అమెరికాలో ఆపసోపాలు – 24 (అదిరింది గురూ!)

టంకాల్ దెబ్బ నుంచి తేరుకుని మాములు మనిషి కావడానికి, సూరిబాబుకి ఒక నెల పట్టింది. ఆ నెలలో అతనికి ఎన్నో పీడ కలలు వచ్చాయి. టంకాల్ president అతన్ని బలవంతంగా life-long member చేసేసినట్టు, కుర్చీలొ కట్టేసి, ఆయన చిత్రప్రదర్శన ఏర్పాటు చేయించినట్టు, etc., etc.

*********************************************************************************

ఇక్కడేమో శేఖర్ గడ్డం పెంచి తిరగడం మొదలెట్టాడు. అతనికి వాసవ సజ్జికతో తన ప్రేమ ఫలిస్తుందన్న నమ్మకం పోయింది. తను ఎప్పుడు చూసే తెలుగు సినిమాల్లో హీరోలు చేసినట్టు, శూన్యంలోకి చూస్తూ మాట్లాడడం, నడవడం అలవాటు చేసుకున్నాడు.

ఒక రోజు శేఖర్ boss అతన్ని తన గదిలోకి పిలిచి, “Sekhaaar, I don’t know why you are sporting a beard. But I would advise you to trim it at least. The Chinese lady who works in your next cube is afraid of your new look and is threatening to quit,” అని అన్నాడు.

శేఖర్ సిగ్గుపడి, “Sorry sir, I will be more careful from now on,” అన్నాడు. ఆయన కొద్దిగా సందేహంగానే, “Is it because of the new project I gave you? I didn’t want to do it, it was because of my boss,” అన్నాడు జాలిగా.

శేఖర్ ఖంగారు పడి, “No, no. Nothing like that. I love my work. I always wanted to do a project like this since I was a child,” అన్నాడు తడుముకోకుండా. Interviewలలో ఇలాంటి సమాధానాలు ఇచ్చి ఇచ్చి అలా అలవాటైపోయింది అతనికి.

“Remember, your review is due next month. And I have said a lot of positive things about you,” అన్నాడు ఆయన. ఆయన భయం ఆయనది. Bay Areaలో ఎప్పుడు ఎవరు ఏ job మారుతారొ ఎవరికీ తెలీదు. శేఖర్ వాలకం చూసి ఆయనకి భయం వేసింది.

శేఖర్ ఆయనకి ఇంకోసారి నచ్చచెప్పి తన cube వైపు నడిచాడు. అప్పుడే అటువైపు వస్తున్న అతని పక్క cubeలోని chinese colleague కెవ్వున కేకేసి పారిపోయింది.

***********************************************************************************

Weekendకి అందరు శేఖర్ వాళ్ళింట్లో గుమిగూడారు. ఆ రోజు సూరి బాబుని బలవంతంగా లాక్కుని వచ్చాడు బంగార్రాజు. సూరి బాబుకి తెలుగు సినిమాలు అంటే కొద్దిగా భయం. కానీ బంగార్రాజు అతనికి ధైర్యం చెప్పి తీసుకు వచ్చాడు, ” మన సినిమాలు మనం కాకపోతే ఎవరు చూస్తారు గురూ,” అంటూ.

దాదాపు ఒక పదిమంది పోగయ్యారు ఆ రోజు. అక్కడి local video store నుంచి తెచ్చిన “కర్కోటకపు అల్లుడు” సినిమాని VCRలో ఉంచి play చేశాడు బంగార్రాజు. Opening shotలోనే hero heroine వెనుకాలా పరిగెడుతూ పాట మొదలు పెట్టాడు.

ఆ పాట విని ఒక్క సారి ఉలిక్కిపడ్డాడు సూరి బాబు. కనీసం అందులో ద్వంద్వార్థాలు కూడా లేవు. Single meaning బూతు పాట అది. ఒక రెండు నిముషాలు ఆ పాట విన్నాక తట్టుకోలేకపోయాడు సూరి బాబు. “ఇదేమిటి ఇంత అసహ్యంగా ఉంది. మీరు ఈ పాట ఎలా వినగలుగుతున్నారు?” అడిగాడు వాళ్ళని.

“Lyrics ఎవడు వింటాడు గురు. ఆ tune చూడు. దానిలో ఎంతా ఊపు ఉందో! ఆ హీరోయిన్ figure చూడు. అదిరింది గురూ!” ఉత్సాహంగా whistle వేస్తూ అన్నాడు బంగార్రాజు.

పాట కాగానే కొద్దిగా relief వచ్చింది సూరి బాబుకి. ఇక సినిమా చూద్దాము అని అతను అనుకుంటున్నంతలో, fast forward చేసేశాడు బంగార్రాజు, “ఈ sentimental scenes చూడలేము గురూ,” అంటూ.

అలా కొన్ని ఊపు ఉన్న పాటలు, కొన్ని comedy scenes తప్ప మిగతా సినిమా అంతా fast forward చేసి, మొత్తం నలభై నిముషాల్లో ముగించేశారు, అక్కడి ప్రేక్షకులు. పైగా సినిమా పొడుగూతా comments చేస్తూనే ఉన్నారు. “డొక్కు సినిమా, పరమ బోరు, సుత్తి,” అంటూ.

సూరి బాబుకి చాలా విచిత్రంగా అనిపించింది. “ఇలా సినిమా చూడక పోతేనేం?” అన్నాడు వారితో.

“అబ్బ నువ్వు ప్రతిదానికి సణుగుతావు గురూ. సినిమా అనేది జస్ట్ కాలక్షేపానికి మాత్రమే,” తేల్చేశాడు బంగార్రాజు.

“నేను ఇంటికి వెళ్తాను, సినిమ అయిపోయింది కద,” అన్నాడు సూరి బాబు.

“భలే వాడివి గురూ, ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి మనం ముగించడానికి. నీకంతా తొందరే,” అంటూ అతన్ని బలవంతంగా కూర్చోబెట్టాడు బంగార్రాజు.

తరువాత సినిమా “ప్రేమంటే నాకు పిచ్చ గౌరవం” నుంచి, ఇంకో ఊపున్న పాట, “పిటపిటలాడెను నీ పరువం, దడదడలాడెను నా హృదయం” రావడం మొదలు పెట్టింది.

సూరి బాబు బాధగా నిటూర్చాడు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s