అమెరికాలో ఆపసోపాలు – 13 (పెళ్ళి కాని పిల్ల, బ్రహ్మచారి మనసు గుల్ల)

“మరి నేనిప్పటివరకూ pin-ups మీదా, posters మీద ఉన్న అమ్మాయిలనే ప్రేమించాను గురూ,” బిక్క మొహం వేశాడు బంగార్రాజు.

‘నేను కొద్దిగా proceed అయ్యాను గురూ. మ companyలో మొన్ననే కొత్తగా ఓ అమ్మాయి చేరింది, ఎంత బాగుంటుందో!” పరవశంగా అన్నాడు పార్థ సారధి. అతను కూడా ఒక పెళ్ళి కాని యువకుడే!

‘తొందర పడి మనసు పారేసుకోకు. ఆమెకు పెళ్ళయ్యిందేమో?” సందేహం వెలిబుచ్చాడు బంగార్రాజు.

“కాదులే. అవన్నీ కనుకున్నాకే, నేను జాగ్రత్తగా మనసు పారేసుకున్నాను,” చెప్పాడు పార్థూ.

“నీ ముక్కు మీద అ band-aid ఏమిటి?” అనుమానంగా అడిగాడు శేఖర్.

“ఓ అదా, ఏమీ లేదు. మా companyలో మొత్తం 20 మంది బ్రహ్మచారులం ఉన్నాం. ఉన్నది ఒక్క పెళ్ళి కాని అమ్మాయే కద! అందుకని, నేను ఆమెని lunchకి తీసుకు వెళ్తానంటే నేను తీసుకు వెళ్తానని, అంతా బాహా బాహీ, ముష్టా ముష్టీయుద్ధం చేశాము. చివరికి ఇలా కుదరదని, రోజుకి ఒకడు చొప్పున ఆమెని lunchకి తీసుకెళ్దామని decide అయిపోయాము. ఆ గొడవలో తగిలిన దెబ్బ ఇది. నిన్ననే lucky dip వేశాము. రేపు ఆమెని నేను lunch కి తీసుకెళ్తున్నాను.యహూ!” ఆనందంగా ఒక పెద్ద కేక పెట్టాడు పార్థూ.

“Lucky dip ఏంటి?” మిత్రులంతా కోరస్‌గా అడిగారు.

“ఆ అమ్మాయిని lunchకి తీసుకు వెళ్ళే order decide చేయడానికి, lottery వేసుకున్నాము,” explain చేశాడు పార్థూ. “రేపు నా chance. మళ్ళీ 20 రోజుల తరువాత నాకు ఇంకోసారి అవకాశం వస్తుంది,” ఆనందంగా అన్నాడు.

“నువ్వు lucky fellowవి రా, పార్థూ! మా companyలో అయితే అంతా పెళ్ళైన అమ్మాయిలే. అందువల్ల వాళ్ళకు బొత్తిగా మేమంటే భయం భక్తి లేకుండాపోయాయి. మా దగ్గరకు వచ్చి మొహమాటం లేకుండా అన్ని doubts అడుగుతారు.వాళ్ళ పనులు మాతో చేయిస్తారు,” వాపోయాడు శేఖర్.

“వాళ్ళడిగితే చేసేయడం ఎందుకు?” కొద్దిగా కోపంగా అన్నాడు సూరి బాబు.

“అదేరా, మా weakness. ఒకవేళ వాళ్ళకు పెళ్ళి కాని చెల్లెళ్ళు ఉండచ్చు. ఇంకెవరైనా తెలిసి ఉండచ్చు. risk తీసుకోలేముగా,” బాధగా నిట్టూర్చాడు శేఖర్.

“సతీష్ గారు ఏమీ మాట్లాడడం లేదు, ఎందు చేతో?” ఓరగా సతీష్‌ని చూస్తూ అన్నాడు, బంగార్రాజు.

“ఈ ప్రేమలూ, దోమలూ నా వల్ల కాదని నాకు ముందే తెలుసండీ! అందుకనే India వెళ్ళి ఒక doctorని పెళ్ళి చేసుకొచ్చేశాను,” అన్నాడు సతీష్.

“ఓహో, ఐతే మీకు పెళ్ళయ్యిందన్న మాట, మరి చెప్పరేం. ఇక్కడుండగానే settle అయ్యిందా, లేక సెలవు పెట్టి Indiaకి వెళ్ళి వెతుక్కున్నారా?” తనను తాను అందరికంటే ఎక్కువ practical అనుకునే పద్మాకర్ అడిగాడు.

“ఇక్కడనుండి ఎప్పుడు దొరకాలండీ బాబూ. ఆరు వారాలు సెలవు పెట్టి వెళ్ళాను. అనుకోకుండా భలే గమ్మత్తుగా ఐపోయిందిలెండి నా పెళ్ళి,” చెప్పాడు సతీష్.

“మరి ఆ కథ మాకు చెప్పచ్చుగా! ఐనా గురువు గారూ, మీరు doctor కావాలనే వెళ్ళారా,” ప్రశ్నించాడు సూరిబాబు.

“అవును. Doctor ఐతేనే చేసుకుందామనుకుని decide చేసుకుని మరీ వెళ్ళాను. దానికి కారణం నేను చిన్నప్పుడు చదువుకున్న సుమతి పద్యం ఒకటి,” గాఢంగా నిశ్వసించాడు సతీష్.

అంతా సతీష్ చెప్పే కథ వినాలని చుట్టు వచ్చి కూర్చున్నారు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s