అమెరికాలో ఆపసోపాలు – 1 (పరిచయ కార్యక్రమం)

(గమనిక: “అమెరికాలో ఆపసోపాలు” 96-97లో నేను రాసిన సీరియల్ కథ. ఇది ఒక రకంగా నేను ఇంతకు ముందు రాసిన “సీనియర్”కి loose sequel. ఐతే అందులో పాత్రలు ఈ కథలో కనిపించవు. “సీనియర్” అమెరికాకి చదువుకోవడానికి వచ్చిన తెలుగు విద్యార్థుల గురించి ఐతే, ఈ కథ అమెరికాలో పని చేస్తున్న తెలుగు బాచిలర్స్ గురించి. కథా కాలం పదేళ్ళ కిందటిది. ఆ విషయం దృష్టిలో ఉంచుకుని చదవమని మనవి.)


“Tring Tring,” అంటూ phone మోగింది. misc.unnecessary.rubbish newsgroup చదువుకుంటున్న సంజయ్ విసుగ్గా phone అందుకున్నాడు.”Hello, ఏదో-ఒకటి-soft technologies, Sanjay speaking. How can I help you today?” అన్నాడు యధావిధిగా. “నీ accent తగలెయ్యా! నేనురా సూరిబాబుని,” అటు వైపు నుంచీ ఒక కరుకయిన గొంతు వినవచ్చింది.

“ఒరే సూరీ నువ్వా, చెప్పరా విశేషాలేమిటి?” అన్నాడు అనందంగా సంజయ్. సూరి బాబు అతనికి చిన్నప్పటినుంచీ తెలుసు.

“రేపు నేను మీ రాష్ట్రానికి వస్తున్నాను. అక్కడ నాకు బే సున్నిత సంస్థ లో మద్యాహ్నం పరిచయ కార్యక్రమం ఉంది. నీవు నన్ను విమాన స్థావరానికి వచ్చి కలుసుకో,” అన్నాడు సూరి బాబు.

“??? ఏమంటున్నావురా సూర్లూ???” అయొమయం సంజయ్ గొంతులో ధ్వనించింది. “మొన్న weekend మాట్లాడినప్పుడు బాగానే ఉన్నావు కదరా? పొరపాటున ఎవరైనా Amway దేశీని కలిశావా? ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు?” బోల్డంత బాధ పడిపోయాడు సంజయ్.

“నీ బొందరా. నేనిప్పుడు office నుంచి మాట్లాడుతున్నా. Englishలో ఏడ్వలేను కద! నువ్వే Englishలోకి translate చేసుకో,” చిరాగ్గా అన్నాడు సూరి బాబు.

రెండు నిమిషాల తరువాత bulb వెలిగింది సంజయ్‌కి. “ఓహో, నువ్వనేది, నీకు మా దగ్గర Baysoftలో interview ఉంది. నేను నిన్ను airportకి వచ్చి receive చేసుకోవాలి. అంతేనా?”

“అంతే, అంతే రక్షించావురా బాబూ. రేపు పొద్దున ఏడు గంటలకి విమానం వస్తుంది. నన్నూ నా luggage ని మోసుకుని తెస్తుంది. అక్కడ తగలడు.” phone click మంది.

“ఈ వెధవది అంతా అవక తవక వ్యవహారమే. పొద్దున ఏడు గంటలకి రావడమేమిటి nonsense,” తనలో తాను గొణుక్కున్నాడు సంజయ్. నిజమే మరి చిన్నప్పుడు ఎప్పుడో N.T.R నటించిన అడవి రాముడు cinema grand morning showకి వెళ్ళడానికోసం పొద్దున్నే లేచాడు సంజయ్. ఆ తరువాత ఇదే మళ్ళీ.

(సశేషం)

Advertisements
This entry was posted in అమెరికాలో ఆపసోపాలు. Bookmark the permalink.

5 Responses to అమెరికాలో ఆపసోపాలు – 1 (పరిచయ కార్యక్రమం)

 1. Bhanu Chowdary says:

  Chala Bagundi Murali garu

 2. Murali says:

  పింకీ గారూ,

  మొదటి భాగం గురించి అంటున్నారా లేక మొత్తం కథ గురించా? 🙂

  -మురళి

 3. gayatri says:

  murali
  meeru keka
  chala chala bagundi
  nenu kadha anta chadivanu
  office lo navvaleka enduku navvano ikkada
  vallaki cheppaleka nenu padina avastha varnanateetham
  meeru pettina perlu adbhutam like vasava sajjika
  (kajjikaya la undi kada peru)
  gandharva goula….
  keep it up murali
  i really appreciate it
  thanks for such nice blogs
  gayatri

 4. sahasra says:

  Murali garu,
  AA concept chaala baavundi. Madhyalo konni konchem athiga anipinchina, overall ga baavundi. Chaala rojula taravaatha mana telugu comedy ki navvukunna. Perulu maree navvu teppinchaayi. Keep it up! Bay Area valla gurinchi bhale chepparu. ha ha
  -Sahasra

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s