అమెరికాలో ఆపసోపాలు – 25 (ఓ రాకుమారుడు వస్తాడులే!)

శేఖర్ officeలో వాసవ సజ్జిక చేరినట్టే, సూరి బాబు officeలో కూడా ఒక పెళ్ళి కాని అమ్మాయి ప్రవేశించింది. యధావిధిన, అక్కడి బోల్డు పెళ్ళి కాని యువకులు మనసు పారేసుకోవటం, ఆ అమ్మాయి cubeవద్ద వెతుక్కోవడం జరిగిపోయాయి.

వచ్చిన అమ్మయి పేరు నవీన. కొన్ని రోజుల్లో అందరూ నవీన చూపులూ, ఆశలూ ఎక్కడో చుక్కల్లో ఉన్నాయని గ్రహించారు. “ఈ పిల్ల కంటికి అసలు మనం ఆనడంలేదు గురూ,” అని సుబ్బారావు అనే colleague, సూరి బాబు దగ్గర బహిరంగంగా బాధపడ్డాడు.

“ఆ విషయం నీకు ఎలా తెలిసింది?” అడిగాడు సూరి బాబు అతన్ని.

“తనెప్పుడూ ఒక మంచి అబ్బాయి కోసం వెతుకుతూందని, అలాంటి అబ్బాయి ఎవరన్నా ఉంటే చెప్పమని, నన్ను అడుగుతుంది ఏంటి గురూ? అంటే నేను ఎందుకు పనికిరాని అబ్బాయినే అని కదా తన ఉద్దేశం?” కొంచెం కోపంగానే అన్నాడు సుబ్బారావు.

“మరదే, ఆ మాట మేం నీతో ఎప్పట్నుంచో చెబుదామనుకున్నాం, ఆ పిల్ల కొద్దిగా సున్నితంగా నీకు అలా చెప్పేసింది,” నవ్వుతూ అన్నాడు ఇంకో colleague శంకర్రావు.

ఆ దెబ్బతో అక్కడికక్కడే శంకర్రావుతో boxingకి ready ఐపోయాడు సుబ్బారావు. వాళ్ళిద్దరిని కష్టపడి విడదీసి పంపించేశాడు సూరి బాబు.

ఆ తరువాత కొన్ని రోజులకే సూరి బాబు, నవీనతో lunchకి వెళ్ళడం జరిగింది. మాటల్లో నవీన, “మంచి అబ్బాయిల” గురించి మాట్లాడింది.

“అసలు ఈ కాలంలో అబ్బాయిల్ని, వాళ్ళ పద్ధతులనీ చూస్తూంటే, పెళ్ళి చేసుకోవాలంటేనే భయంగా ఉందండి, సూరి బాబుగారూ,” అంది నవీన.

“మీకు ఈ కాలం అబ్బాయిల్లో ఏ విషయం నచ్చదు?” అడిగాడు సూరి బాబు.

“ఏవుందండీ, ఉద్యోగం చేయడం తప్ప ఇంకేం చేత కాదు. దేనిలోనూ taste ఉండదు. వేరే activities కూడా ఉండవు. పైగా ఎవరన్నా అమ్మాయి కనపడితే చాలు, ఎప్పుడూ చూడనట్టు వెధవ చూపులు. అహహా, మీరలాంటి వాళ్ళని కాదు. నేను generalగా చెబుతున్నాను.”

“మీరు చెప్పింది కరక్టే! మీ hobbies ఏవిటన్నారు?” ముంచుకొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ ప్రశ్నించాడు సూరి బాబు.

“ఏవుందండీ, week days అంతా jobతోనే సరిపోతుంది. Weekends groceries చేసుకోవడం, laundry, ఇలాంటి పనులుంటాయి. Time దొరికితే కొత్త cinema videos, చూడడం; నాకు old movies చిరాకు లెండి. Friendsకి call చేసి అబ్బాయిల గురించి gossip చేసుకోవడం,” సూరి బాబు ప్రశ్న వెనుకాతల అంతరార్థం గ్రహించకుండా చెప్పింది నవీన.

“మరి ఒక వేళ ఎవరైనా అబ్బాయి వచ్చి మిమ్మల్ని dateకి అడిగితే ఏవంటారు?” అడిగాడు సూరి బాబు.

“ఛీ పొమ్మంటాను, అలా అడిగే వాడు తప్పకుండా ఒక పోకిరి వెధవ అయ్యుంటాడు,” అంది నవీన.

“మరి, మీకు నచ్చిన వారెవరైనా కనిపిస్తే మీరు ఆ అబ్బాయితో ముందు వెళ్ళి మీ interest తెలియబరుస్తారా?”

“అమ్మో! నేనా పని చేయలేనండీ, నాకు rejection అంటే భయం. నేనసలు తట్టుకోలేను,” ఖచ్చితంగా చెప్పేసింది నవీన.

“ఐతే మీ పెద్దలు ఎన్నిక చేసిన వరుణ్ణి చేసుకుంటానంటారు?”

“అయ్యో రామ! ఈ కాలం అబ్బాయిల గురించి నా అభిప్రాయం చెప్పానుగా! నేను పెళ్ళి చేసుకునే వాడు, పెళ్ళికి ముందే నాకు పూర్తిగా తెలిసి ఉండాలి.”

“మరి అతను మీకు ఎలా దొరుకుతాడంటారు?” అడిగాడు సూరి బాబు.

“నాకు నచ్చే అబ్బాయి నాకు కనపడగానే నేను గుర్తు పడతానండి. ఆ నమ్మకం నాకుంది,” గర్వంగా అంది నవీన.

“ఈ అమ్మాయి basically తనని వెతుక్కుంటూ వచ్చే ఒక రాకుమారుని కోసం wait చేస్తూందన్నమాట,” అనుకున్నాడు సూరి బాబు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s