అమెరికాలో ఆపసోపాలు – 16 (పెళ్ళి చూపులు!)

ఆ తరువాత సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. పది రోజుల్లొ వాళ్ళు దాదాపు, పన్నెండు అమ్మాయిలను cover చేశారు. Indiaలో జనాల knowledge, అమెరికాలో ఉన్నవాళ్ళకు ఏ మాత్రం తీసిపోలేదని గ్రహించాడు సతీష్.

వీధిలో ఉన్న కొన్ని ఇళ్ళకైతే, గేటు బయటే “Green-Card holders not allowed” అని boards పెట్టున్నాయి.

వెళ్ళిన ప్రతి చోటా, ఆడ పిల్లల తండ్రులు, H-1 visaల గురించి, Green Cards గురించి అంతా తెలిసినట్టు మాట్లాడేస్తున్నారు. ఒకాయన అయితే, “ఏదో ఒకటి softలో పని చేస్తున్నాడా? అక్కడ green card processing బాగా లేటండీ. అలా అయితే కుదరదు,” అని తేల్చి చెప్పేశాడు.

ఇంకొంతమంది ఆడపిల్లలు, సతీష్ తో మాట్లాడుతున్నప్పుడు, అమెరికాకు రావడం తమకు ఎంత ముఖ్యమో, అసలు M.B.B.Sలో చేరినప్పటినుండి అమెరికా రావడం గురించి ఎన్ని కలలు కంటున్నారో, శూన్యంలోకి చూసి చెబుతూంటే, సతీష్‌కి అసలు వాళ్ళు తనతోనే మాట్లాడుతున్నారా అని అనుమానం వచ్చింది. కాని సుమతి పద్యం గుర్తుకొచ్చి తన ఆలోచనలు తనలోనే అణిచేసుకున్నాడు. ఏది ఏమయినా సరే, తను doctor అమ్మయినే పెళ్ళి చేసుకుంటాడు; అంతే.

సతీష్ తిరిగి అమెరికాకి వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది. అప్పటికి ఒక సంబంధం కూడా settle కాలేదు. సతీష్ బోలెడు దిగులుతో కుటుంబ సమేతంగా airportకి బయలుదేరాడు. airport చాలా రద్దీగా ఉంది. గత రెండు వారాల నుంచి సరిగ్గా నిద్ర లేదేమో, సతీష్‌కి కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపించి కింద పడ్డాడు.

“అయ్యయ్యో,”, అంటూ సతీష్ తల్లి తండ్రులు ఖంగారు పడుతూంటే, అక్కడ ఉన్న గుంపులోంచి ఒక అమ్మాయి ముందుకు వచ్చింది. తెల్ల coat, మెడలో steth ధరించి ఉంది. “పక్కకు తప్పుకోండి, ఇతనికి కొద్దిగా గాలి తగలాలి,” అంటూ అందరిని అదిలించింది.

మొహం మీద చల్లని నీరు చల్లగానే, సతీష్ కొద్దిగా నీరసంగా లేచి కూర్చున్నాడు. సతీష్ నాన్నగారు పట్టుకు తెచ్చిన cool drinkని, అతనికి అందించింది, ఆ అమ్మాయి. సతీష్ అది తాగుతున్నంతలో, హుటహుటిన ఒక prescription రాసి ఇచ్చింది.

ఆమె speed చూసి, అక్కడ ఉన్న వారికి, ముఖ్యంగా సతీష్ తల్లి తండ్రులకి, కళ్ళు తిరిగాయి. “చాలా thanks అమ్మాయి, దేవతలా వచ్చావు,” అన్నారు వాళ్ళిద్దరూ.

“నువ్వు ఇక్కడున్నావా, అమ్మాయి. నీ కోసం అంతా వెతుకుతున్నాం,” అప్పుడే అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతులు అన్నారు. వారిలోని మగ శాల్తీని చూసి, సతీష్ వాళ్ళ నాన్నగారు, “ఒరే, భాసిగా!” అంటూ ఒక పొలికేక పెట్టారు. ఆయన కూడా, “ఒరే, శంకర్రావు!” అంటూ చెవులు చిల్లులు పడేలా అరిచాడు.

కాసేపయ్యాక సతీష్‌కి అర్థమయ్యిందేమిటంటే, వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ఈ మధ్యలో మాటలు లేవు. “నీ కూతురు, doctor అన్న మాట. నాకు తెలీనే తెలీదు సుమీ! మా వాడికి మేము ఒక doctor అమ్మాయి సంబంధం వెతుకుతున్నాం,” వివరించారు శంకర్రవు గారు.

“నేనేమో మా అమ్మాయికి ఒక అమెరికా సంబంధం వెతుకుతున్నారా,” అన్నారు అమ్మాయి నాన్నగారు. ఒక క్షణం తరువాత వెలిగింది వాళ్ళిద్దరికీ. ఈ సారి ఇద్దరూ జమిలిగా పొలి కేక పెట్టారు.

అర్ధగంట తరువాత అంతా airportకి దగ్గర ఉన్న marriage registration bureau దగ్గర ఉన్నారు. గంట తరువాత, తిరిగి మళ్ళీ airportలొ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సతీష్‌కి, ఆ అమ్మాయితో పెళ్ళి జరిగిపోయింది.

**************************************************************************

“అది సార్, అలా నా పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది,” కథ ముగించి వెనుకాతలకు వాలుతూ relax అయ్యాడు సతీష్.

“భలే అదృష్టవంతులు సార్, మీరు. ఏమైతేనేం అనుకున్నది సాధించారు,” అసూయగా అన్నాడు బంగార్రాజు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s