అమెరికాలో ఆపసోపాలు – 26 (phone పెళ్ళి!)

సూరి బాబు ఆ రోజు workకి వెళ్ళగానే అంతా కోలాహలంగా ఉంది. అక్కడున్న మిగతా తెలుగు వాళ్ళంతా శంకర్రావుని చుట్టూ చేరి అభినందిస్తున్నారు.

“ఏవిటి విషయం?” అడిగాడు సూరి బాబు, సుబ్బారావుని. “శంకర్రావు గాడికి పెళ్ళి కుదిరింది,” కొద్దిగా అసూయగా చెప్పాడు సుబ్బారావు.

“అంత తొందరగానా? క్రితం వారమే, అసలు ఏవీ కుదిరేలా లేవు అని అన్నట్టున్నాడు?” అనుమానంగా అడిగాడు సూరి బాబు.

“అబ్బో! వారంలో ఎన్ని పనులు కావు గురూ! గత వారం, గురుడు తెగ phone calls చేశాడులే Indiaకి,” ముసి ముసిగా నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు.

“Phone calls మీదే పెళ్ళి settle అయిపోయిందా?” ఆశ్చర్యం ధ్వనించింది సూరి బాబు గొంతులో.

“అంటే photoలు కూడా చూసుకున్నారులే. అయినా మరి అంత తెలీనట్టు మాట్లాడుతావేంటి గురూ, బొత్తిగానూ! ఇప్పుడివన్నీ మాములేగా. అసలే సంబంధాలు దొరకడం కష్టమైపోయింది. ఒక సారి Indiaకి వెళ్ళి వెతుక్కుని, ఇంకొకసారి వెళ్ళి పెళ్ళి చేసుకుని రావడంకంటే ఇది better కాదూ?” అన్నాడు సుబ్బారావు.

నిజమేనేమో, తానే వెనకపడి ఉన్నాడేమో అనుకున్నాడు, సూరి బాబు. అంతలో శంకర్రావు వచ్చి సూరి బాబుని పలుకరించాడు. “ఏదో అలా అనుకోకుండా అంతా అయిపోయింది గురూ,” అన్నాడు casualగా ధ్వనించడానికి try చేస్తూ.కానీ ఎంత అణుచుకుందామనుకున్నా అతని మొహంలో ఆనందం కొట్ట వచ్చినట్టు కనిపిస్తూనే ఉంది.

“భారత దేశంలో అమ్మాయికి పెళ్ళి కావడం కష్టం అంటారు. అదేమో కాని, అమెరికాలో మటుకు అబ్బాయిలకు పెళ్ళి కావడం ఇంకా కష్టంగా ఉన్నట్టుంది,” ఇదంతా చూస్తూ అనుకున్నాడు సూరి బాబు.

ఆ తరువాత శంకర్రవు ధోరణి పూర్తిగా మారిపోయింది. చూపులు monitor మీదే ఉన్నా, మాటి మాటికి తనలో తాను suddenగా నవ్వుకోవడం ఏ మాత్రం ఆగత్యం లేకుండానే “Yes, yes,” అంటూ కేకలు పెట్టడం అలవాటు చేసుకున్నాడు.

Lunch timeలో బయటకి రావడం మానేశాడు. “వద్దు గురూ, ఈ మధ్య ఉన్న డబ్బులన్ని తనకు phone చేయడానికే సరి పోతున్నాయి. పైగా తను బయట ఎక్కువగా తినద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పింది కూడా,” అనే వాడు.

సూరి బాబుకి నవ్వాలో, ఏడవాలో తెలీలేదు. వీళ్ళంతా వెళ్ళి బయట lunch కానిస్తే తను మాత్రం officeలో కూర్చుని, greeting cards పై messages రాయడం, friendsతో తనను, తన cubicleని, photos తీయించడం, ఆ తరువాత వాటిని వెంటనే Indiaకి mail చేయడం, తిరుగు టపాలో వచ్చిన ఉత్తరాలను చదువుకుని తనలో తాను మురిసిపోవడం చేసేవాడు.

Indiaకి వెళ్ళే రోజులు దగ్గర పడుతున్న కొద్ది, శంకర్రావుకి మరీ tension పెరిగిపోయింది. ఆనందం, వెర్రి కూడా ఎక్కువయ్యాయి. ప్రయాణం ఇంకా రెండు రోజులుందనగా, మరీ ముదిరిపోయింది.

సుబ్బారావుని చూసినప్పుడల్లా, “హే, నీకు పెళ్ళి కాలేదు, నాకేమో ఇంకో వారం రోజుల్లో అయిపోతుందోచ్!” అంటూ వెక్కిరించడం, పెళ్ళి ఐన వాళ్ళందరి దగ్గరికీ వెళ్ళి, “నేను కూడా తొందర్లోనే మీ జట్టులో కలిసిపోతాను సార్!”, అని వాళ్ళ చేతులు పట్టుకు ఊపేయడంలాంటివి చేసి, ఏమైతేనేం, ఓ మూడు వారాలకు, Indiaకి బయలుదేరి వెళ్ళిపోయాడు.

సుబ్బరావు కోపంగా సూరి బాబుతో, “చూడు గురూ, ఎలా వాగుతున్నాడో వెధవ!” అంటూ వాపోయాడు.

“పోన్లే సుబ్బారావు! మన Indians చాలామందికి first girl friend భార్యే కద! ఆ మాత్రం excitement ఉండడంలో తప్పు లేదులే. ఓ సంవత్సరం తరువాత తానే మనుషుల్లోకి వస్తాడు,” అంటూ సుబ్బారావుని ఓదార్చాడు సూరి బాబు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

One Response to అమెరికాలో ఆపసోపాలు – 26 (phone పెళ్ళి!)

  1. pavani5 says:

    చాలా బాగుంది …
    మీ సూరి బాబు కధ …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s