అమెరికాలో ఆపసోపాలు – 20 (Cyberspaceలో సరసాలు!)

అసలు ఈ on-line love ఏమిటో చూద్దామని సూరి బాబు పార్థూ గదిలోకి వెళ్ళాడు. పార్థూ, ఇంకా తనలో తాను ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, టైప్ చేస్తున్నాడు.

“పార్థూ”, అని ఓ మూడు సార్లు గట్టిగా పిలిచాక, తిరిగి చూశాడు తను సూరి బాబు వైపు. “రా గురూ, సునందతో మాట్లాడతావా?” ఉత్సాహంగా offer చేశాడు. “ఎవరా సునందా, ఏమా కథ?” అడిగాడు సూరి బాబు.

“సునంద నా girl friend గురూ,” చెప్పాడు పార్థూ. “గర్ల్ ఫ్రెండా? ఐతే మరి on line మీద మాట్లాడుకోవడం దేనికి?” ఆశ్చర్యంగా అడిగాడు సూరి బాబు.

“భలే వాడివిలే, తను Thailandలో ఉంటుంది, ఎలా కలుసుకుంటాం?” ఎదురు ప్రశ్న వేశాడు పార్థూ.

“మరి మీరు ఎప్పుడూ కలవలేదా, on line మీదే ప్రేమించుకున్నారా?” ఆశ్చర్యపోయాడు సూరి.

“ఒకరి ఫోటోలు ఒకరు చూసుకున్నాము, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నాం, ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుతాం. ఇవి చాలవా గురు ప్రేమ పుట్టడానికి?” పరవశంగా అన్నాడు పార్థూ. సూరి బాబు దానికి సమాధానమిచ్చేంతలో, “Hurray,” అంటూ గట్టిగా అరిచాడు.

“ఎందుకా ఆనందం?”, అడిగాడు సూరి. “ఎన్నో రోజుల నుంచి ఈ అమ్మాయితో మాట్లాడాలని try చేస్తున్నా గురూ, ఈ రోజు తనే message పంపించింది. Hurray!” excite అయ్యాడు పార్థూ.

“ఎవరీ అమ్మాయి?”, అన్న సూరి బాబు ప్రశ్నకు, “sex kitten!” అన్న జవాబు వచ్చింది. ఉలిక్కిపడి monitor వైపు దృష్తి సారించాడు సూరి బాబు.

పార్థూ ఉన్న chat roomలో అందరి nick names గమ్మత్తుగా ఉన్నాయి. dark dancer, fly boy, stud king, love queen, మచ్చుకు కొన్ని పేర్లు.

“వీళ్ళంతా ఇలా ఎందుకు nick names పెట్టుకుంటారు?” అడిగాడు సూరి. “మరి బయట ఇలాంటి పేర్లు పెట్టుకుని తిరిగితే జనం రాళ్ళుచ్చుకుని కొడుతారు,” వివరించాడు పార్థూ, చిలిపిగా నవ్వుతూ.

ఆ chat room ఉద్దేశం దానికోసమల్లే ఉన్నట్టుంది. వింత nick names పెట్టుకోవడమే కాకుండా, అక్కడున్న వాళ్ళు బయట మాట్లాడడానికి కూడా సాహసం చేయలేని బూతులు మాట్లాడుకుంటున్నారు.

ఇక్కడ ఇంత ధైర్యంగా అమ్మాయిలను approach చేస్తున్న అబ్బాయిలు and vice versa, బయట ఎలా ఉంటారో, తనలో తాను అనుకున్నాడు సూరి బాబు. అంతలో అతనికి suddenగా sex kitten సంగతి గుర్తొచ్చింది.

“అవును పార్థూ, నువ్వు సునందతో ప్రేమలో ఉన్నానన్నావు, మరి ఈ kitten message పంపగానే అంత excite ఎందుకు అయ్యావు?” అడిగాడు పార్థూని.

“సర్లే గురు, నిజం జీవితంలోనే గర్ల్ ఫ్రెండ్స్ కి guarantee లేదు, ఇంక cyber spaceలో, ఎవరు ఎన్ని రోజులో ఎవరికి ఎరుక,” సమాధానమిచాడు పార్థూ.

“మరి ఐతే ఇంత time దీని మీద ఖర్చు చేయడం ఎందుకు?” అడిగాడు సూరి బాబు. “చూడు గురూ! కొందరికి టీవీ చూడ్డం సరదా. కొందరు gossip ఇష్టపడతారు. నా లాంటి వాళ్ళు ఇలా cyber spaceలో కాలక్షేపం చేస్తారు. ఏమో నా అదృష్టం ఈడ్చి తంతే, నిజంగానే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ దొరుకుతుందేమో,” coolగా అన్నాడు పార్థూ.

నిజమే అనిపించింది సూరి బాబుకి. కొన్ని రోజులకు ఇది కూడా ఒక మాములు సంగతి అయిపోతుంది. ఇప్పటికే అవుతూంది కూడా. ఇక పార్థూని disturb చేయడం ఇష్టం లేక బయటకి వచ్చేశాడు అతను.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s