అమెరికాలో ఆపసోపాలు – 23 (తెలుగు associations-3)

సూరి బాబు ఉత్సాహంగా ఒక వారం రోజులు, రాత్రులు మేలుకుని మరీ, ఒక హాస్య నాటిక రాసేశాడు. వెంటనే మరుసటి weekend అది పట్టుకుని, టంకాల్ ప్రెసిడెంట్ దగ్గరకి వెళ్ళిపోయాడు.

ఆయన అది చదివి, “అబ్బో చాలా బాగుంది! కొంతమంది నూతన కళాకారులు టంకాల్ కార్యక్రమాల్లో పాల్గొనాలని కూతుహల పడుతున్నారు. వారిలో ముగ్గురు మీ నాటికకి పనికొస్తారనుకుంటున్నాను,” అన్నాడు.

సూరి బాబు సరేనన్నాడు. అ తరువాత ఆ ముగ్గురినీ కలవడం, వారిని తన నాటికలోని పాత్రలకు ఎంపిక చేయడం, వెంట వెంటనే జరిగిపోయాయి.

కానీ rehearsals మొదలయ్యాక సూరి బాబుకి అర్థమయ్యిందేమిటంటే వాళ్ళలో ఎవరికీ సరిగ్గా acting రాదని. సూరి బాబుకి శేఖర్, బంగార్రాజు ఈ roles బాగా చేయగలరనిపించింది. అదే మాట ప్రెసిడెంట్‌తో అన్నాడు.

“మనం ఎప్పుడూ కొత్త వాళ్ళని ప్రోత్సహించాలండీ. పైగా మీ friendsకి ఆ పాత్రలు ఇస్తే favoritism చూపిస్తున్నాననుకుంటారు జనం. ఆ మాట పడే శక్తి, ఈ చిన్ని గుండెకి లేదు,” అన్నాడు ఆయన, కళ్ళు తడి చేసుకుంటూ.

ఇక చేసేదిలేక వారితోనే adjust అయ్యాడు సూరి బాబు. అతనికి చిరాకు కలిగించిన విషయం ఇంకొకటేమిటంటే ముందు ఎంతో ఆప్యాయత ఒలకబోసిన ప్రెసిడెంట్, సూరి బాబు తను చెప్పిన ప్రతిదానికీ ఊ అనే రకం కాదని తెలియగానే, బాహాటంగా అతన్ని పట్టించుకోకపోవడం.

పైగా అక్కడ ఎక్కువమంది అక్కర్లేని hypocrisy, sycophancy చూపించడం అతనికి అసహ్యం కలిగించింది.

ఐతే సూరి బాబుకి అర్థమయ్యింది ఏమిటంటే తను ఆ పరిస్థితిని ఏ మాత్రం మార్చలేడని. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎప్పటినుంచో పాతుకుపోయి ఉన్నారు. పైగా కొంతమందికి ఇదే careerలా ఉంది.

సరేలే తన నాటిక సంగతి చూసుకుని బయట పడుదామనుకున్నాడు సూరి బాబు. కాని అది కూడా కుదిరేలా అనిపించలేదు. ముగ్గురు నూతన కళాకారులకి కావలసింది ఒక పెద్ద బాల శిక్ష. stage మీద exposure కాదు.

తరువాత అతనికి తెలిసింది. తనకు అంటగట్టబడిన ముగ్గురూ, doctorగారి భార్యకి చుట్టాలూ, పక్కాలూ అని. అప్పటికే అతనికి తన నాటిక మీద పూర్తిగా interest పోయింది.

పైగా టంకాల్ ప్రెసిడెంట్ సూరి బాబు రాసిన నాటికని ఎన్ని సార్లు మార్చాడంటే, ఆఖరికి అతనికి అది తను రాసిన నాటికేనా అని అనుమానం వచ్చింది.

అంతే కాకుండా ప్రెసిడెంట్ “కళాకారులని” ఎన్నుకునే పద్ధతి, అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఒక సారి సూరి బాబు ప్రెసిడెంట్‌తో పాటూ ఉన్నప్పుడు, secretary వచ్చి, “ప్రెసిడెంట్ గారూ, మీరు చెప్పినట్టు ఆ బొమ్మలు అన్నిటిని నేను paint చేసేశాను. మరి నాకో song ఉంటుందా?” అని అడిగాడు.

“బొమ్మలొక్కటే కాదోయి, ప్రోగ్రాం రోజు పొద్దున్నే వెళ్ళి stage తయారు చేశావంటే తప్పకుండా ఇస్తాను,” అన్నాడాయన.

సూరి బాబుకి విషయం అర్థం కాలేదు. అదే ఆయన్ని అడిగితే, “నాకు communism అంటే వల్లమాలిన అభిమానం సార్! దున్నేవాడిదే భూమి, నాకెంతగానో నచ్చిన slogan. వెధవది. మన Indiaలోనూ, ఇక్కడా ఎప్పటికీ రాదు కానీ, కనీసం టంకాల్‌లో ఐనా communism ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకే, టంకాల్‌లో ఎవరు ఎక్కువ ఒళ్ళు వంచి పని చేస్తే, వాళ్ళకి ఎక్కువ stage మీద ఉండే అవకాశం వస్తుంది,” అన్నాడు ఆయన గర్వంగా.

