అమెరికాలో ఆపసోపాలు – 22 (తెలుగు associations-2)

సంక్రాంతి కార్యక్రమం రానే వచ్చింది. ముందుగా అనుకున్నట్టే, ఒక గంట ముందే సూరి బాబు మిత్రబృందం అంతా venueకి చేరుకున్నారు. కానీ చిత్రంగా హాల్ తలుపులు తాళం వేసి ఉన్నాయి.

“అదేమిటి గురూ, పొరపాటున రేపటి ప్రోగ్రాంకి ఈ రోజు వచ్చేశామా?”, అనుమానంగా అన్నాడు శేఖర్ సూరి బాబుతో.

“బహుశా మనకు చెప్పిన సమయం తప్పేమో?”

“ఎహె, కాదు గురూ, నాకు ఆ ప్రెసిడెంట్ ఓ వంద సార్లు చెప్పాడు. ఈ రోజే అని,” confirm చేశాడు బంగారాజు.

స్నేహితులు తమలో తాము తర్జన భర్జనలు పడుతుంటే, వాళ్ళకు అప్పుడే అక్కడికి వస్తున్న ప్రెసిడెంట్ కనిపించాడు.

“అల్లో, అల్లో, మీరు వచ్చేశారన్నమాట,” చాలా ఉత్సాహంగా పలకరించాడు ఆయన. “చూశారా ఎవరూ timeకి రారు? మన తెలుగు వాళ్ళు ఇంతే సార్!” అంటూ బోల్డు బాధ పడిపోయాడు.

సూరి బాబుకి ఆయన ధోరణికి ఆశ్చర్యం వేసింది. “ఈయనే మాత్రం గంట ముందు వచ్చాడని మిగతా వాళ్ళు timeకి రాడంటాడు?” అనుకున్నాడు తనలో తాను.

ఆ తరువాత అంతా ఒకరొకరే రావడం మొదలు పెట్టారు. సమయం ఏడు గంటలు కావచ్చింది. నిజానికి అప్పటికి ప్రోగ్రాం మొదలు కావాలి. అలాంటిది అక్కడ చెదురు మదురుగా కొంతమంది ఉన్నారు, అంతే.

ప్రెసిడెంట్ తనలో తాను గొణుక్కుంటూ తిరుగుతున్నాడు. కర్ణా కర్ణీగా ఆయన అనుకుంటున్న మాటలు కొన్ని సూరి బాబు చెవిలో పడ్డాయి. వాటి సారాంశం ఇది.

“ఎవరూ timeకి రారు. తెలుగు వాళ్ళంతా ఇంతే. ఎవరికీ commitment లేదు. ముఖ్యంగా, ఆ Doctorగారి ఆవిడకి చాలా పొగరు. వాళ్ళాయన డబ్బులు ఇస్తున్నాడు కాబట్టే ఈ తెలుగు సమితి నడుస్తోంది అన్నట్టు pose కొడుతుంది. ఆయనకి chance ఇస్తే mike వదలడు. ఈ mikeలు, lightలు ఎప్పుడూ సమయానికి రావు. దానిపైన తెలుగు వాళ్ళంతా ఇంతే. ఎవరూ timeకి రారు….” ఇలా ఆయన గొణుగుడు సాగిపోతునే ఉంది.

అటు వచ్చిన ప్రేక్షకులు ఈ తెలుగు సమితి నడుస్తున్న పద్ధతిని openగానే తిడుతున్నారు. “వీళ్ళెప్పుడూ ఇంతేనండి. ఆ ప్రెసిడెంట్ ఏడు గంటలకి రమ్మని ప్రాణాలు తోడేశాడు. తీరా వస్తే, ఇదీ వరస.”

ఎట్టకేలకు ప్రోగ్రాం మొదలయ్యింది. ముందుగా చిన్న పిల్లల కార్యక్రమం. ఆ పిల్లల మొహాలు చిరపరిచితంగా కనిపించాయి మిత్రులకి. “వాళ్ళంతా మన committee సభ్యుల పిల్లలూ, వాళ్ళ స్నేహితుల పిల్లలూ గురూ. ఆ main role వేస్తూంది, doctorగారి అమ్మాయి,” ఆశ్చర్యంగా అన్నాడు బంగార్రాజు.

కాసేపయ్యాక ఒక pattern కనిపించసాగింది సూరి బాబుకి. చిన్న పిల్లల కార్యక్రమం తరువాత, doctor గారు stage మీద దూకి, mike అందుకుని, “Telugu is one of the greatest languages in the world,” అంటూ మొదలెట్టి ఒక 20 నిముషాలు, ప్రేక్షకుల మెదడు తిన్నాడు.

ఆ తరువాతా ప్రెసిడెంట్ తను వేసిన కొన్ని బొమ్మలతో “చిత్ర ప్రదర్శన” చేశాడు. తాపీగా ఒకొక్క చిత్రం, తను ఎందుకు వేసిందీ, ఎవరికోసం వేసిందీ, విశదీకరించి, చివరకు, “నాకీ అవకాశం ఇచ్చిన టంకాల్కి నా ధన్యవాదాలు,” అని ఒక గొప్ప joke పేల్చాడు.

