అమెరికాలో ఆపసోపాలు – 18 (నీతోనే చేస్తా రొమాన్సు!)

ఆ తరువాత శేఖర్ జీవితం excitementతో నిండి పోయింది. ఆ రోజు నుండి అతను రోజు కంటే తొందరగా officeకి రావడం మొదలు పెట్టాడు. ఎప్పుడూ మాసిన గడ్డంతో, వెలిసిపోయిన jeansతో తిరిగే అతను, formal dress వేసుకుని రావడం ఆరంభించాడు.

ఐతే అతని officeలో వాసవ సజ్జిక గురించి competition బాగా heavy గానే ఉంది. Almost బట్టతల వచ్చేసిన పాపారావు కూడా, దువ్వెన maintain చేయడం మొదలు పెట్టాడు.

ఇదిలా ఉండగా వాసవ సజ్జిక కొన్ని రోజులు, ఈ కొత్త attentionని enjoy చేసినా, తరువాత కొద్దిగా చిరాకు పడడం మొదలు పెట్టింది. Lunch time కాగానే ఒక పది మంది ఆమె cube దగ్గరకి వచ్చేసేవారు. మొదటి పది రోజులు ఐతే ఆమె తన lunchకి bill కూడా కట్టలేదు.

కొంతమంది అమ్మాయిలు ఈ attention చూసి గర్వంగా feel అయ్యేవారేమో కానీ, వాసవ సజ్జిక అలాంటిది కాదు. ఆమెకి వీళ్ళ ధోరణి చూసి కొంత నవ్వు కూడా వచ్చింది. తన అందం ఇంతమందిని నిలబెట్టేంత గొప్పదేమీ కాదని ఆమె ఉద్దేశం. కాని స్థాన మహత్యం!

ఐతే వీళ్ళందరిలోనూ ఆమెకు శేఖర్ నచ్చాడు. అతనెప్పుడూ అవసరం లేకుండా ఆమె దగ్గరకు రాలేదు. వచ్చినప్పుడు, కాసేపు పిచ్చి చూపులు చూసేవాడు అంతే.

శేఖర్ మాత్రం ఆమెపై తనకున్న ఇష్టం ఆమెకెలా తెలియ పరచాలో అర్థం కాక లోలోపల సతమతమౌతున్నాడు. సూరి బాబుకి ఒకసారి ఈమె సంగతి చెప్పాడు. సూరి బాబుది ఎప్పుడూ direct approach. “ఆమెకు సూటిగా విషయం చెప్పేయి,” అని సలహా ఇచ్చాడు.

“అమ్మ బాబోయి, ఇంకేమన్నా ఉందా! ఆమె కాదంటే?” అన్నాడు శేఖర్.

“కాదంటే విషయం తేలిపోతుంది కద. పైగా నువ్వు అడక్కుండా కూర్చుంటే జరిగేది కూడా అదే,” అన్నాడు సూరి.

ఇహ లాభం లేదు తాడో పేడో తేల్చుకోవాలని, మరుసటి రోజు, శేఖర్ సరా సరి, పొద్దున్నే వాసవ సజ్జిక cube దగ్గరికి వెళ్ళిపోయాడు.

వాసవ సజ్జిక ఏదో envelope open చేయడానికి ప్రయత్నిస్తోంది. “India నుంచి ఉత్తరం వచ్చిందా?” అడిగాడు శేఖర్. “అవునండి, ఏవో photos ఉన్నట్టున్నాయి,” సమాధానమిచ్చింది వాసవ సజ్జిక.

శేఖర్ గుండె జారిపోయింది. “ఏముంది, సంబంధాల photoలు అయ్యుంటాయి,” తనలో తాను అనుకున్నాడు. ఇక తను ఆమెకు చెబుదామనుకున్న విషయం ఇప్పుడు ఎందుకో నిరర్థకంగా అనిపించింది. “వస్తానండి,” అని మెల్లగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

Envelope తెరిచి అందులో photoలు చూసిన వాసవ సజ్జిక పెదవులు చిరు నవ్వుతో విచ్చుకున్నాయి.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

4 Responses to అమెరికాలో ఆపసోపాలు – 18 (నీతోనే చేస్తా రొమాన్సు!)

  1. Rajasekhar says:

    Actually శ్రీరమణ గారి “హాస్యజ్యోతి” లో ఈ “వాసవ సజ్జిక” అన్నపదాన్ని మొదటి సారి చూశాను. కానీ అర్థమేంటో ఇప్పటిదాకా తెలియదు. మీరైనా చెప్తారా ప్లీజ్ 🙂

  2. Murali says:

    అష్టవిధ శృంగార నాయికలలో ఒకతి. ప్రియుడు వస్తున్నాడని తెలిసి అతని కోసం అలంకరించుకునేది.

  3. సుగాత్రి says:

    వాస సజ్జిక కాదండీ. వాససజ్జిక.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s