అమెరికాలో ఆపసోపాలు – 29 (ఆనందమానందమాయెనే మన శేఖర్ పెళ్ళి కొడుకాయెనే!)

Indian Storesలో కొన్న ఒక calling card తీసి Hyderabadలో ఉన్న వాళ్ళింటికి call చేయడానికి ఉపక్రమించాడు శేఖర్. అతనిలానే అనేకమంది Indiaకి call చేస్తున్నారేమో, అర్ధ గంట తరువాత connection దొరికింది.

చివరికి ఎలాగైతేనేం! అటు వైపు phone మోగింది. శేఖర్ వాళ్ళ నాన్న గారు శేఖర్ గొంతు వినగానే, “వారి వెధవా, రెండు వారాల తరువాత ఇప్పుడా call చేయడం, మీ అమ్మ ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా?” అంటూ గర్జించారు.

అంతలో శేఖర్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న గారి దగ్గరినుంచి phone అందుకుని, “ఒరేయి, ఎలా ఉన్నావురా నాన్నా, ఆరోగ్యం బాగుందా, మీ బంగార్రాజుతో పంపించిన ఆవకాయ రోజు వేసుకుంటున్నావా?” అంటూ ప్రశ్నల పరంపర కురిపించారు.

“బాగానే ఉన్నానమ్మ! అయినా బంగార్రాజు గాడికి ఏదన్నా తిండి పదార్థం ఇచ్చి పంపిస్తే అమెరికా దాకా ఎలా వస్తుందనుకున్నావు?” కొద్దిగా చిరాగ్గా అన్నాడు.

“అంటే ఆ అబ్బాయి planeలోనే జాడీ మొత్తం లాగించాడంటావా?” అనుమానం వెలిబుచ్చారావిడ.

“ఇంక ఆ ఆవకాయ గోల వదిలేయి తల్లీ. ఇంకేమన్న విశేషాలుంటే చెప్పు. బోల్డుసేపు మాట్లాడచ్చులే. ఈ calling card చాలా చౌకగా దొరికింది,” ఆనందంగా అన్నాడు శేఖర్.

“అదేరా ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో కూడా బాగా settle అయ్యావు కద. అందుకని …” అని ఆవిడ ఏదో చెప్పబోయేంతలో, అకస్మాత్తుగా cross talk మొదలయ్యింది. ఏదో బీహార్ మూకలా ఉంది.

“ఓ సాలే కో ఖతం కర్‌దో. పైసే లేకే అబ్ మూ ఫేర్లేతా హై. తమాషా సంఝా హై క్యా?” అంటూంది ఒక స్వరం కోపంగా.

“అమ్మా, నువ్వు phone పెట్టేయి. నేను మళ్ళీ చేస్తాను. ఇంకాసేపు ఈ సంభాషణ వింటే, సాక్ష్యం ఉండకూడదని మనల్ని కూడా ఖతం చేస్తారేమో,” భయంగా అని, phone పెట్టేశాడు శేఖర్.

మళ్ళీ connection దొరకడానికి ఓ 15 నిముషాలు పట్టింది. వాళ్ళమ్మగారు విసుక్కున్నారు, “ఏదో చౌకగా వచ్చిన card అన్నావు. ఇలా తగలడిందేమిరా,” అంటూ.

“పోనిలేమ్మా ఇంతకు ముందు, ఏదో చెబుతున్నావు?”

“అదేరా, అమెరికాలోనే ఉన్న విస్సూ మామయ్య దగ్గరికి ఏదో మంచి సంబందం వచ్చిందంట. నీకు ఫోటోలు పంపిస్తానన్నాడు,” అన్నారావిడ.

“నాకిప్పుడే పెళ్ళి వద్దమ్మా. ప్రస్తుతం నేను ఒక చుక్కాని లేని నావని. తాడు లేని బొంగరాన్ని. పల్లవి లేని పాటను. తీగ తెగిన వీణని,” గుక్క తిప్పుకోకుండా అన్నాడు శేఖర్.

“పిచ్చి పిచ్చిగా వాగకు. చెప్పిందానికి ఎప్పుడు వెంటనే ఒప్పుకున్నావు కనుక. ఫోటోలు చూశాక మళ్ళీ phone చెయ్యి. ఆరోగ్యం జాగ్రత్త. తొందరగా నిద్రపో. వేళకు సరిగ్గా తిను,” ఇలాంటి జాగ్రత్తలన్ని ఒకసారి వల్లించి, phone పెట్టేశారావిడ.

*************************************************************

రెండు రోజుల తరువాత ఒక బరువైన కవరు mailలో వచ్చ్హింది శేఖర్‌కి. కవరు చింపితే అందులో ఒక ఫోటో, ఇంకా ఉత్తరం ఉన్నాయి. ఫోటో వంక చూడకుండానే ఉత్తరం చదివాడు శేఖర్. అందులో ఇలా రాసుంది.

“Dear Sekhar,
I got this alliance through a friend of mine. The girl’s parents are in the States too, and I have spoken with them. It seems the girl knows about you already, and has given the go-ahead to her parents. You probably have met her. She works in your company…”

ఉత్తరం మధ్యలోనే పడేసి, ఉద్వేగంతో, వణుకుతున్న చేతులతో, ఫోటోని అందుకున్నాడు శేఖర్. ఫోటోలో ఉన్నది వాసవ సజ్జిక!!!

“హుర్రే” అన్న కేక ఆ గదిలో ప్రతిధ్వనించింది. అతని ఆనందంలో పాలు పంచుకున్నట్టు, కిటికీ బయట ఉన్న మల్లె తీగ కూడా, వీస్తున్న చిరు గాలి వేగాన్ని అనుసరించి లయగా కదలసాగింది.

(ఏంటి ఖంగారు పడ్డారా, రచయిత ఇలా అకస్మాత్తుగా భావుకత్వంలోకి జారుకున్నాడేమిటా అని? ఏదో ఒక్క సారి ఆంధ్రుల ఆర్భాట రచయిత వానమూరి ధీరేంద్రనాథ్‌ని తలుచుకుని ఆ ప్రేరణతో ఓ వాక్యం రాశాను సుమండీ! లేకపోతే, ఇక్కడ కిటికీ బయట మల్లె తీగ ఏమిటి, nonsense!)

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s