అమెరికాలో ఆపసోపాలు – 2 (నవలామణి నవలల పిచ్చి)


పొద్దున్నే ఏడు గంటలకు కళ్ళు నులుముకుంటూ చికాకుగా చుట్టు పక్కల చూశాడు సంజయ్. “వెధవ విమానాలు, పొద్దున పూటైతే ఠంచనుగా timeకి వచ్చేస్తాయి,” తనలో తాను గొణుక్కున్నాడు. ఇప్పుడతను airportలో ఉన్నాడు.

“ఒరే సంజయ్!” అంటూ సుడిగాలిలా దూసుకుని వచ్చాడు సూరి బాబు. “ధన్యవాదాలురా. సమయమునకు వచ్చి నా కార్యమును సులభము చేసితివి,” అన్నాడు ఎలుగుబంటిలా సంజయ్‌ని వాటేసుకుంటూ.

“ఇంకో సారి ఆ అచ్చ తెలుగులో మాట్లాడావంటే నరుకుతా,” అన్నాడు సంజయ్ కోపంగా. “ఇప్పుడు officeలో లేవుగా. మామూలుగా మాట్లాడి ఏడువు. పైగా మాటి మాటికి కార్యం, కార్యం అనకురా బాబూ,” చుట్టూతా చూస్తూ అన్నాడు. అసలే bay areaలో తెలుగు వాళ్ళు ఎక్కువాయే!

“సారీ రా, ఈ మధ్య office నుంచి నీకు చేసిన calls వంటివి ఎక్కువ చేయడంతో ఇలా అలవాటైపోయింది. అన్నట్టు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?” question mark face పెట్టాడు సూరి.

“ముందు నిన్ను ఇంటికి తీసుకెళ్తా. అక్కడ కాఫీ లాగించి, నువ్వు స్నానం అఘోరించాక నిన్ను నీ interview site దగ్గర పడేసి నేను officeకి పోతా. సాయంత్రం నిన్ను pick up చేసుంకుంటా,” program వివరించాడు సంజయ్.

“ఐతే మీ ఆవిడని చూస్తానన్న మాట! ఏవిటోరా సంజయా, మనం ఇంత దగ్గరి స్నేహితులం కదా, నీ పెళ్ళికి నేను రాలేకపోయాను. ఎలా వస్తానులే, నువ్వు Indiaలో చేసుకుంటే. మా బాసు గాడు నా పెళ్ళికి నన్ను India వెళ్ళనివ్వడానికే ఏడుస్తున్నాడు. పైగా, మీ దేశంలో వరుడి బదులు కత్తిని పంపించచ్చు కదా అని కుళ్ళు జోక్ ఒకటి వేశాడు కూడా.

వాడు ఈ మధ్యనే “India Made easy for Americans” అన్న non-fiction book ఒకటి చదివి, తనకు ఇప్పుడు India గురించి అంతా తెలుసు అన్నట్టు behave చేస్తున్నాడు. అన్నట్టు మీ ఆవిడ పేరేమిట్రా?” ప్రశ్నించాడు సూరి బాబు.

“తన పేరు గాంధర్వ గౌళ. అదిగో! అలా ఆశ్చర్య పడకు. తను ఆంధ్రుల ఆర్భాట రచయిత వానమూరి ధీరేంద్రనాథ్‌కి వీర అభిమానిలే. చిన్నప్పుడు ఏం పేరు పెట్టరో కానీ తన పన్నెండొ ఏట ఇలా పేరు మార్చుకుంది. కొంచెం నవలల భాష మాట్లాడుతుంది కూడా. ఖంగారు పడకు,” చెప్పాడు సంజయ్.

“గాంధర్వ గౌళ? అదేం పేర్రా బాబూ? సరేలే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిరుచి,” సాలోచనగా తల పంకించాడు సూరి బాబు. “పద, ఇంటికి వెళ్దాం,” అంటూ exit వైపు దారి తీశాడు సంజయ్.

*************************************************************

“నీ ఇల్లు చక్కగా ఉందిరా సంజిగా!” గాంధర్వ గౌళ ఇచ్చిన కాఫీ అందుకుంటూ అన్నాడు సూరి బాబు. “Thanks రా,” సూరి బాబుతో అని, “అన్నట్టు కొద్దిగా చక్కర తక్కువైనట్టుంది?” అడిగాడు సంజయ్ గౌళని.

“నిజమేనండీ. కాఫీలో చక్కర తక్కువే అయ్యింది. బహుశా నిన్న చక్కర నిండుకుంది అని తెలిసినప్పుడు, మీకు చెప్పాలని వచ్చినప్పుడు, సోఫాలో నిద్రపోతున్న మీ మొహంలోని ప్రశంతత చూసి, దాన్ని చెదిరిపోనీయడం ఇష్టం లేక, మౌనంగా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోవడమే నేను చేసిన పొరపాటేమో… కాఫీలో చక్కర లేకపోవచ్చండి, కానీ మల్లె పూవు లాంటి స్వచ్ఛత, మంచి గంధంలాంటి నా ప్రేమ అందులో రంగరించి కలిపానండి. అయ్యో! మీకు ఎలా చెప్పనండి?” గౌళ గొంతులో విషాదం ధ్వనించింది.

