అమెరికాలో ఆపసోపాలు – 28 (పెళ్ళి అయిన బ్రహ్మచారులు!)

ఇంకొక శుక్రవారం వచ్చింది. మద్యాహ్నం కాగానే, జనాలు పనులు మానేసి, weekend ఏం చేయాలా అనే ధ్యాసలో పడ్డారు.

యధావిధిగా, సంసారులు అంతా ఒక వైపు, శత మర్కటాలు ఒక వైపు గుమి గూడి చర్చించుకుంటున్నారు.
సంసారుల సంభాషణ ఒకలా వుంది. విట్ఠల్ రావు, వినాయకం ఆ వారాంతం జరగబోయే కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నారు.

“ఏవుందండీ, గత వారం, మేము పులిహోర చేసి మీ ఇంటికి పట్టుకొచ్చేశాం కదా! అలానే రేపు మీరు దద్దోజనం చేసుకుని రేపు మా ఇంటికి వచ్చేయండి. నేనీ రోజే వెళ్ళి కొన్ని సరి కొత్త తెలుగు video cassettes పట్టుకొచ్చేస్తా. దద్దోజనం తిన్నాక అవి చూసుకోవచ్చు,” అంటున్నాడు వినాయకం.

ఇవతల బ్రహ్మచారులు ఇంకో type discussionలో ఉన్నారు. “ఈ రోజు మందు party చేసుకోవాలి గురూ, తప్పదంతే,” ఆవేశంగా అంటున్నాడు బంగార్రాజు.

“నోరు ముయ్యరా, నీకు తిండీ, మందూ తప్ప ఇంకేం పట్టదు. మన Indian Movie theatreలో ఈ రోజే, కొత్త movie “తన్నించుకుందాం రా” release అవుతూంది.అది చూసి తీరాల్సిందే!” అంటున్నాడు గౌరీ నాథ్.

కాసేపు పోట్లాడుకుని, చివరికి మందు partyకే వోటు వేశారు.

*************************************************************

బంగార్రాజు ఇంట్లో మందు party కనుక, బంగార్రాజు తెగ ఉత్సాహంగా అటూ, ఇటూ తిరిగేస్తున్నాడు, అందరి గ్లాసుల్లో మందు refill చేస్తూ.

సూరి బాబు మందు లాంటివి పుచ్చుకోక పోయినా, అతనికి కూడా యధావిధిగా ఆ partyకి రాక తప్పలేదు. మాట్లాడే స్థితిలో ఉన్న శాల్తీ ఎవరైనా దొరుకుతారేమోనని చుట్టూ చూస్తే, ఆశ్చర్యంగా అతనికి ఒక మూల ఒంటరిగా కూర్చుని ఉన్న సతీష్ కనిపించాడు.

“అదేంటండి మీరు ఒక్కరే ఈ partyకి వచ్చారు? ఇంకా మీరు, మీ ఆవిడా రేపు వినాయకంగారి ఇంట్లో get-togetherకి వెళ్తున్నారనుకున్నా?” ప్రశ్నించాడు సతీష్‌ని సూరి బాబు.

అంతే! సతీష్ అకస్మాత్తుగా లేచి నిలబడి, సూరి బాబు భుజం మీద తల వాల్చి, భోరున ఏడ్చేశాడు.
“అయ్యయ్యో, ఏమయ్యిందండి?” ఖంగారు పడ్డాడు సూరి బాబు.

“ఏం చెప్పమంటారండి, నా బాధ! మా ఆవిడ ఇప్పుడు residencyలో join అయ్యింది. ఇది జరిగి మూడు నెలలు అవుతూంది. ఈ మూడు నెలల్లో, తన్ను నేను సరిగ్గా మూడు సార్లు చూశాను. ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలీదు. ఎప్పుడు hospitalలో ఉంటుందో తెలీదు.

ఎవరన్నా families నన్ను partyలకి పిలిస్తే, నేను ఒక్కడినే వెళ్ళి గుడ్ల గూబలా ఒంటరిగా గడిపి రావలిసి వస్తూంది. ఈ మధ్య వాళ్ళు కూడా పిలవడం మానేశారు.

పోనీ, ఇలా బ్రహ్మచారుల కొంపలకి వస్తే, అంతా నన్ను చాలా specialగా treat చేస్తున్నారు. నేనేదో అప్పుడే ఒక uncle అయిపోయినట్టు. ఆఖరికి బంగార్రాజు కూడా నా ముందు బూతులు మాట్లాడడం మానేశాడు. ఏ జన్మలో ఏం పాపం చేసానని నాకీ శిక్ష!” అంటూ కుమిలిపోయాడు సతీష్.

సూరి బాబుకి అతన్ని ఎలా ఓదార్చాలో కూడా తెలీలేదు. “పాపం, ఇతను ఒక పెళ్ళయిన బ్రహ్మచారి,” అనుకుని నిట్టూర్చాడు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s