అమెరికాలో ఆపసోపాలు – 17 (మెరుపు తీగ!)

శేఖర్ వాళ్ళ companyలో పెద్ద దుమారం చెలరేగింది. ఆ రోజు పొద్దున శేఖర్ coffee pot దగ్గర నిలబడి, రెండో కప్పు కాఫీ తాగడానికి ready అవుతున్నాడు. అతని పక్కనుంచి సుడి గాలిలా దూసుకు పోయాడు అతని పక్క cubeలో పని చేసే పాపారావు.

“ఏమిటోయి పాపా రావు, అలా అంతా హడావుడిగా వెళ్తున్నావు,” చనువుగా పలకరించాడు శేఖర్. బోల్డు ఖంగారు పడిపోయాడు పాపారావు. “అబ్బే, ఏమీ లేదు గురూ, ఉత్తిన్నే ఈ మధ్య హడావుడిగా తిరగడం అలవాటయిపోయింది. అంతే, హిహ్హిహ్హీ,” అంటూ ఒక వెధవ నవ్వు నవ్వేశాడు.

అది నమ్మేసినట్టు మొహం పెట్టాడు శేఖర్. కాని పాపారావు వెళ్ళగానే అతను వచ్చిన directionలో వెళ్ళాడు. అది వాళ్ళ పక్క department. మొన్నటి దాక ఖాళీగా ఉన్న ఆ cubeలోంచి, మెరుపులు మెరుస్తున్నాయి.

ఏమిటబ్బా ఈ మెరుపులు అని ఆశ్చర్యపోతూ, లోపలికి తొంగి చూసిన శేఖర్‌కి విషయం అర్థమయ్యింది. లోపల ఒక మెరుపు తీగ కూర్చుని పని చేసుకుంటూంది. మరి మెరుపులు రాక ఏం చేస్తాయి.

అంతలో మెరుపు తీగ వెనక్కు తిరిగింది. cube wall పైనుంచి తొంగి చూస్తున్న శేఖర్ని చూసి పలకరింపుగా, “హల్లో, నేను ఈవాళే join అయ్యాను,” అంది.

“అయ్య బాబోయి, తెలుగు మెరుపు తీగ,” తనలో తాను అనుకుని బయటకు మాత్రం “కెవ్వు,” అని గట్టిగా కేక వేసి మూర్ఛ పోయాడు శేఖర్.

కాసేపయ్యాక కళ్ళు తెరిచిన శేఖర్‌కి, తన వైపు ఆందోళనగా చూస్తున్న మెరుపు తీగ కనిపించింది. చుట్టూ చూశాడు. అతను ఆ అమ్మాయి cube దగ్గరే పడిపోయి ఉన్నాడు. మొహం అంతా తడి తడిగా ఉంది. నాలుకతో పెదాలు తుడుచుకుంటే, diet pepsi రుచి తగిలింది.

ఆ అమ్మాయి సిగ్గుగా నవ్వుతూ, “సారీ, ఇక్కడ water cooler ఎక్కడుందో తెలీదు. అందుకనే నేను తాగడానికి తెచ్చుకున్న diet pepsiని మీ మొహం మీద చల్లాను,” explain చేసింది. “అన్నట్టు నా పేరు, వాసవ సజ్జిక, మరి మీ పేరు?” అడిగింది.

“నా పేరు శేఖర్. మీకు పెళ్ళి అయ్యిందా?” తొందర తొందరగా అడిగాడు శేఖర్. మెరుపు తీగ ఆశ్చర్యంగా చూసింది. “కాలేదు, అయినా ఇదేమిటి, ఈ ఉద్యోగంలో join అయ్యి గంట కూడా కాలేదు, ఇప్పటికి ముప్ఫై మంది నన్ను ఇదే ప్రశ్న అడిగారు,” కొద్దిగా ఆశ్చర్యంగా అంది.

మెరుపు తీగ, అదే వాసవ సజ్జికకు పెళ్ళి కాలేదు అన్న fact మనసులో ఇంకగానే, కెవ్వున ఇంకోసారి కేక వేశాడు శేఖర్. “ప్లీజ్, మళ్ళీ మూర్ఛపోకండి, నా దగ్గర soda కూడా అయిపోయింది,” ఆందోళనగా అంది, వాసవ సజ్జిక.

వాసవ సజ్జిక చేయూతనందిస్తూంటే, మెల్లగా లేచి నిలబడ్డాడు శేఖర్. ఇప్పుడు అతనికి, సొట్టలు పడి ఉన్న diet pepsi can కూడా ఎంతో అందంగా కనిపిస్తోంది.

చదువరి, ఈ పాటికి శేఖర్ పీకలవరకూ ప్రేమలో మునిగిపోయాడన్న విషయం నువ్వు గ్రహించే ఉంటావు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s