అమెరికాలో ఆపసోపాలు – 30 (ఉపసంహారం or Tata, See Ya, Bye Bye!!)

ఈ సారి శుక్రవారం సాయంత్రం అంతా బంగార్రాజు ఇంట్లో కలుసుకున్నారు. వాతావరణం సందడిగా ఉన్నప్పటికీ, ఏదో వెలితిగా ఉందని అనిపించింది మిత్ర బృందానికి. శేఖర్, వాసవ సజ్జిక ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి Indiaకి వెళ్ళి ఉండడమే దానికి కారణం.

“ఈ పాటికి వాళ్ళిద్దరు honeymoon మీద వెళ్ళి ఉంటారు,” సాలోచనగా అన్నాడు బంగార్రాజు.

“వాడి కథ ఒక మలుపు తిరిగింది కానీ, మన కథకు ముగింపు ఎలా ఉంటుందో?” ఇది పార్థూ.

“ముగింపు ఏవిట్రా! పెళ్ళితోటే జీవితం ముగిసిపోతుందా ఏంటి? పెళ్ళి తరువాత పిల్లలూ, వాళ్ళు పెరిగి పెద్దవ్వడం, ఇలా ఒక దాని తరువాత ఒకటి జరిగి పోతూనే ఉంటాయి,” తనను తాను అందరికంటే ఎక్కువ practical అనుకునే పద్మాకర్ అన్నాడు.

“అబ్బ తెలుసు లేవోయి, అనవసరంగా అంత ముందుకి వెళ్ళిపోకు. అవన్నీ తలుచుకుంటేనే నాకేదో horror picture చూసిన feeling వస్తుంది,” చిన్నగా వణికాడు బంగార్రాజు.

“నువ్వు మాట్లాడడంలేదేంటి గురూ?” సూరి బాబుని అడిగాడు పార్థూ.

సూరి బాబు ఏమీ మాట్లడలేదు. అతని మనసులో ఆలోచనలు దొర్లుతున్నాయి. ముందు studentగా అమెరికాకి రావడం, Universityలో, చదువుతో పాటూ మిగతా జీవితం గురించి కూడా నేర్చుకోవడం, ఉద్యోగల వేటలో తిరగడం, ఇక్కడే settle అయిపోతామని ఒక వైపు తెలిసినప్పటికీ, మానసికంగా ఇంకా Indiaలోనే జీవించడం. ఇలా ఎన్నెన్నో… ఈ కథలో అతనే hero అయినప్పటికీ, అన్ని సమాధానాలు, అతని దగ్గర కూడా లేవు. బహుశా తర్వాత రాబోయే కథలో, అతని సందేహాలు తీరుతాయేమో!

పక్కన already మిత్ర బృందం రెండు groups కింద విడిపోయి, పోట్లాడుకుంటున్నారు.

“ఈ రోజు ఆ night clubకి వెళ్ళాల్సిందే గురూ,” అంటున్నాడు బంగార్రాజు.

“నీ బొంద, అక్కడికెళ్ళి నువ్వు చేసేదేముంది? మందు పట్టించి, కళ్ళు గుండ్రంగా తిప్పడం తప్ప? ఆ తెల్లమ్మాయిలు మనను పట్టించుకోర్రా బాబూ అంటే వినవు కద! చక్కగా ఈ రోజే release ఐన కొత్త హిందీ cinemaకి వెళ్దాం పదండి,” అంటున్నాడు గౌరీ నాథ్.

చివరకి గౌరీ నాథ్ గెలిచాడు. సూరి బాబు, చిరు నవ్వు నవ్వుతూ వాళ్ళతో పాటూ cinemaకి బయలుదేరాడు.

(అయిపోయింది)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

8 Responses to అమెరికాలో ఆపసోపాలు – 30 (ఉపసంహారం or Tata, See Ya, Bye Bye!!)

 1. నాగరాజా says:

  బాగున్నాయి అపసోపాలు 🙂

 2. oremuna says:

  Good One

 3. ప్రవీణ్ గార్లపాటి says:

  నే తప్పక చదివే టపాలలో తేటగీతి ఉంటుంది. చక్కని హాస్య టచ్ ఉన్న సీరియళ్ళను టపాలుగా అందించే ఈ బ్లాగంటే నాకిష్టం.
  మీరు అప్పుడు రాసిన కథలే కాకుండా ఇప్పుడు మళ్ళీ రాసి కొత్తవి కూడా ప్రచురించాలని నా కోరిక. (పాతవి వేస్తూనే)

 4. మరమరాలు says:

  చాలా బాగుంది. We are waiting for another ..

 5. విజయలక్ష్మి says:

  చాల బావున్నాయండి ఆపసోపలు.
  మరి కొన్ని ఆపసోపలు కొసం ఎదురు చూస్తూ…..

 6. Karthik says:

  murali garu meru rasina ee america apasopalu chala chala bagundandi.
  acham americalo emi jaruguthundo alage rasaru.
  meru rasini aa telugu association di chaduvuthunte monna nenu vellina programe gurthuku vochindi.
  same to same makki ki makki vall kuda alane chesi ma pranalu todesaru.
  meru rasani audians badalu chaduvuthunte ma badalu gurthuku vochayi…..
  really it is excellent…

 7. Hari says:

  Nice one… 🙂

 8. Sumna says:

  its really really good. Awesome.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s