Senior – Part 1


గమనిక:

సీనియర్ 94-95లో నేను రాసిన సీరియల్ కథ. అప్పట్లో (అంటే మా golden daysలో), మా ఇంజనీరింగ్ క్లాస్‌మేట్స్ అంతా అమెరికాలోని రకరకాల చోట్ల, ఎం.ఎస్. చేస్తూ ఉండే వాళ్ళం. మా అందరికి ఒక్క ఎం.ఎస్.కే చావు తప్పి కన్ను లొట్టపోతే, మా రమణ్‌రావు మాత్రం రెండో ఎం.ఎస్. కూడా మొదలు పెట్టాడు. ఇలా వీడు ఎం.ఎస్.ల తరువాత ఎం.ఎస్.లు చేస్తూ పోతే ఎలా ఉంటుంది అని నాకు వచ్చిన ఒక చిలిపి ఊహ, ఈ సీరియల్ కి నాతో శ్రీకారం చుట్టించింది. మా క్లాస్‌మేట్స్ లో బాగా పాపులర్ కావడం వల్ల నేను దాని తరువాత soc.culture.indian.telugu మీద ప్రచురించాను. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ కథాకాలం దాదాపు 14 ఏళ్ళ కిందటిది కాబట్టి, కొన్ని సిచ్యుయేషన్స్ మీకు వింతగా అనిపించచ్చు. కాని అప్పట్లో జీవితం, నా కల్పనలు పక్కకు పెట్టి, అలానే ఉండేది. అవి globalization ముందు రోజులు. అమెరికా కి రావడానికి మాకు ఒక్క స్టూడెంట్ వీసా (F-1) మాత్రమే శరణ్యం. ఈ సంగతి మీరు దృష్టిలో ఉంచుకుని చదివితే, ఈ కథను ఎక్కువగా ఎన్‌జాయ్ చేయగలరు.

ఈ కథలో రమణ్‌రావు గురించి ఏవన్నా చెడుగా రాసి ఉంటే అదంతా నా కల్పన. ఈ కథలో కనిపించే మంచి గుణాలు మాత్రం అచ్చంగా బుచ్చంగా వాడివే. ఇక చదవండి….ఫాల్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యంది. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అంతా కోలాహలంగా ఉన్నారు. ప్రొఫెసర్ లోనికి రాగానే ఆ అల్లరి సద్దు మణిగింది. ప్రొఫెసర్ ఇండియన్ కావడంతో మన దేశీ స్టూడెంట్స్ మొహాలు విప్పారాయి.

ప్రొఫెసర్ కృష్ణారావు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ గ్రాజ్యుయేట్ క్లాస్‌లో ఉన్న 30మంది ఫ్రెషర్స్‌లో ఒకడు చైనీస్ ఐతే మిగతా 29మంది ఇండియన్స్. అందులో 28మంది ఆంధ్రప్రదేశ్‌నుంచి ఐతే, 27మంది హైదరాబాద్‌నుంచి.

కృష్ణారావు వారందరి వంకా ఆనందంగా చూసి, “ఇక్కడ కూడా మీరందరూ మన తెలుగు తల్లికి కీర్తిని తీసుకు వస్తారని ఆశిస్తున్నాను,” గద్గదంగా అని క్లీనెక్స్‌తో కళ్ళు తుడుచుకున్నాడు. 28మంది తెలుగువాళ్ళు హర్షధ్వానాలు చేస్తే, తమకు కూడా ఏదో అర్థమయినట్టు, మణిపూర్‌నుంచి వచ్చిన మావు టాంగు, చైనీస్ స్టూడెంట్ చింగ్ చాంగ్ చుంగ్ విశాలంగా నవ్వారు.

“ఇక్కడ anti-copying law ఉందా గురు? అహా ఏం లేదు, ఉంటే మన తెలుగు తల్లికి కీర్తి తీసుకురాలేం కద అని నా బాధ!” అన్నాడు సుందరమూర్తి.

సోమూ లేచి, “ఇక క్లాస్ ప్రారంభించుదామా సర్?” అన్నాడు. అంతే! క్లాస్ అంతా ఘోరమైన నిశ్శబ్దం!!

“రావు అన్న రాందే ఏ క్లాస్ షురు కాదు,” అన్నాడు మల్లేష్.

“అవ్! రావు అన్న వస్తే గాని క్లాస్‌కి రోష్‌నీ రాదు,” పరవశంగా అన్నాడు నర్సింలు.

“రోష్‌నీ ఎవరు? ఆవిడ కూడా ఒక స్టూడెంటా?” అమాయకంగా అడిగాడు సోము.

“నీ యవ్వ! యాడికెల్లి వచ్చినవు భై! రోష్‌నీ అంటె వెలుగు, light అన్నట్టు!” అన్నాడు నర్సింలు విసుగుగా.

“అగో అన్న వచ్చిండు, అన్న వచ్చిండు,” అన్న కేకలు సడన్‌గా క్లాస్‌లో మారుమోగాయి. రమణ్‌రావు సుడిగాలిలా లోపలికి దూసుకు వచ్చాడు. “ఏరా, కొంపదీసి క్లాస్ మొదలు పెట్టావా?” కోరగా చూస్తూ అన్నాడు. కృష్ణారావు గొంతులో తడి ఆరిపోయింది.

“మీరు లేకుండా ఎప్పుడన్నా అలా చేశానా రమణ్ బాబూ?” అన్నాడు నమ్రతగా. రమణ్‌రావు హుందాగా తల పంకించాడు.

“అన్నది ఇది రెండో ఎం.ఎస్. ఇంకా చాలా చేద్దామనుకుంటున్నాడు అన్న!” గౌరవంగా అన్నాడు మల్లేష్ సోమూతో. దురుసుగా కనిపించే రమణ్‌రావు వెనక ఇంత విద్యా దాహం ఉందా అనుకొని ఆశ్చర్యపోయాడు ఎం.బీ. సోము.

Advertisements
This entry was posted in సీనియర్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s