అమెరికాలో ఆపసోపాలు – 21 (తెలుగు associations-1)

సూరి బాబు seriousగా కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. అప్పుడే లోపలికి అడుగు పెట్టిన శేఖర్, కుతూహలంగా సూరి బాబు వెనుకాతలనుంచి ఏమి రాస్తున్నది చూశాడు. అది ఒక కవిత! వెంటనే సూరి బాబు దగ్గరనుంచి ఆ కవిత లాక్కుని చదివేశాడు. ఆచారాలు, కట్టుబాట్లను విమర్శించే కవిత అది.

“ఓరి ఓరి సూరీ! నీలో ఇంత కళ ఉందని నాకు ఇప్పటివరకు తెలీనే తెలీదు సుమీ,” అంటూ బోల్డు ఆశ్చర్య పోయాడు. “ఏదో ఇలా అప్పుడప్పుడు రాస్తూంటాను గురూ,” కొద్దిగా సిగ్గుగానే అన్నాడు సూరి బాబు.

“కవితలు ఒక్కటేనా, లేక ఇంకేమన్నా వేరే hobbies కూడా ఉన్నాయా?” నవ్వుతూ అడిగాడు శేఖర్.

“డ్రామాలు రాయడం, వాటిలో నటించడం, ఇంటరెస్టే గురూ,” సమాధానం ఇచ్చాడు సూరి బాబు.

“మరి ఐతే నువ్వు మా TANCALలో చేరాల్సిందే. అక్కడ ఐతే నీ ప్రతిభకి గుర్తింపు కూడా వస్తుంది,” ఉత్సాహంగా అన్నాడు శేఖర్.

“టంకాల్ అంటే ఏమిటి?”

“Telugu Association of Northern CALifornia.”

“వాళ్ళేం చేస్తూంటారు?”

“వాళ్ళేం చెయ్యరని అడుగు గురూ. అది ఒక cultural organiztion. భరత నాట్యాలు, కూచిఫూళ్ళు, నాటకాలు, పాటలు, fashion showలు, అబ్బో చెప్పుకోవాలంటే చాలా ఉందిలే.”

సరే ఇదేదో చూద్దామని ఆ శనివారం, సూరి బాబు, శేఖర్ని తీసుకుని టంకాల్ president ఇంటికి వెళ్ళాడు. టంకాల్ president వీళ్ళను చూడగానే ఉత్సాహంగా వచ్చి, చాలా ఆప్యాయంగా receive చేసుకున్నాడు.

శేఖర్ సూరి బాబు గురించి చెప్పింది విని, “మరింకేం? మీలాంటి కళాకారులకోసమే టంకాల్ ఎప్పుడూ ఎదురు చూస్తూంటుంది, మీరొక నాటిక రాసెయ్యండి. ఈ ఉగాదికి వేసేద్దాం,” అంటూ అభయమిచ్చాడు.

తరువాత టంకాల్ బృందాన్ని పరిచయం చేశాడు. చాల మటుకు అందరు పిన్న వయస్కులే. అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు.

“ఈ రోజు ఏమన్నా practice ఉందా, ఇంతమంది ఉన్నారు?” అడిగాడు సూరి బాబు.

“అబ్బే, లేదండీ! టంకాల్ సభ్యులంతా ప్రతి weekend ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తారు. మేమంతా ఒక కుటుంబంలా ఉంటాం,” చెప్పాడు ఆయన.

“మరే, మేమంతా తెలుగు తల్లి సేవకు అంకితం ఐపోయాం,” అన్నాడు టంకాల్ vice-president.

“కానీ మాకొక్కటే బాధండి, సూరి బాబు గారు, జనం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు రావడం లేదు. వచ్చే వారం ఉన్న సంక్రాంతి programలో ఉన్న అన్ని itemsలోనూ మేమే ఉన్నాం. ఏం చేస్తాం? తెలుగు తల్లికోసం ఇవన్నీ తప్పవు,” గద్గదంగా అన్నాడు president.

“అసలు వాళ్ళొచ్చినా మేము రానివ్వమండి. మీలా అన్ని రసాలు పోషించడం వాళ్ళ వల్ల అవుతుందా?” అన్నాడు పక్కనే ఉన్న ఇంకో సభ్యుడు.

“మరే గత Chritmas programలో, గడ్డం లేకుండా ఏసు క్రీస్తు వేషం మీరెంత బాగా వేశారని! మీరు శిలువ మోసుకుని వెళ్ళే దృశ్యం చూసిన ప్రేక్షకులు స్పృహ తప్పి పడిపోయారు,” పరవశంగా అన్నాడు secretary.

“అవునా?” కొద్దిగా ఆశ్చర్యపోయాడు సూరి బాబు.

“తల్లి తోడు. కాని కొంతమంది గిట్టని వాళ్ళు, dinner ఆలస్యం కావడం చేత అలా పడి పోయారని మీతో తర్వాత చెప్పచ్చు, నమ్మకండి,” సూరి బాబుని హెచ్చరించాడు vice-president.

“ఏదో మీ అభిమానం, నేను stage ఎక్కనురా అంటే వినిపించుకోరు కద,” ఉబ్బి తబ్బిబ్బవుతూ అన్నాడు president.

సూరి బాబు వైపు తిరిగి, “ఈ సంక్రాంతికి వచ్చి మా programs ఎలా ఉంటాయో చూడండి,” అన్నాడు. సూరి బాబు సరే అన్నాడు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s