అమెరికాలో ఆపసోపాలు – 9 (పెళ్ళి వీడియోనా మజాకానా!)


ఆ రోజు Friday! సూరి బాబు, కసిగా work station వైపు చూశాడు. ఎంచక్కా weekend మొదలవుతూంది కదా అని ఆనందంగా ఉంటే, చేస్తున్న పని కాకుండా విసిగిస్తూంది అది. అప్పుడే అతనికి రాజు నుంచి call వచ్చింది.

“సూరి బాబు గారూ, ఈ రోజు మా ఇంట్లో party. ఏడు గంటలకంతా వచ్చేయండే!” అన్నాడు రాజు అటు వైపు నుంచి. “మొన్ననే మా ఆవిడ వచ్చింది కదా. చిన్న get together అందుకే,” వివరించాడు. “తప్పకుండా వస్తాను,” మాటిచ్చాడు సూరి.

ఎలాగూ ఈ రోజుకి ఈ పని అయ్యేలా లేదు కాబట్టి, శనివారం వచ్చి చేసుకుందాము అని నిశ్చయించుకొని, bossకి చెప్పి వెళ్దామని, బయలుదేరాడు సూరి.

సూరి లోపలికి రాగానే, వాళ్ళ boss చదువుతున్న పుస్తకాన్ని ఒక్కసారి ఉలిక్కి పడి పక్కకు పెట్టేశాడు. ఆసక్తిగా ఆ పుస్తకం ఏంటా అని చూశాడు సూరి. అది India లో railway stationsలో దొరికే “Thirty days to spoken Telugu” అన్న పుస్తకం.

సూరి బాబుకి ఆపుకోలేని నవ్వు వచ్చింది. “మేమంతా తెలుగులో ఏమి మాట్లాడుకుంటున్నామో అని తెలుసుకోవడానికి కాబోలు,” మనసులో అనుకున్నాడు.

“I need to take off early, today, Eddie,” అన్నాడు సూరి. “Go on; don’t work too hard; take it easy; have a nice weekend,” అంతా ఒక్క గుక్కలో అనేశాడు Eddie. కృతజ్ఞతలు చెప్పి, రాజు ఇంటికి బయలు దేరాడు సూరి.

********************************************************************

ఏడున్నర కాగానే, రాజు ఇల్లు గెస్టులతో నిండిపోయింది. పిలిచిన వాళ్ళంతా వచ్చారని నమ్మకం కుదరగానే, శరవేగంగా react అయ్యాడు రాజు. ముందస్తుగా అన్ని తలుపులూ, కిటికీలూ మూసేశాడు. ఆ తరువాత extra precaution కింద, K-martలో కొన్న power drill, power screwdriver వాడి, వాటన్నిటికీ, చెరొక 20 మేకులు కొట్టాడు.

రాజశేఖర్, మిగతా వాళ్ళంతా, ఆశ్చర్యంగా చూశారు. “అదేంటి బాసూ? మేకులు ఎందుకు?” అడిగాడు శేఖర్. “ముందు ముందు, మీకే తెలుస్తుందిలే,” చిలిపిగా నవ్వాడు రాజు.

“సరే మరి ఇప్పుడు ఏంటి program,” అడిగారు అంతా.

“ఇంకేముంది, మా పెళ్ళికి మా చుట్టాలంతా కలిసి మొత్తం 10 రకాల వీడియోలు తీశారు. మొదటిది ఇప్పుడు చూద్దాం,” వికటాట్టహాసం చేశాడు రాజు.

“కెవ్వు,” అందరూ జమిలిగా అనడంతో, ఒక ఆర్తనాదంలా వినిపించింది ఆ గదిలో.

రెండు గంటలయ్యాక, అక్కడి పరిస్థితి చాలా హృదయవిదారకంగా ఉంది. శేఖర్, బంగార్రాజు నేల మీద పడి గిల గిల కొట్టుకుంటున్నారు. ఇంకొంతమంది, తలుపుకు కొట్టిన మేకులు ఊడదీసి పారిపోదామని try చేస్తున్నారు.

రాజు వాళ్ళందరి వైపు చూసి, విశాలంగా నవ్వుకున్నాడు. “పాపం, ఇక ఆపేయండి, శేఖర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది,” జాలి పడుతూ అన్నాడు సూరి బాబు. “సరే ఈ scene ఒకసారి rewind చేసి చూశాక, అప్పుడు వదిలేస్తాను,” sadisticగా నవ్వాడు రాజు.

“కెవ్వు,” అన్న అరుపు మళ్ళీ ఆ గదిలో ప్రతిధ్వనించింది.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

One Response to అమెరికాలో ఆపసోపాలు – 9 (పెళ్ళి వీడియోనా మజాకానా!)

  1. మరమరాలు says:

    మీ ఆపసోపాలు చాలా బాగున్నాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s