“బ్యాండు” రంగడు

రె.కాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన చిత్రం “బ్యాండు రంగడు” విడుదల అయ్యిందన్నది తెలుగు సినీ ప్రేక్షకలోకానికి తెలిసిన విషయమే.

మహా భక్తుడైన మా అప్పారావు థియేటర్‌కి మొదటి రోజే వెళ్ళిపోయాడు. కానీ వాడికి అభిమానుల గోలాహలంలో టికెట్లు దొరకలేదు. ఐనా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రతి రోజు వెళ్తూనే ఉన్నాడు.

ఐదో రోజు కాస్త తెరపిచ్చి, వాడు నిల్చున్న లైన్ టికెట్ కౌంటర్ వరకూ కదిలింది. కృష్ణ లీలలు చూడబోతున్నానన్న నమ్మకం రాగానే, మా వాడి ఆనందానికి అంతు లేకుండా పోయింది.

అంతకు ముందు ఆట వదలడంతో ప్రేక్షకులు గుంపులు గుంపులుగా బయట పడ్డారు. మా వాడు ఆత్రం ఆపుకోలేక అక్కడికక్కడే ఇంటర్వ్యూ మొదలు పెట్టేశాడు.

ప్రేక్షకుల్లో 90 శాతం వరకూ కుర్రకారు కావడంతో మా వాడి కళ్ళు చెమర్చాయి. “యువకుల్లో భక్తి తగ్గిపోయింది అనే వాళ్ళని కితకితలు పెట్టి చంపెయ్యాలి,” అనుకున్నాడు తనలో తాను.

“అన్నిటికంటే ఏ పాట బాగుంది?” అడిగాడు ఒక ఇరవయ్యేళ్ళ యువకుడిని. అతను చిన్నగా అటూ ఇటూ ఊగుతూ, “ద్రావిడలో ఒక ఆవిడతో, తో తో తో,” అన్నాడు. మా వాడు ఖంగు తిన్నాడు. కొంపదీసి ఏదైనా మళయాళం సినిమాకి వచ్చేశానా అనుకుంటూ చుట్టూ చూశాడు. చుట్టుపక్కల అంతా “బ్యాండు రంగడు” పోస్టర్లని చూసి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.

“దేని గురించి ఆ పాట?” బయటకు వచ్చిన ఇంకో ప్రేక్షకుడితో అన్నాడు. “మంచి ఊపున్న పాట సార్, లెక్కలేనంత మంది హీరోయిన్‌లతో డాన్స్, ఆఖరికి తెల్లాళ్ళు కూడా ఉన్నారు,” పరవశంగా అన్నాడు ఆయన. “లొకేషన్స్ అదిరాయి, ముఖ్యంగా థాయ్‌లాండ్‌వి,” అన్నాడు ఇంకొకతను.

“భక్తిరసం బాగా పండిందా?” ఇంకొక ప్రేక్షకుడిని ట్రై చేశాడు మా వాడు. “భక్తా?” ఆశ్చర్యంగా మొహం పెట్టాడు అతను. “ఇది భక్తి సినిమానా?” అంటూ మా వాడిని ఎదురు ప్రశ్నించాడు. మా వాడికి బుర్ర తిరిగింది.

అంతలో రకరకాల టీ.వీ. చానెల్స్ వాళ్ళు మైకులు పట్టుకుని వచ్చేశారు హడావుడిగా. వాళ్ళని చూడగానే కట్అవుట్‌ల దగ్గర దండలు సర్దుతున్న అభిమానులు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి యాంకర్లని చుట్టు ముట్టారు. వేరే ప్రేక్షకులకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళే “స్పందించడం” మొదలు పెట్టారు.

“బ్యాండు రంగడు గురించి మా చానెల్ ప్రేక్షకులకి చెప్తారా?” చారల టీషర్ట్ వేసుకొని, బుగ్గ మీద కత్తి గాటు ఉన్న ఒకతన్ని అడిగింది యాంకరమ్మ.

“ఇది ప్రతి ఆడ పడుచు మొదటినుంచి చూడాల్సిన చిత్రం. ఇందులో ఎంతో నీతి ఉంది. మరెంతో భక్తి ఉంది,” అన్నాడు అతగాడు పెద్ద గొంతుతో.

మిగతా అభిమానులు కూడా అలాంటి అభిప్రాయాలే వెలి బుచ్చడంతో, మా అప్పారావు ధైర్యంగా టికెట్ చేతిలో పట్టుకుని థియేటర్‌లోకి దూసుకు పోయాడు.

**********

మరుసటి రోజు మా వాడిని కలవడానికి వాడింటికి వెళ్ళాను. అప్పారావు వసారాలో కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చుని ఉన్నాడు.

