అమెరికాలో ఆపసోపాలు – 7 (Jokes for all times)


మొదటి joke పేరు – Joke of the week. ఇదేదో బాగుండేలా ఉంది అని సూరిబాబు ఆ mail open చేశాడు. Mail load కావడానికి ఒక గంట పట్టింది. ఇంత పెద్ద mail ఏమిట్రా అని ఆశ్చర్య పోయాడు సూరి. తెరిచిన తరువాత అర్థమయ్యింది అతనికి విషయం.

మొదటి పది పేజీలు అంతా forwarding headers ఉన్నాయి. ఆఖరి ఇరవై పేజీలు అంతా signatures ఉన్నాయి. మధ్యలో ఒక నాలుగు lines joke ఉంది. కసిగా పళ్ళు కొరుక్కున్నాడు సూరి.

ఆ mail delete చేసి, తరువాతి దాని వైపు చూశాడు. దాని పేరు joke of the month. ఇది కూడా 30 పేజీల నాలుగు lines ఉంది. విచిత్రం ఏమిటంటే ఈ joke ఇంతకు ముందు చదివిన joke of the week!

ఇక మిగతా mail చదువ దల్చుకోలేదు సూరి. వెంట వెంటనే తరువాత ఉన్న joke of the year, joke of the decade, joke of the century అని వరుస పెట్టి delete చేసేశాడు.

పక్క cubeలోంచి రవి ఘొల్లున నవ్వాడు. ” ఒరే సూరి, ఇప్పుడే నాకు ఎవరో joke of the millennium పంపించాడు, నీకు forward చేయమంటావా?” అడిగాడు. “పంపకు, పంపినా చదవను,” కరకుగా సమాధానం ఇచ్చాడు సూరి.

“ఈ విషయంలో అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు. లేక పోతే mailbox అంతా ఈ చచ్చు jokesతో నిండిపోయేలా ఉంది,” తనలో తాను గొణుక్కుంటూ cafetaria వైపు బయలుదేరాడు.

అక్కడ ఒక 20 మంది దేశీలు ఒక నాలుగు tables లాక్కుని చుట్టూ గుంపుగా కూచుని lunch చేస్తున్నారు. సూరిని చూడగానే వారిలో ఒకడయిన రాజశేఖర్, “గురూ, రేపంతా airport కి వెళ్తున్నాం, నువ్వు కూడా వచ్చేయి,” అన్నాడు.

“దేనికి?” ప్రశ్నించాడు సూరి. “రాజు గాడు India వెళ్ళాడు కదా.. పెళ్ళి చేసుకొని భార్యతో సహా వేంచేస్తున్నాడు,” explain చేశాడు అతను.

“ఇద్దరిని receive చేసుకోవడానికి 20 మందా?” బోల్డు ఆశ్చర్యపోయాడు సూరి. ఈ వింతేదో చూద్దామని, “సరే, నేను వస్తానులే,” అన్నాడు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s