అమెరికాలో ఆపసోపాలు – 15 (జైత్ర యాత్ర!)

“ఇప్పుడు ఇక్కడ ఇది latest trendరా అబ్బాయి!” vanలోకి ఎక్కగానే explain చేశారు ఆయన సతీష్‌తో. లోపల ప్రవేశించిన సతీష్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా విచ్చుకున్నాయి.

లోపల చాలా అట్టహాసంగా ఉంది. మూడు బంకర్లూ, ఒక చిన్న dining table లాంటిది, దానిపై నీటుగా arrange చేసి ఉన్న కొన్ని folders, ఒక cellular phone, పక్కనే చిన్న frig, అందులో చెప్పుకోదగ్గ అంశాలు.

“నాన్న, మనం N.T.R.గారి చైతన్య రథం గానీ ఎక్కామా, కొంపదీసి?” suddenగా అనుమానం ముంచుకొచ్చింది, సతీష్‌కి.

“లేదురా, కాని అదే modelలో నేను తయారు చేయించా,” గర్వంగా నాన్న గారి జవాబు.

“కాని మనకెందుకు నాన్నా, ఇవన్నీ?” అంటున్న సతీష్‌ని మధ్యలోనే ఆపి, “చూడు బాబు, పాతకాలంలో ఐతే, పెళ్ళిచూపులకు వెళ్ళడం, మళ్ళీ తిరిగి ఇంటికి రావడం, resultకోసం wait చేయడం, మళ్ళీ ఇంకో పెళ్ళి చూపులకు వెళ్ళడం, ఇవంతా జరిగేవి. కానీ మరి ఇప్పుడో! రాకెట్లు, జాకెట్లు, జెట్లు అన్నీ వచ్చేశాయ! స్పీడు. లోకమంతా స్పీడే! మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడు పెరిగిందో, ఈ పెళ్ళి చూపుల ప్రహసనంలో కూడా అలానే పెరిగింది,” వివరించారు ఆయన.

“అర్థం కాలా? ఆ tableమీద ఒక 20 folders ఉన్నాయి. ప్రతి folder లోనూ, ఒక M.B.B.S. చదివిన అమ్మాయి photo, ఆమె తాలూకు వివరాలూ, ఆమె అభిరుచులూ ఉంటాయి. ఈ 20 మంది అమ్మాయిలూ, దాదాపుగా ఆరు జిల్లాలలో, దిక్కుకొక చోట ఉన్నారు,” ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకున్నారు ఆయన.

“నేను ఆ 20 మందిని వీలైనంత వేగంగా కలవడానికి, ఒక చక్కటి route తయారు చేశాను. కాబట్టి నువ్వు, మనం ఏ అమ్మయి దగ్గరికైతే వెళ్ళ బోతున్నామో, ఆ అమ్మయి వివరాలు భట్టీయం వేయి – పరీక్షకు prepare అయినట్టు. ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నమో వారికి ముందుగానే, మనం cell phone ద్వారా తెలియజేస్తాం.”

“మరి పడక, ఆహారం?” ఇది సతీష్.

ఈ బంకర్ల మీదే మన పడక, ఆ frigలో కావలిసినంత మేత ఉంది. మనం మొదట చూడబోయే అమ్మాయి పేరు అనూహ్య. ఆమె గురించి study చేయి,” order ఇస్తునట్టు అన్నారు ఆయన.

ఉత్సాహంగా వొంగి మొదటి folder అందుకుని అందులో photo చూసి, “నాన్నోయి, ఇందులో పొరపాటుగా అమ్మాయి బదులు వాళ్ళ అన్న ఫోటో పెట్టినట్టున్నారు,” ఆయంకు ఆ folder ఇచ్చాడు సతీష్.

“అవేం జోకులురా అబ్బాయి, లక్షణమైన ఆడపిల్లని పట్టుకొని,” కోపడ్డారు ఆయన.

“కొంచెం జాగ్రత్తగా చూడు నాన్నా, ఆ పెద్ద మీసం కనపడడంలా?”

“అంటే మీసం ఉన్నవాళ్ళంతా అబ్బాయిలేనా? అమెరికాకు వెళ్ళి ఉన్న మతి చెడినట్లుంది నీకు,” చిరాగ్గా చూశారు ఆయన. “కొందరు ఆడపిల్లలు రోజూ shave చేసుకోరోయి. అంత దానికి అలా ఖంగారు పడ్డం దేనికి? పెళ్ళి కనుక కుదిరితే, ఇంచక్కా రోజూ, ఇద్దరూ కలిసి shave చేసుకోవచ్చు.”

“ఈ మీసాలమ్మాయిని చేసుకుంటే, రేపు ఏదైనా shaving cream commercialకి మా ఇద్దరి photoలు వేసి advertise చేసుకుంటారు,” కసిగా అన్నాడు సతీష్.

“గొడవ పడకండి, next folderలోని అమ్మాయి దగ్గరకు ముందు వెళ్దాం,” సర్ది చెప్పారు సతీష్ అమ్మగారు.

Van మెల్లగా రోడ్డున పడింది.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s