అమెరికాలో ఆపసోపాలు – 12 (పిల్లలూ, దేవుడూ, చల్లని వారు!)


యధావిధిగా సంజయ్ ఇంట్లో party జరుగుతూంది. ఫక్తు దేశీ partyలా ఒక వైపునుంచి నాలుగు అడుగుల ఎత్తున్న స్పీకర్స్‌లోంచి కొత్తగా release అయిన రెహమాన్ పాటలు గుండెలు జలదరించేలా వినిపిస్తున్నాయి. మరొక వైపు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు, Multiple Entry, H-1 Visa గురించి మాట్లాడుకుంటున్నారు.

Green Card వచ్చి కొద్ది ఏళ్ళుగా అక్కడ ఉన్న వారు, ఇళ్ళ గురించీ, mortgages గురించీ discuss చేస్తున్నారు. పిల్లలు ఎగురుతూ గెంతుతూ, అప్పుడప్పుడు Englishలో, అప్పుడప్పుడు తెలుగులో, మాట్లాడుకుంటూ, వీలయితే కనపడినది దేన్నయినా పీకి పాకం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆ అనందభరితమయిన వాతావరణంలో సూరి బాబు, ఒక speaker పక్క కూర్చున్నాడు కాబట్టి, చెవుల్లో napkin కుక్కుకుని, వాటిని రక్షించుకుంటున్నాడు. అప్పుడే సూరి బాబు పక్కన కూర్చున్న ఒక పెద్ద మనిషిని, ఓ నాలుగేళ్ళ బుడతడు వచ్చి, గుండు మీద ఒక్కటి ఇచ్చుకున్నాడు. పెద్దాయనకి ఒళ్ళు మండి పోయింది. కోపంగా పిల్లాడి వంక చూసి, “నరుకుతానొరేయి,” అన్నాడు పళ్ళు కొరుకుతూ.

“నీ బొంద, ఇంకోసారి తిట్టావంటే 911కి call చేసి child abuse అని చెప్తా,” చిలిపిగా నవ్వుతూ, ఇంకొకటి ఇచ్చుకుని అక్కడినుంచి పరిగెత్తాడు, ఆ బుడతడు.

“ఏమి చోద్యమండీ? పెంపకం బట్టి పిల్లలు అంటారు. వాళ్ళ నాన్నకు చెప్పడం మంచిది. లేకపోతే ఈ పిల్లాడు మరీ బరి తెగిస్తాడు,” అన్నాడు సూరి.

“ఆ నిర్భాగ్యుణ్ణి నేనే నాయనా! ఇక్కడ చిన్నప్పటినుండీ వాళ్ళకు schoolలో నేర్పిస్తారు. నా కొడుకుని కొట్టడానికి కూడా నాకు హక్కు లేదు. ఈ అమెరికాలో,” బాధగా అన్నాడు ఆయన.

“మరే, చిన్నప్పుడు మా నాన్న నన్ను దూలానికి వేలాడదీసి కొడుతూంటే, నేను ఎన్నో కలలు కనేవాణ్ణి, నాకూ పిల్లలు పుట్టరా, నేను వాళ్ళ వీపులు చిట్లగొట్టనా అని. ఇక్కడేమో ఇదీ పరిస్థితి,” బాధగా నిట్టూర్చాడు పక్కన కూర్చున్న ఇంకో తండ్రి.

సూరిబాబు తన మిగత మిత్రులంతా వేరే వైపు గుమిగూడి వుండడం చూసి,అటు కేసి బయలుదేరాడు. “రారా సూరి, ఇప్పుడే మేమంతా మాట్లాడుకుంటున్నాం.ఈ పిల్లలూ, ఈ party, ఈ హడావుడి అంతా చూస్తూంటే నీకేమనిపిస్తూందిరా,” అడిగాడు శేఖర్.

“వెంటనే పరుగు లంకించుకుని, ఇంటికి పోయి తలుపులు గడి పెట్టుకొని, మల్లీశ్వరి సినిమా పాటలు వినాలనుంది,” పక్కనే ఉన్న బంగార్రాజు చెవిలోంచి kleenex లాగడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సూరి.

“చీ, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మాకయితే చక్కగా పెళ్ళిచేసుకుని, సంసారులం కావాలని ఉంది, ఏరా బంగారం?” అన్నాడు శేఖర్.

“correct గురూ. కానీ Cindy Crawford నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటుందా?”సందేహంగా అడిగాడు బంగార్రాజు.

“కుళ్ళు జోకులు వేశావంటే నరుకుతా. నేను జరిగే పనుల గురించిమాట్లాడుతున్నా,” చిరాగ్గా అన్నాడు శేఖర్.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

One Response to అమెరికాలో ఆపసోపాలు – 12 (పిల్లలూ, దేవుడూ, చల్లని వారు!)

  1. నాగరాజా says:

    🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s