రె.కాఘవేంద్ర రావు మరియు వె.కిశ్వనాథ్‌ల కథ

దక్షిణాదిన, రె. కాఘవేంద్ర రావు అనే ఒక అనురక్తుడు ఉండే వాడు. రాత్రి 8 గంటలకి నిద్ర లేచి దగ్గర్లో ఉన్న కల్లు కాంపౌండ్‌కి వెళ్ళి తప్ప తాగి మాంసాదులు భుజించి పొద్దున ఇంటికి చేరుకునే వాడు.

ఒక రోజు సాయంత్రం ఫాక్టరీ కార్మికులు స్ట్రైక్ చెయ్యడం వల్ల సైరన్ తొందరగా మోగి 5 గంటలకే లేచి కల్లు కాంపౌండ్ వైపు బయలు దేరాడు.

ఎప్పుడూ పొద్దున వెళ్ళని వాడు కావున దారి తప్పి ఒక గుడికి చేరుకున్నాడు. ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి ఇదేనేమో అనుకున్నాడు.

సాధారణంగా తాగుబోతులు ఎవరూ అటు వైపు వెళ్ళరు. అక్కడ వె.కిశ్వనాథ్ అనే ఒకాయాన వాళ్ళకి సంగీత పరమైన చిత్రాలు చూపించి తాగుడు మానిపిస్తూ ఉంటాడు.

రె.కాఘవేంద్ర రావు గుడిలో వెళ్తూంటే ధూపాలు, దీపాలు, కొబ్బరి చిప్పలు లాంటివి కనిపించాయి దారంతటా. భయపడుతూ ఉండగానే వె.కిశ్వనాథ్ వచ్చేసి, “దా! కంకారాభరణం చూద్దాం,” అన్నాడు.

రె.కాఘవేంద్ర రావు తక్కువ వాడేం కాదు. అంతకు ముందు ఎంతో మంది పండితులని (కాటూరి లాంటి వాళ్ళని) బూతు పాటలు రాయించి భ్రష్టు పట్టించాడు; కాబట్టి సరే అన్నాడు.

మొదటి పది నిముషాలు చూడగానే రె.కాఘవేంద్ర రావుకి మంచి వాణ్ణి అయిపోతానేమో అని భయం పట్టుకుంది. పారి పొవడానికి ప్రయత్నించాడు. వె.కిశ్వనాథ్ అతని నెత్తిన శఠగోపంతో కొట్టి గుడి స్తంభానికి కట్టేశాడు.

“ఏదో ఒక రోజు మంచి సినిమా చూడాలిసిందే ఎవరైనా. నాకేం బాధ లేదు. కాకపోతే నాకు ఒక నియమముంది,” అన్నాడు రె.కాఘవేంధ్రరావు.

“ప్రతి రాత్రి కల్లు కాంపౌండ్‌కి వెళ్ళి తప్ప తాగి వెనక్కి రావడం నా ఆనవాయతి. కాబట్టి నన్ను వదిలేస్తే దాహంతో ఎండుకు పోయిన పెదవులని కాస్త ఒక పది ముంతల కల్లుతో తడుపుకుని వస్తాను,” అన్నాడు.

వె.కిశ్వనాథ్ నవ్వి, “మాకు తెలీనివి కావులే ఈ విద్యలు. ఒక సారి వదిలేస్తే మళ్ళీ దొరుకుతావా?” అన్నాడు.అప్పుడు రె.కాఘవేంధ్రరావు, దాదా కోండ్కే మీద, ఇంక ఇతర గొప్ప బూతు దర్శకుల మీద ఒట్లు పెట్టాడు. కాని వె.కిశ్వనాథ్ ప్రతి సారి శఠగోపంతో ఒక్కటి ఇచ్చుకుని నేను నమ్మను అన్నాడు.

ఆఖరికి రె.కాఘవేంద్ర రావు, “నేను తిరిగి రాక పోతే నా తరువాతి సినిమలో హీరోయిన్ బొడ్డు చూపెట్టకుండా తీసినంత ఒట్టు,” అన్నాడు. అప్పుడు వె.కిశ్వనాథ్‌కి నమ్మకం చిక్కి రె.కాఘవేంద్ర రావుని వదిలేశాడు.