ఏడిసినట్టుంది అని మనసులో అనుకుని, “మరి వాళ్ళా పాత్రలు పోషించలేక పోతే?” ప్రశ్నించాడు
.
“మీకు అన్నీ అనుమానాలే సార్. పెద్ద ఇప్పుడున్న సినీతారలు ఏమైనా దిగి వచ్చారా? నాగర్జునని, వెంకటేష్‌ని చూడండి, వాళ్ళు తరువాత acting నేర్చుకోలేదా?”

ఈయనతో పెట్టుకుంటే, ఆయన మనసులోని ఎన్ని దారుణమైన థియరీలు బయట పెడతాడో అన్న భయంతో సూరి బాబు ఇక మాట్లాడలేదు.

ఉగాది కార్యక్రమం రానే వచ్చింది. మళ్ళీ అంతా అదే తంతు. ప్రెసిడెంట్ ఒక గంట లేట్ వచ్చి, తెలుగు వాళ్ళ punctualityని తిట్టడం. కార్యక్రమం ఆలస్యంగా మొదలు కావడం. క్రితం సారి పాల్గొన్న “కళాకారులే” recycle ఐనట్టు మళ్ళీ stage మీద కనిపించడం.

Stage పక్కనే ఉన్న dressing roomలో, సూరి బాబు నాటక బృందం తయారు అవుతున్నారు. సూరి బాబుకి పక్కనే ఉన్న dressing roomలో, చాలా మంది అరుచుకోవడం, గొడవ పడడం వినిపించింది.

“ప్రెసిడెంట్ గారూ, ఇప్పటికే మీరు చాలా dances, mono-actions, చేసేసారు. ఇంక నన్ను వెళ్ళనివ్వండి,” అంటున్నాడు vice-president.

అవతల doctor గారి భార్యకి ఒళ్ళు మండినట్టుంది. ఆవిడ, “మీరు కనుక నాకో ఇరవై నిముషాలు ఉపన్యాసం ఇచ్చే అవకాశం ఇవ్వకపోయారో, మా ఆయనతో చెప్తాను,” అంది.

“ఇరవై నిముషాలు! ఏం చేస్తారేమిటి?” కోపంగా అడిగాడు ప్రెసిడెంట్.

“ఉగాది పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. మీరేం చేస్తారేమిటి?”

“నేను వేసిన బొమ్మల గురించి explain చేస్తాను.”

“క్రితం సారి, అర్ధగంట చెప్పారుగా.”

“అప్పుడు ముందు రెండు వరసల్లో కూర్చున్న కొంతమందికి అర్థం కాలేదంట.”

“No! నేనొప్పుకోను, నన్ను వెళ్ళనివ్వకపోయారో, టంకాల్కి funding cut!”

ఇక ప్రెసిడెంట్‌కి ఒప్పుకోక తప్పింది కాదు.

సూరి బాబు ఇక అసహ్యం ఆపుకోలేక పక్కనే ఉన్న restroomలోకి వెళ్ళి డోక్కున్నాడు.

సూరి బాబు నాటకం అవుతున్నంతసేపు, ఎందుకో mikes సరిగ్గా పని చేయ లేదు. పైకి బాధ పడినట్టు నటించినా, లోపల బోల్డంత ఆనంద పడ్డాడు అతను. అసలు సూరి బాబుకే ఆ నాటిక నచ్చలేదు.

ఇంత “filterng process” అయినప్పటికీ, ఒక నిజమైన కళాకారుడు ఎలానో తప్పి జారి stage మీదకు వచ్చేశాడు. ఆయన గొంతెత్తి పాడడం మొదలెట్టగానే, జనం అంత నిశ్శబ్దంగా వినసాగారు.

ఆయన రెండో పాట మొదలెట్టగానే, అప్పుడే అక్కడికి వచ్చిన ప్రెసిడెంట్ అది చూసి గుండెలు బాదుకున్నాడు. “ఈయనెవరండీ బాబూ? ఇలా పాడేస్తున్నాడు, chance దొరికింది కదా అని. జనం చూడండి, ఎలా dullగా అయిపోయారో, మాటా మంతీ లేకుండా,” అంటూ.

అది తాదాత్మ్యం చెంది, అని చెబ్దామనుకున్నాడు సూరి బాబు. కానీ ప్రెసిడెంట్‌గారికి ఆ పదం అర్థం అవుతుందన్న నమ్మకం లేక ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

“చేరి మూర్ఖుని మనసు రంజింప రాదే!” అన్న శతక వాక్యం గుర్తుకు వచ్చింది అతనికి.

ప్రెసిడెంట్ mike దగ్గరకి వెళ్ళిపోయి, ఆ పాడుతున్నాయనని బలవంతంగా ఆపేసి, “ఇప్పుడు తరువాత కార్యక్రమం. సక్కూబాయమ్మ troopవారు కథాకళి చేస్తారు,” అని ప్రకటించాడు.

చక్కటి పాట వింటున్న స్థితి నుండి బలవంతంగా బయటకు వచ్చిన ప్రేక్షకులు, కోపంతో గోలగోలగా అరుస్తూ, తామున్న చోటే కథాకళి మొదలెట్టారు.

ఇక తట్టుకోలేక, మళ్ళీ ఒకసారి restroomలోకి వెళ్ళి డోక్కుని, ఎవరికీ చెప్పకుండానే, బయట పడ్డాడు సూరి బాబు.

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s