రిచంజీవి ఫాన్స్ నుంచి రక్షణ కావాలి!

************************************************************************************
సందర్భం: టీవీ 999 చానెల్‌లో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమం
అతిథులు: వీజిత, వాజశేఖర్.
యాంకర్: ఎవరో ఒకరు. ప్రోగ్రాం క్వాలిటీలో ఎలాంటి తేడా వుండదు.
************************************************************************************


వీజిత: ఇది ఒక రాక్షస రాజ్యం. రిచంజీవి ఫాన్స్ మా మీద దాడి చేశారు. వాళ్ళనుంచి ఎవరికీ రక్షణ లేదు.

వాజశేఖర్: (ఆవేశంగా) అవును, What’s so great about him? (ఈ సారి ఆడియెన్స్‌లో నుంచి రాయి వచ్చింది.)

వీజిత: చూశారా, చూశారా. మీ Sutdioలో కూడా కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయి.

యాంకర్: అవి సంఘ విద్రోహ శక్తులు కావండి. ఆ రాయి విసిరింది మా camera man. ఆయన కూడా రిచంజీవి ఫానే!

వాజశేఖర్: ఐతే మాత్రం విసురుతాడా? What’s so geat about him?

యాంకర్: అంటే అలా సూటిగా అడిగితే ఏం చెప్పలేమండి. పోనీ మీరెందుకు గ్రేటో చెప్తారా?

వీజిత: I have to bring to your attention such questions are hypothetical and your is a hypothetical question. So he doesn’t have to answer that.

యాంకర్: ఓహో. వాజా గారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్న సామెత మీరు విన్నారా?

వాజశేఖర్: నేను తమిళంలో సామెతలే మర్చి పోయా. తెలుగు సామెతలు నాకేం తెలుస్తాయి? నాకొక్కటే తెలుసు. ఈ దాడికి రిచంజీవి గారే బాధ్యత వహించాలి.

యాంకర్: రాళ్ళు విసిరింది ఆయన కాదు కదండి?

వీజిత: అదంతా మాకు అనవసరం.

యాంకర్: బహుశా ఆ రాళ్ళు విసిరిన వారు ఈ మధ్య మీరు తీసిన “ఏ వెధవైతే నాకేంటి?” సినిమా చూసినట్టున్నారు. అందులో మీ పాత్ర మీకు నచ్చని పని ఎవరు చేసినా చితక బాదుతుంది కద.

వాజశేఖర్: అక్కడే నాకు కాలేది. అది సినిమా! ఇది జీవితం. సినిమాలో ఎన్నెన్నో చేస్తాం.

వీజిత: You are forgetting again. This is also a hypothetical question. So he doesn’t have to answer that.

ఒక పొలికేక: మరి రిచూ ఇంకా party పెట్టనే లేదు కద. ఒక వేళ పెడితే, నన్ను ఆహ్వానించినా చేరను అని వాడు చెప్పడం hypothetical answer కాదా?

వాజశేఖర్: ఎవరు, ఎవరది? ఇంకో సంఘ విద్రోహ శక్తా?

యాంకర్: అలాంటి వాడే. Double M.A. చేసి మా దగ్గర పని చేస్తున్న lightboy. వాడైతే యాకంగా crikcet balls విసిరే type.

(వాజశేఖర్, వీజితలు నిష్రమిస్తూ) ఈ రిచంజీవి ఫాన్స్ నుంచి మాకు రక్షణ లేదు

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

5 Responses to రిచంజీవి ఫాన్స్ నుంచి రక్షణ కావాలి!

 1. vennela says:

  bhale bhale

 2. Paidi Krishna says:

  బాగుంది బాగుంది!

 3. పద్మ says:

  హ్మ్. చిరంజీవి పార్టీ పెడితే చేరతారా అని అడిగితేనే కదా రాజశేఖర్ సమాధానం ఇచ్చింది. తనంతట తానుగా కాదుగా చెప్పింది. అప్పుడు అది hypothetical answer ఎలా అవుతుంది? కొన్నింటికి లాజిక్కులు తీయకూడదేమోలెండి. నాగేంద్రబాబు రియాక్షన్ మీద కూడా రాయాల్సింది. అది ఇంకో పెద్ద జోకు.

 4. mohanrazz says:

  Choostunte AP lo rajakeeya sameekaranaalu vichchalavidigaa maaripoyetattu kanipistunnayi. Endukante asalE rajashekhar Telangana ki maddatu palikaadu. ammo. ippudu emavutundo emo.

 5. హరే కృష్ణ says:

  🙂
  good one!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s