అమెరికాలో ఆపసోపాలు – 5 (AMWAY? NO THANKS! NO WAY!!!)

“Hello, hello, ఏంటి డిన్నర్‌కని వచ్చారా?” పక్కనుంచి chair లాక్కుని కూర్చుంటూ ప్రశ్నించాడు ఆయన. “లేదు, అందరూ తినేంత వరకూ కూచుని వాళ్ళ ఎంగిలి పళ్ళాలు కడుగుదామని వచ్చాం,” కసిగా సమాధానం ఇచ్చాడు సంజయ్.

“హబ్బా, హబ్బా, మీరు భలే జోకులు వేస్తారండి, చిలిపి,” అని ఆయన సూరి బాబు వైపు తిరిగి, “Hello, నా పేరు వ్యాపార రావు. మరి మీ పేరో?” అని అడిగాడు.

సూరి బాబు, “మీరు మా ఇంటి వెనుకాతల ఉండేవాళ్ళా? మీఇంట్లో జామ చెట్లూ, గట్రా ఏవైనా ఉండేవా?” కొద్దిగా భయం భయంగా అడిగాడు.

“ఒక వేళ ఉంటే ఇప్పటికి గుర్తు పట్టి ఉండేవాడిని కాదండీ! ఐనా వెధవది, మనుషులు స్నేహితులు కావాలంటే పక్క పక్క ఇళ్ళల్లోనే ఉండాలేవిటి? స్నేహం అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో చెప్పడం ఎవ్వరి తరమూ కాదు. ఇప్పుడు ఉదాహరణకు, మిమ్మల్ని చూస్తూంటే నాకు ఎప్పట్నుంచో బాగా తెలిసిన వాళ్ళలా కనిపిస్తున్నారు,” గద్గదంగా అని కళ్ళు తుడుచుకున్నాడాయన.

“మరే, ఆరు నెల్ల కింద, మనమిద్దరం మొదటి సారి కలిసినప్పుడు, నాతో కూడా ఇలానే అన్నారు,” అన్నాడు సంజయ్. “మీ ఫ్రెండ్‌కి మాంచి sense of humor,” అని సంజయ్‌ని అస్సలు పట్టించుకోకుండా, “ఇవిగోండి, మా family photos,” తన walletలో నుంచి తీసి ఇచ్చాడు ఆయన.

సూరి బాబు వాటిని చూసి “బాగున్నాయండీ,” అన్నాడు ఏమనాలో తెలీక. “మరే, మీరే కాదు, చూసిన వాళ్ళంతా అలానే అంటారు. అంతా మీ అభిమానం,” అని, “ఇదిగోండి నా business card. మీ number ఇవ్వండి,” pen పట్టుకుని ready అయిపోయాడు ఆయన.

“మా వాడికి ఇక్కడ ఇంకా number లేదు. అసలు వీడు ఇక్కడ ఉండడు. వీణ్ణి వదిలేయండి,” అన్నాడు సంజయ్. “మీరు మరీనూ! నేనేమన్నా మీ friendని కొరుక్కు తినేస్తానా? మా ఇంటికి ఈ శనివారం భోజనానికి పిలవడానికోసం నేను అడిగేది,” అని “సూరి బాబు గారు! మా ఇంటికి తప్పకుండా రావాలి. మా ఆవిడ కూడా మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తుంది.ఆ రోజు మనం ఇంచక్కా బోల్డు సేపు మాట్లాడుకోవచ్చు. నేను సంజయ్‌గారి ఇంటికి call చేసి మీకు గుర్తు చేస్తాను లెండి,” అని లేచాడు ఆయన.

“మేము ఈ weekend ఊళ్ళో ఉండడంలేదు. చెట్లు, పుట్టలు పట్టుకొని camping tripకి వెళ్తున్నాం,” ఆఖరి ప్రయత్నం కింద protest చేశాడు సంజయ్. “ఈ Saturday! మర్చిపోకండే”, అని వ్యాపారరావు restaurant బయటకి నడిచాడు.

“అవున్రా, ఆయన అంత ఆప్యాయంగా మాట్లాడుతూంటే, నువ్వేమిట్రా అలా అంత వెటకారంగా ఉన్నవు?” అడిగాడు సూరి బాబు. “ఒరే సూరీ! నీకు తెలీదురా. ఆయన ఎవరనుకున్నావు? Amway networkలో ఉన్నాడు. కనపడిన ప్రతివాడినీ పట్టుకుని, member చేయడమే ఆయన జీవిత ధ్యేయం. చాలా ప్రమాదం,” హెచ్చరించాడు సంజయ్.

“Amwayనా? అదేదో networking business కదూ?” అన్నాడు సూరి.

“అవున్రా, అదే! నువ్వు ముందస్తుగా ఆరు మందిని members చేయాలి. వాళ్ళలో ఒక్కొక్కరు చెరేసి ఆరు కొత్త membersని చేయాలి. వాళ్ళు ఇంకో ఆరు…” అంటున్నసంజయ్‌ని మధ్యలోనే అడ్డుకొని, “విషయం అర్థమయ్యిందిలే. అలా చేస్తే ఏమవుతుంది?” అడిగాడు సూరి.

“అందరు members నెలకు ఇంత డబ్బు పెట్టి Amway products కొనాలి. అప్పుడు అందులో నీకు కొంత commission వస్తుంది….” మిగతా process అంతా explain చేశాడు సంజయ్.

“ఏడిసినట్టుంది. ఇలాంటి schemes మన Indiaలోనూ ఉన్నాయి కద. నువ్వు ప్రతి ముగ్గురిని members చేయడం, వాళ్ళు ఇంకో ముగ్గురిని…” సూరి బాబు చెబుతూండగానే మధ్యలోనే సంజయ్, “కానీ, సూరీ, ఇందులో ఒక బాధ ఉంది. ఒకవేళ పీల్చే గాలి కొనాల్సి వస్తే అది కూడా Amway దగ్గరనుంచే కొనుక్కుంటారు ఈ Amway members. పైగా ఒకప్పటి స్నేహితులు వీళ్ళని చూస్తే పరుగు లంకించుకుంటారు. కానీ వీళ్ళు పట్టించుకోరనుకో. అందుకే నేనంత దురుసుగా మాట్లాడాను ఆయనతో,” అన్నాడు.

“మొత్తానికి మీ bay area భలే eventfulగా ఉందిరా. ఇక పద. నాకన్నిరకాలుగా కడుపు నిండింది,” అన్నాడు సూరి బాబు. ముగ్గురూ బయటకు నడిచారు.
(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

3 Responses to అమెరికాలో ఆపసోపాలు – 5 (AMWAY? NO THANKS! NO WAY!!!)

  1. Ramya says:

    abbO, amway tala neppi maakU vumdi.

  2. Murali says:

    ఎందరో Amway బాధితులు! అందరికి వందనాలు!

  3. ram says:

    మీ katha అదిరింది గురు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s