యధావిధిగా తప్ప తాగి పొద్దున్నే గుడికి తిరిగి చేరుకున్నాడు రె.కాఘవేంద్ర రావు. “రా వచ్చి పరిక్షీంచుకో, అవే కాళ్ళు, అవే చేతులు, అదే ముక్కు. కొంచెం మందు వాసన ఎక్కువ అంతే,” అన్నాడు.

వె.కిశ్వనాథ్ గర్భ గుడిలోంచి వచ్చి, రె.కాఘవేంద్ర రావు కాళ్ళ మీద పడి, “బ్రతికుంటే ఒక వెయ్యి మంది తాగు బోతుల్ని మార్చవచ్చు. కాని నీలాంటి వాడితో ఉంటే, నేను పాడైపోతాను. రాత్రంతా కనీసం ఒక పాటలో అయినా హీరోయిన్ బొడ్డు ఎక్స్‌పోజ్ చేస్తూ తీస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనలు. నువ్వు వెళ్ళిపో నాయనా!” అన్నాడు.

“ఎలా కుదురుతుంది? నేను ఫుల్లు లోడ్ మీద ఉన్నాను, ఈ మూడ్‌లో ఉన్నప్పుడు, మనం కదలం. పద కంకారాభరణం చూద్దాం,” అన్నాడు కాన్‌ఫిడెంట్‌గా కాఘవేంద్ర రావు.

అప్పుడు వె.కిశ్వనాథ్, “పోనీ, నాకు నువ్వు ఒక ముంత కల్లు తాగేంత టైం ఇవ్వు,” అన్నాడు.

రె.కాఘవేంద్ర రావు కోపంగా, “అంత టైం ఎలా ఇస్తాను? నాకు ఇప్పుడు నా వెధవ వాగుడు వినడానికి కంపెనీ కావాలి,” అన్నాడు.

“పోనీ, ముంతలో సగం ఖాళీ చేసేంత టైం ఇవ్వు,” అని బతిమాలుకున్నాడు వె.కిశ్వనాథ్.

“కుదరదు, కల్లు ఫ్రీగా దొరుకుతూంటే, నీళ్ళు తాగే వెర్రి వాడు ఎవడైనా ఉంటాడా?” అని ఎదురు ప్రశ్నించాడు రె.కాఘవేంద్ర రావు.

అప్పుడు వె.కిశ్వనాథ్, “ఆఖరికి తాగుబోతులకి కూడా కొంత బుర్ర పని చేస్తుందంటారు అప్పుడప్పుడు. కనీసం ఒక గుక్క కల్లు తాగేంత టైం ఇవ్వు,” అన్నాడు. రె.కాఘవేంద్ర రావుకి జాలి వేసి సరే అన్నాడు.

అంతే! వె.కిశ్వనాథ్ కళ్ళు మూసి తెరిచేంతలో టీషర్ట్, షార్ట్స్, జాగింగ్ షూస్ వేసుకుని తయారయ్యాడు. రె.కాఘవేంద్ర రావు గుటక మింగేంతలో రోడ్డుకి అడ్డం పడి పరిగెత్తుతూ మాయమయ్యాడు.

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

6 Responses to రె.కాఘవేంద్ర రావు మరియు వె.కిశ్వనాథ్‌ల కథ

 1. రవి says:

  శఠ గోపం తో కొట్టి….హహహ…

 2. కార్తీక్ పవన్‌ గాదె says:

  Hahaha,,Baagundi..Modatlo perlu porapatuna tappu rasesaremo anukunna 😛

  tarwata telsindi ee paarteek kavan (mee bhaashalO) asalu peru karthik pavan.. pappulo kaalesadani 😀

 3. Murali says:

  పవన్ గారు,

  మీ కామెంట్ కూడా అదిరింది. 🙂

 4. రాధిక says:

  ha ha…super

 5. కొత్త పాళీ says:

  A good take on the Amukta Malyada Mangala Kaisiki story.
  You do realize that Margazhi is in full swing right now!

 6. Murali says:

  కొత్త పాళి గారూ,

  మీ వ్యాఖ్య చదివాక, మీ బ్లాగుకి వెళ్ళి దాసరి కథ చదివాను. ఈ కథ ఆముక్త మాల్యదలోది అని నాకు తెలియదు ఇంత వరకూ.

  మా ఫ్రెండ్ నాకు చెప్పిన కథ ఆధారంగా నేను రాసిన spoof ఇది.

  -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s