమూ. “సరె పద, labకి పోదాం”, అంటూ lab వైపు బయలు దేరాడు నర్సింలు, సోమూ తో సహా.

Advertisements
This entry was posted in Senior. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s