అమెరికాలో ఆపసోపాలు – 8 (airport ప్రహసనం)


రాజు తన నూతన వధువుతో San Fransisco airportలో దిగి గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. “అబ్బా ఎంత హాయిగా ఉందో! వెధవ Indiaలో ఆ దుమ్మూ, ధూళీ, రోడ్ల మీద రద్దీ చూసి విసుగు వచ్చింది. అందుకే అన్నారు పెద్దలు, జన్మ భూమి ఇచ్చినంత ఆనందాన్ని ఏదీ ఇవ్వదని,” అన్నాడు తమకంతో.

ఆ విషయం బయటకే అన్నాడేమో, అతని భార్య, ఆశ్చర్యంగా చూస్తూ,”మీ జన్మ భూమి India కదండీ?” అంది. రాజు ఉలిక్కిపడి నాలుక కర్చుకున్నాడు. “అవును కదూ, sorry రాధా, ఏవిటో ఈ cityలో నాలుగేళ్ళ నుంచీ ఉండి నాకు బాగా అలవాటయిపోయింది,” నొచ్చుకున్నాడు.

“ఒరే రాజూ!” ఒక పొలికేక వినిపించింది వాళ్ళకు, తిరిగి అటు వైపు చూసిన రాజూ, రాధలకు, ఒక ఇరవయిమంది ఉన్న పెద్ద గుంపు వాళ్ళ వైపు వస్తూ కనిపించింది.

“రాధా, వీళ్ళంతా, officeలో నా colleagues, చూశావా, ఎంత ప్రేమతో ఆప్యాయతతో నాకోసం వచ్చారో!” గర్వంగా అన్నాడు రాజు. రాధ కూడా ఎంతో అబ్బుర పడింది వాళ్ళ స్నేహశీలతకు.

దగ్గరకు రాగానే, రాజశేఖర్ అడిగాడు, “ఒరే రాజూ, మీ luggage ఎక్కడుందిరా,” అని. “అదిగోరా, అక్కడ. బోల్డు మంది జనం ఉన్నారని, వెళ్ళలేదు,” సమాధానం ఇచ్చాడు రాజు.

“ఎంత మాటన్నావురా! మేమంతా చచ్చి పోయాం అనుకున్నావా?” బాధగా అన్నాడు రాజశేఖర్. పొలోమంటూ అంతా baggage claim వైపు బయలుదేరారు, ఒక్క సూరి బాబు తప్ప.

“చూశావా, నేను చెప్పలా, వీళ్ళకు నేనంటే ఎంత రెస్పెక్టో,” flight లోనుంచీ లేపేసిన kleenexతో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు రాజు. “నాక్కూడ ఇవ్వండి,” ముక్కు ఎగబీలుస్తూ చేయి చాపింది రాధ.

వెళ్ళిన ఇరవయి మంది, successfulగా రెండు సూట్‌కేసులు పట్టుకుని వచ్చేశారు. “ఒరే thanksరా, అనవసరంగా శ్రమ పడ్డారు,” గద్గదంగా అన్నాడు రాజు.

“నీకే thanks చెప్పాలి రా! జిలేబీలు, కారప్పూస భలే ఉన్నాయి,” మూతి తుడుచుకుంటూ అన్నారు మిత్రులంతా. “అంటే?” ఆశ్చర్యంగా నోరుతెరిచాడు రాజు.

“అంటే ఏం లేదు. నీ సూట్‌కేసులు తెరిచేసి అంతా తినేశాం,” బొద్దుగా ఉండే బంగార్రాజు రాజశేఖర్ చొక్కాతో చేతిని తుడుచుకుంటూ చెప్పాడు.

“ఇక వస్తాంరా, అసలే ఈ రోజు Bulls vs. Knicks match ఉంది. తొందరగా వెళ్తే కానీ timeకి చేరుకోలేం. మీరు నెమ్మదిగా వచ్చేయండి,” అంటూఎంత అకస్మాత్తుగా వచ్చారో అంతే అకస్మాత్తుగా మాయమయ్యారు కొలీగ్స్ అంతా.

శిల విగ్రహంలా నిలబడి ఉన్న రాజు భుజం తడుతూ, “పదండి, నేనుమిమ్మల్ని drop చేస్తాను,” offer చేశాడు సూరి బాబు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

2 Responses to అమెరికాలో ఆపసోపాలు – 8 (airport ప్రహసనం)

  1. Naveen Garla says:

    మీ అనుభవాలు భలే నవ్వు తెప్పిస్తున్నాయి.. ముఖ్యంగా మీ శైలి 🙂

  2. SHREYUS says:

    nice writing talent mamu……..
    http://blogesha.blogspot.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s