సూరి బాబుకి తాగుతున్న కాఫీ పొలమారి, దగ్గుతూ, టక్కున లేచి నిల్చున్నాడు. “ఖంగారు పడకురా సూరీ. నే చెప్పానుగా ముందే,” సూరి బాబుతో అని, “సారీ గౌళా! నేనే విషయం పూర్తిగా కనుక్కోకుండా తొందర పడ్డాను,” గౌళను అనునయించాడు సంజయ్.

గౌళ మౌనంగా కప్పులు వారి దగ్గరినుండి తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది.

*************************************************************

సూరి బాబు శనివారం నిద్ర లేచేప్పటికి పదకొండు గంటలయ్యింది. కళ్ళు నులుముకుంటూ living roomలోకి వచ్చాడు. “కాఫీ మైక్రోవేవ్‌లో ఉంది. వేడి చేసుకోండి,” అంది గౌళ, చదువుతున్న నవలలోంచి తలెత్తి. సూరి బాబు నవల పేరుని యధాలాపంగా చదివాడు. అది వానమూరి ధీరేంద్రనాథ్ రాసిన “దానవుడు” నవల.

సూరి బాబు కాఫీ తెచ్చుకుని సోఫాలో కూర్చుంటూ, “సంజయ్ ఇంకా లేవలేదా?” అని అడిగాడు గౌళని. గౌళ, “ఆయన showerలో ఉన్నారు,” అని చెప్పి, “ఇది చూశారా? వానమూరి ఎంత గొప్ప వాక్యం రాశాడో ఇక్కడ,”అంది. “ఏమిటది?” అని అడుగుతూనే నాలుక కరుచుకున్నాడు సూరి.

“మనిషి ఒంటరిగా గుక్క పట్టి ఏడ్చే అవకాశం ఇవ్వడానికే భగవంతుడు రాత్రినిసృష్టించాడట,” గౌరవం నిండిన గొంతుతో అంది గౌళ.

“నిజమా? నేను నిద్ర పోవడానికి అనుకున్నాను,” sincereగా అని మళ్ళీ నాలుక కరుచుకున్నాడు సూరి.

అప్పటికే గౌళ అతనివైపు ఒక అసహ్యమయిన చూపు విసిరింది.

“మాములు మనుషులు అలా అనుకుంటారు. వానమూరి కాదు. ఇంతకు ముందు ఇదే నవలలో చెప్పాడు. మనమంతా మారాలంటే, capitalism communism ఇవేవి సహాయం చేయవట. మనుషుల్లో భావ విప్లవం రావాలట. భావ విప్లవం వచ్చినా, ఎందుకైన మంచిది, ఒక వ్యక్తి Chengiz Khanలా కొరడా పట్టుకొని అందరిని బాదుతూ ఉండాలట. ఎంత బాగా చెప్పాడో చూడండి. That is వానమూరి,” అంది గౌళ అనందంగా.

“ఓహో! ఐతే మరి ఎవరు Chengiz Khan అని మనకు ఎలా తెలుస్తుంది?”ప్రశ్నించాడు సూరి బాబు.

“ఎలా తెలియడమేమిటి? భావ విప్లవం రాగానే Chengiz Khan కూడా అవతరిస్తాడు,” అంది గౌళ.

“మరి భావ విప్లవం ఎప్పుడు వచ్చిందో మనకు ఎలా తెలుస్తుంది,” పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రశ్నించాడు సూరి.

“వీపు మీద కొరడా వాతలు తేలగానే తెలుస్తుంది,” కసిగా సమాధానంఇచ్చింది గౌళ. ఆమెకు చాలా చిరాగ్గా ఉంది. ఇంతకు ముందు ఎవరైనా, ఆమె ఏం చెప్తే అది విని ఊరుకునేవారు. సూరి బాబులా ప్రశ్నలు వేసి, ఇలా ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. వానమూరి ఇలాటి సవాళ్ళని ఎలా ఎదుర్కుంటాడో అని, అప్పుడు ఆమెకు ఒక సందేహం కలిగింది.

ఇంతలో సంజయ్ బయటకు వచ్చి, “ఒరేయి. ఈ రోజు సాయంత్రం Indian restaurantకి dinnerకి
వెళ్తున్నాం. So, అదీ evening మన program”, అంటూ announce చేశాడు.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

4 Responses to అమెరికాలో ఆపసోపాలు – 2 (నవలామణి నవలల పిచ్చి)

 1. sujji says:

  కాఫీలో చక్కర తక్కువే అయ్యింది. బహుశా నిన్న చక్కర నిండుకుంది అని తెలిసినప్పుడు, మీకు చెప్పాలని వచ్చినప్పుడు, సోఫాలో నిద్రపోతున్న మీ మొహంలోని ప్రశంతత చూసి, దాన్ని చెదిరిపోనీయడం ఇష్టం లేక, మౌనంగా వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోవడమే నేను చేసిన పొరపాటేమో… కాఫీలో చక్కర లేకపోవచ్చండి, కానీ మల్లె పూవు లాంటి స్వచ్ఛత, మంచి గంధంలాంటి నా ప్రేమ అందులో రంగరించి కలిపానండి. అయ్యో! మీకు ఎలా చెప్పనండి?”

  hahahahaaaaaaaaaaaaaaaa…

  konni rojulu navvukoni, migatha comment raastanu.. !!

 2. Murali says:

  సుజి గారూ,

  నాక్కూడా ఆ డయలాగ్ బాగా నచ్చింది. 🙂

  -మురళి

 3. K says:

  I read some of your posts for the first time. I laughed a lot. Esp this part is hilarious. Thank you.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s