అమెరికాలో ఆపసోపాలు – 27 (Direct H-1లుంటారు జాగ్రత్త!)

సూరి బాబు ఆ రోజు officeకి రాగానే యధా విధిగా coffee machine వైపు బయలు దేరాడు. coffeeని కప్పులోకి వంచుకుంటూ, అటు వైపే వస్తున్న ఒక శాల్తీని చూసి shock తిన్నాడు.

వస్తున్న వ్యక్తి పిన్న వయస్కుడే! Polyster shirt, pant వేసుకున్నాడు. జుత్తు మీద రాసుకున్న నూనె, పైనున్న light వెలుతురు పడి మెరుస్తోంది. Pant చాలా పైకి వుండడం వల్ల, అతని shoesకి, pantకి మధ్య వున్న socks భాగం కనిపిస్తోంది.

సదరు శాల్తీ వచ్చి, సూరి బాబు ఎదురుగా ఆగాడు. మొహం నిండా నవ్వుతో సూరి బాబుని చూసి విశాలంగా నవ్వుతూ, “గురువు గారూ, మీరు తెలుగు వారేనా?” అని ప్రశ్నించాడు.

“అవునండీ, మీ పేరు?” అన్నాడు సూరి.

“నా పేరు వికాస్, ఓ వారమయ్యింది ఈ companyలో join అయ్యి,” అన్నాడు అతను. “అన్నట్టు మీదే కారు? Hondaనా లేక Toyotaనా?” అని కూడా అడిగేశాడు.

ఇదేమిటి ఇలా అడుగుతున్నాడు అనుకున్నాడు సూరి బాబు. అంతలో వికాసే, “నాకంతా తెలుసు లెండి, ఇక్కడ మన Indians అంతా, ఆ రెండు కార్లే కొంటారట కద?” చిలిపిగా నవ్వుతూ అన్నాడు.

సూరి బాబుకి కొద్దిగా చిరాకు అనిపించింది, ఈ అతి చనువుకి. కానీ బయటకు ఏమీ మాట్లాడలేదు.

*************************************************************

సూరి బాబుకి, ఆ తరువాత తెలిసింది, వికాస్, directగా H-1 మీద వచ్చాడని. అతనికి అలా వచ్చిన వాళ్ళని చూడడం మొదటి సారి కాదు కానీ, వికాస్ తగిలిన తరువాత నుంచి, అలా U.S.లో ముందు చదువుకోకుండా, నేరుగా work visaతో వచ్చిన వాళ్ళని కొంచెం ఎక్కువగా observe చేయడం మొదలు పెట్టాడు.

అతను గమనించిన కొన్ని విషయాలు:

*సూటిగా వచ్చేసి, ఎదుటి వాడికి time ఉందో లేదో కూడా కనుక్కోకుండా, పక్కన ఒక “ఫిరంగీ” (తెల్ల వాడు) ఉన్నా కూడా పట్టించుకోకుండా, తెలుగులోనో హిందీలోనో మాట్లాడడం!

*కొద్దిగా revealing clothes వేసుకున్న ఆడ ఫిరంగులను చూసి, వాళ్ళ గురించి cheap గా మాట్లాడడం. (లోపల లొట్టలు వేస్తున్నప్పటికి)

*Indiaలో మల్లే, Currency calculations చేయడం, బట్టలు వేసుకోవడం, de-odorants వాడకపోవడం.

*ఇంటినుంచి “టిఫిన్” కట్టుకు రావడం, బయటకు వెళ్ళినప్పుడంతా Indian restaurantsకే వెళ్ళడం.

*ఎక్కువగా కార్ల గురించి, sales గురించి మాట్లాడుకోవడం, weekendsలో టంచన్‌గా mallsకి వెళ్ళడం.

*మన సంస్కృతిని తెగ పొగడడం, ఇక్కడి పద్ధతులను బండ బూతులు తిట్టడం.

*ఇక్కడికి వచ్చి masters చేసిన వాళ్ళతో ఎప్పటికీ relate కాలేక పోవడం.

*Dignity of labor అనే concept మింగుడు పడకపోవడం. (పై masters students, gas stations లాంటి చోట్ల పని చేశారన్న విషయాల్లాంటివి.)

“Of course, వీళ్ళంతా ఒకటీ రెండు సంవత్సరాలలో, దారిలోకి వస్తారు. అది వేరే విషయం. కానీ వచ్చిన కొత్తలో, వాళ్ళు చేసే పనులు, మాట్లాడే మాటలు మాత్రం భలే సరదాగా ఉంటాయి,” తనలో తను అనుకున్నాడు సూరి బాబు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s