అమెరికాలో ఆపసోపాలు – 11 (More Kids)


భోజనాలు త్వరగా ముగించేశారు అంతా. ఆ తరువాత నాయుడుగారుT.T. ఆడుదామని invite చేశారు మిత్రులని. ఇంకొంతమంది carroms అడేందుకు ఉపక్రమించారు. లోలీ, మాగూలకి పెద్ద దేని మీదా interest ఉన్నట్టు లేదు. వాళ్ళు అటూ, ఇటూ మొహం మీద ఒక boring expression పెట్టి తిరుగుతున్నారు.

సూరి బాబు బయట living roomలో కూర్చున్నాడు. మాగూ అక్కడే ఉన్నsound system దగ్గర నిలబడి ఏవో C.D.s చూస్తున్నాడు. సూరి బాబు తన గొంతు నిండా ఆప్యాయత నింపుకొని, “మాగూ, నీకిష్టమయిన singer ఎవరు?” అని అడిగాడు.

మాగూ సమాధానం నోటితో చెప్పకుండా, ఒక కాగితం తీసికొని దాని మీద ఒక symbol ఏదో రాసి సూరిబాబుకి చూపించాడు.

“అరేరే, పాపం నీకు మాటలు రావా? నువ్వు ఇంత సేపూ మాట్లాడకపోతే నువ్వు మూగవాడివేమోననుకున్నా,” బోల్డు బాధ పడ్డాడు సూరి.

“Chill out, dude! I am not dumb. You see this guy is my favourite.He was called ‘king’ before, but then he changed his name to a symbol. Nobody knows how to pronounce his name now. That is why I had todraw it to you,” మొహంలోని feelings ఏ మాత్రం మార్చకుండా explain చేశాడు మాగూ.

లోపల M.T.V. చూస్తున్న రాజశేఖర్ లోలీతో తంటాలు పడుతున్నాడు.అప్పుడే screen మీదకి వచ్చిన ఒక rap singerని చూసి ఆనందంతో కెవ్వున కేకేసింది లోలీ. రాజశేఖర్ ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. screen మీద వచ్చినవాడు జుట్టు విరబోసుకుని, బట్టలు చింపేసుకుని జడల దయ్యంలా ఉన్నాడు. వాడిని చూసి లోలీ ఎందుకు అంత ఫీల్ అవుతూందో అర్థం కాలేదు రాజశేఖర్‌కి. అదే అడిగాడు.

“Ow! This guy is kewl. He has kewl hairstyle. His songs are also kewl,”ఆనందాన్ని ఆపుకోలేకపోతునట్టు లోలీ మొహమే చెప్తూంది. జడల దయ్యం వీనుల బందుగా “Kill the Society, Chuck the rules out.Kick some butts and chill out,” అని గొంతు చించుకుంటూ అరుస్తున్నాడు…

********************************************************************

తిరుగు ప్రయాణంలో దీర్ఘమయిన చర్చ మొదలుపెట్టారు మిత్రులంతా.

“పాపం నాయుడుగారిని చూస్తే జాలి వేసిందిరా. ఆ దంపతులేమో పిల్లల్ని భారతీయ పద్ధతిలో పెంచుతున్నాం అని అనుకుంటున్నారు.నాకు వీళ్ళలో ఏ మాత్రం భారతీయత కనపడలేదు. పైగా ఆ పిల్లలు kewl అనే వాళ్ళందరూ అంత అసహ్యంగా తగలడ్డారేమిట్రా?”బాధని వ్యక్తం చేశాడు శేఖర్.

“అదేరా. వాళ్ళను ఇంట్లో ఒకలా పెంచుతారు. బయట వేరే ప్రపంచం. confuse కాక చస్తారా,” సాలోచనగా అన్నాడు సూరి బాబు.

“అంతేరా. మా కజిన్స్ కూడా parents ముందు బెల్లం కొట్టిన రాళ్ళలా ఉంటారు. వాళ్ళని బయట చూశావంటే అదిరిపోతావు,” తనకున్న general knowledgeని బయట పెట్టాడు బంగార్రాజు.

“పిల్లల్ని కూడా పూర్తిగా తప్పు పట్టలేములే, వాళ్ళ parents దగ్గర అలా ఉండకపోతే, ఇంట్లో బతకలేరు. అంత repression తరువాత బయట దొరికే స్వేచ్ఛను abuse చేసే అవకాశం ఉంది,” మెల్లగా అన్నాడు సూరిబాబు.

“నేను మాత్రం చచ్చినా నా పిల్లల్ని ఇక్కడ పెంచను,” తనకు ముందు వచ్చిన 12 లక్షల భారతీయుల లానే తను కూడా ఒట్టేసుకున్నాడు శేఖర్.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

One Response to అమెరికాలో ఆపసోపాలు – 11 (More Kids)

  1. sreenivasv says:

    పాపం నాయుడుగారిని చూస్తే జాలి వేసిందిరా. ఆ దంపతులేమో పిల్లల్ని భారతీయ పద్ధతిలో పెంచుతున్నాం అని అనుకుంటున్నారు.నాకు వీళ్ళలో ఏ మాత్రం భారతీయత కనపడలేదు. పైగా ఆ పిల్లలు kewl అనే వాళ్ళందరూ అంత అసహ్యంగా తగలడ్డారేమిట్రా?”బాధని వ్యక్తం చేశాడు శేఖర్.
    Very well written

    “అదేరా. వాళ్ళను ఇంట్లో ఒకలా పెంచుతారు. బయట వేరే ప్రపంచం. confuse కాక చస్తారా,” సాలోచనగా అన్నాడు సూరి బాబు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s