“ఒరే అప్పిగా నీ కంటి చూపు ఎప్పుడు పోయిందిరా? ఇంత జరిగినా నాకెవరు చెప్పలేదేమిటి?” గద్గదమైన గొంతుతో అన్నాను. వాడు చేతులు ముందుకు చాచి తడుముకుంటూనే నాకు షేక్‌హాండ్ ఇచ్చాడు.

వాళ్ళ పనివాడు శీను, “గదేం లేదు సార్. గా బ్యాండు రంగడు సినిమ చూసొచ్చినంక, బాబు శానా పరెషాను అయ్యిండు. కొన్ని రోజులు ఈ పాడు లోకం చూడడంట. గాంధారి టైప్ అనుకోరాదే!” అన్నాడు.

అదేదో అడ్వర్టైజుమెంటులో చెప్పినట్టు నేను “అవాక్కయ్యాను.”

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

18 Responses to “బ్యాండు” రంగడు

 1. kranti says:

  🙂

 2. VIJAYA says:

  my feeling also bad rangadu, nenu chepithe evvaru nammatamleru guruvugaru

 3. Vihaari(kbl) says:

  🙂 🙂

 4. బ్యాండు(పాండు) రంగడు సినిమా గురించి ఇంత మంచి ‘స్పందన’ నేనెక్కడా చదవలేదు. భేష్ ’యాంకరమ్మ’ పదప్రయోగం బాగుంది.
  http://www.parnashaala.blogspot.com

 5. Murali says:

  మహేష్ గారు,

  యాంకరమ్మ ప్రయోగం నేను “టీ.వీ. ముచ్చట్లు” అనే పుస్తకంలో చదివాను. అది నాది కాదు. అలాగే “కిత కితలు పెట్టి చంపెయ్యడం” అన్నది “చిత్రం భళారే విచిత్రం” సినిమాలోది.

  పోతే ఎవరో చదువరి, నేను సినిమా చూడకుండా ఆర్టికల్ రాశాను అని నింద మోపాడు. “మంజునాథ” మాత్రం ఏం బావుంది అని అడిగాడు. నేను ఈ సినిమాని చూసే రాశాను. ప్రామిస్! అలాగే “మంజునాథ” కూడా నాకేం పెద్దగా నచ్చలేదు. ఎటొచ్చి అందులో “ద్రావిడలో ఒక ఆవిడతో” లాంటి పాటలు లేవు…

 6. టైటిలే అదిరింది. 🙂

 7. అవును…టైటిల్ అద్దిరింది. 100/100 మార్కులేశాను 🙂
  నిన్నంతా ఈ టైటిలు గుర్తొచ్చి పలు మార్లు నవ్వుకున్నాను.

  కాకుంటే ఒక చిన్న సూచన. URLలో తెలుగక్షరాలు ఉంచక…ఏదైనా ఆంగ్ల పదాలు వాడండి. మేము ఫార్వర్డ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.

 8. రవి says:

  సూపర్ గురు…బ్యాండు బజాయించావు…

 9. ఇలాంటి సినిమాలు చూడడానికి రాసిపెట్టుండాలి… ప్చ్…

 10. Murali says:

  నవీన్ గారు,

  మీ సలహా పాటిస్తాను. ధన్యవాదాలు.

 11. ravi says:

  super……….marvelous………worth watching for NBK fans…..:)

 12. Bhaskar says:

  Inka koddiga vivaristhe baagundedi..pratyekamuga Tabbu exposure gurunchi

 13. Murali says:

  అది పెద్ద వివరించేంత గొప్ప విషయం కాదు లెండి. అప్పారావు కళ్ళకు గంతలు కట్టుకోవడమే మనకు చెప్పకనే చెప్తుంది, ఆయన ఎన్ని ఘోరాలు చూశాడో ఆ సినిమాలో.

 14. ramana rao says:

  manchi sattire. gamanincha tagga vishayam emitante – fremont, california park theater lo “dravida lo oka aavida to paata complete ga cut chesaaru – “family ladies” offend avvutarani

 15. Pingback: పొద్దు » Blog Archive » జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం

 16. budugu says:

  బావుంది మీ write-up 🙂

  అప్పట్లో ఈ సినిమా ఆల్రేడీ చూసిన ఓ ఫ్రెండ్ ని..
  మంచి భక్తిరస చిత్రం అని ప్రోమోస్ లో తెగ చెప్తున్నారు..

  చూడొచ్చా అని అడిగితే..

  ముందు..
  ‘భక్తి’ ని బ్రాకెట్ లోకి తోసి ‘రస’ ని బోల్డ్ లొ పెట్టు..
  ఆపైన నీఇష్టం అన్నాడు..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s