“ఈయన ప్రెసిడెంట్ ఐనప్పుడు, మరి అవకాశం ఇవ్వక చస్తారా?” అంటూ ప్రేక్షకుల్లో ఎవరో గొణుక్కోవడం సూరి బాబుకి వినిపించ్చింది.

ఆ తరువాత ప్రెసిడెంట్, వాళ్ళవిడా కలసి ఒక popular తెలుగు సినిమా పాటకి dance చేసారు. దాని తరువాత, అక్కడే ఒక dance school నడుపుతున్న సక్కూబాయమ్మ troopవారు, ఓ గంట సేపు, అన్ని రకాల శాస్త్రీయ నృత్యాలు చేసి పారేశారు.

మధ్యలో కొందరు ప్రేక్షకులు కడుపు మండి (ఒకటి ఆకలితోటి, రెండు ప్రోగ్రాం చూస్తున్న బాధతోటి) కేకలు వేసి గోల చేశారు. అంతే! ప్రెసిడెంట్ చాల కోపంగా వచ్చి mike అందుకుని “అక్కడ మన ఆంధ్రదేశంలో చాల మందికి రోజుకు ఒక పూట కూడా తిండి లేదు. మీరు after all dinner కొద్దిగా ఆలస్యం ఐనందుకు గొడవ చేస్తారా,” అన్నాడు గద్గదంగా.

ప్రేక్షకులు చప్పట్లు కొడితే పోతాడేమోనని, గట్టిగా చప్పట్లు కొట్టారు. దానితో ఆయన బోల్డు ఆనందించి, తరువాత కార్యక్రమం announce చేశాడు. అది శాస్త్రీయ సంగీత కార్యక్రమం. దానితో ప్రోగ్రాం ముగిసింది.

ప్రెసిడెంట్ mike పట్టుకుని vote of thanks చెపుతూంటే, జనం ఎవ్వరూ వినిపించుకోకుండా, dinner serve చేస్తున్న వైపు పరిగెత్తారు.

Dinner తరువాత జనం వెళ్ళిపోయాక, సూరి బాబు committeeని కలిశాడు.”ఏం సార్! ఎలా ఉంది ప్రోగ్రాం?” అంటూ ప్రెసిడెంట్ గారు సూరి బాబుని అడిగాడు.

సూరిబాబుకి మెరమెచ్చు మాటలు అసలు అలవాటు లేవు. “ఏమో ప్రేక్షకులు అంత enjoy చేసినట్టు కనిపించలేదు,” అన్నాడు సాలోచనగా.

ప్రెసిడెంట్ మొహంలో కొంచెం కళ తప్పింది. “అదేమిటండీ, అలా అంటారు? ముందు రెండు వరసల్లో కూర్చున్న ప్రేక్షకులు ఎంత enjoy చేసారో తెలుసా?” అన్నాడు.

“మరే, వాళ్ళంతా, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నవారి చుట్టాలు, పక్కాలు,” మురిసిపోతూ అన్నాడు vice-president.

“ఏమో మరి. ఆ శాస్త్రీయ నృత్యాలు కొంచెం ఎక్కువ అయ్యాయి అనుకుంటా. పాపం కొందరికి ఆకలి కూడా అయినట్టుంది. అందుకే గొడవ చేశారు,” చెప్పాడు సూరి బాబు.

“అందుకే గద, నేను వాళ్ళకి ఆంధ్రదేశంలో ఉన్న అనాధలని గుర్తు చేసింది. దెబ్బకు అందరు అదిరిపోయి చప్పట్లు కొట్టారు,” అన్నాడాయన గర్వంగా.

సూరి బాబుకి నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. ప్రేక్షకుల responseని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడు ఈయన అని అనుకున్నాడు.

“వెదవది, ఈ జనాలు ఇంతేనండీ! పోయినసారి ప్రోగ్రాంకి కూడా ఇలానే గోల చేశారు. ఎప్పుడూ వీళ్ళకి ఆకలి గోలే,” complain చేసాడు secretary.

“వాళ్ళకేం తెలుసండీ, ఇందులోని సాధక బాధకాలు. ఎన్నో గంటలు కష్ట పడితే కాని ఇలాంటి ప్రోగ్రాం తయారు కాదు. చేత కాని కబుర్లు,” అన్నాడు అక్కసుగా ప్రెసిడెంట్.

“అవునేమో, ఎవరూ ముందుకి రావటంలేదు కాబట్టే, ఇలా ఈయనే అనేక పాత్రాభినయం చేస్తున్నాడేమో,” అనుకున్నాడు సూరి బాబు. “నాకు మీకు సహాయం చేయాలని ఉందండి. నేను ఒక నాటిక రాశాను. మరి రాబోయె కార్యక్రమంలో వేయడానికి వీలవుతుందా?” అడిగాడు ప్రెసిడెంటుని.

“దానికేం భాగ్యం? తప్పకుండా!” హామీ ఇచ్చాడు ఆయన.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s