రిచంజీవి పై నేను పోటీకి సిద్ధం!

త్రిలింగ దేశంలో ఎన్నికల జ్వరం అందరిని ఆవహించింది. పైగా రిచంజీవి పార్టీ పెడతాడు అన్న సూచనలు బలంగా ఉండడంతో, ఈ ఎన్నికలు కొత్త ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ఐతే ఇది ఒక కొత్త ట్రెండ్‌కి కారణమయ్యింది.

త్రిలింగ దేశం పార్టీకి చెందిన కూజా తను రిచంజీవి పై పోటీ చెయ్యడానికి సిద్ధం అని ప్రకటించింది. ప్రెస్ కాన్‌ఫరెన్స్ పెట్టి మరీ చెప్పింది. 

“అలా అని మీ పార్టీ మీకు ఆదేశాలిచ్చిందా?” అడిగాడు ఒక విలేఖరి.

“లేదు, ఎలా ఇస్తుంది? ఇంకా ఆయన పార్టీనే పెట్టలేదు కద?” ఎదురు ప్రశ్నించింది కూజా.

“మరి మీరే కదా సిద్ధం అన్నారు?” అయోమయంగా అడిగాడు విలేఖరి.  

“అంటే ఆయన నిలబడితే పోటీ చేస్తాను అని అర్థం.” 

“ఓహో, ఆయన నిలబడితే, మీరు ఎదురుగా పోటీ చెయ్యడం ఖాయం అన్న మాట!”

“ఖాయం కాదు లెండి. ఆయన పార్టీ పెడితే, నిలబడితే, మా అధిష్టాన వర్గం నన్ను ఆదేశిస్తే, అప్పుడు పోటీ చేస్తాను.”

“అలాగా. సర్లెండి. మీరు నిలబడ్డాక, ఆయనపై గెలిచాక అప్పుడు ఇంకో ప్రెస్ కాన్‌ఫరెన్స్ పెట్టుకుందురు గానీ,” ఉచిత సలహా పడేశాడు సదరు విలేఖరి.

ప్రెస్ కాన్‌ఫరెన్స్ అయిపోయింది కద అని తట్టా బుట్టా సర్దుకుంటున్న విలేఖరులను తోసుకుంటూ, “సైడ్ ప్లీజ్,” అంటూ ఒక శాల్తీ స్టేజ్ పైకి వచ్చి మైక్ దొరకపుచ్చుకుంది.

ఆశ్చర్యం, అతనెవరో కాదు, కొత్తగా గాంక్రెస్ పార్టీలో చేరిన సినీ నటుడు వాజశేఖర్! “ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది కూడా వినండి,” అంటూ గద్దించాడు.

“చెప్పండి చెప్పండి. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కద, రాసుకుంటాము,” అన్నాడు ఒక ప్రాక్టికల్ విలేఖరి.

“కూజా చెప్పిందే, నేనూ చెప్తున్నా! నేను కూడా రిచంజీవి పై పోటీ చెయ్యడానికి సిద్ధం!”

“ఐతే మీ పార్టీ మీకు అలా ఆదేశాలిచ్చిందా?” అన్నారు విలేఖరులు.

“అబ్బా, ఈ ప్రశ్నలన్ని అడిగి మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? కూజా ఆల్‌రెడీ చెప్పింది కద! ఆయన పార్టీ పెడితే, నిలబడితే, మా వాళ్ళు నన్ను నిలబడమంటే, అప్పుడు పోటీ చేస్తా!”

“మా విలేఖరులు అంటే మీకు ఎంత లోకువైపోయామండి! ఇలాంటి న్యూస్ చెప్పడానికి ప్రెస్స్ కాన్‌ఫరెన్స్‌లు పెడతారా?” వొళ్ళు మండి అన్నాడు ఒక సీనియర్ విలేఖరి.

“ఏదో మీ న్యూస్ పేపర్ సర్క్యులేషన్ పెరగడానికి పెద్ద మనసుతో పెట్టామండి!” అక్కసుగా అన్నాడు వాజశేఖర్. 

కూజా ఇంకా అక్కడినుంచి వెళ్ళిపోలేదు కామోసు, హుటా హుటిగా స్టేజ్ మీదకి వచ్చేసి, “ఏంటి వాజా గారు ఈ దారుణం? మా త్రిలింగదేశానికి వచ్చే వోట్లు చీల్చడం కోసమే కద మీరీ కుట్ర చేస్తుంది. రిచంజీవి పై నేనే పోటీ చేసి గెలుస్తాను. మీరు తప్పుకోండి,” ఆవేశంగా అంది.

“ఆ గెలుస్తావు! మేము ఇక్కడ గాజులు తొడుక్కుని ఉన్నామనుకుంటున్నావా? మేమూ నిల్చునేదీ గెలవడానికే!” ఘాటుగా సమాధానమిచ్చాడు  వాజశేఖర్.

కూజా ఏదో అనేంతలో ఇంకో కొత్త కారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చేసింది, “అమ్మా, తల్లీ, ధర్మం,” అంటూ. అది ఒక బిచ్చగాడు.

“అడుక్కోవడానికి సమయం సందర్భం ఉండాలి. యాకంగా ఇక్కడికి కూడా వచ్చేస్తున్నారు. ఛీ ఛీ,” విసుక్కుంది పేదల పాలిట పెన్నిధి అని చెప్పుకునే కూజా.

“ఏవమ్మో, మాటలు తిన్నగా రానీ! అడుక్కోవడానికి ఎవరు వచ్చారు? ఏదో అలవాటు ప్రకారం వచ్చేసిన కూత అది,” అంటూ విలేఖరుల వైపు తిరిగి, “ఇదిగో ప్రెస్సోళ్ళూ! రిచంజీవి పై పోటీ చెయ్యడానికి నేను కూడా సిద్ధం!” అన్నాడు అతను.

“మీరే పార్టీ తరపునుంచి పోటీ చేస్తారు?” అడిగారు విలేఖరులు.

“ఏ పార్టీ నాకు సీటు ఇస్తుందో, ఆ పార్టీ తరపున.”

“అంటే…”

“అంటే అదే! రిచంజీవి పార్టీ పెడితే, నిలబడితే, నాకు ఏదైనా పార్టీ సీట్ ఇస్తే, ఆ పార్టీ తరపున రిచంజీవి పై పోటీ చేస్తా! మా బిచ్చగాళ్ళూ, నేను రోజూ అడుక్కునే పేటలోని వాళ్ళూ, నాకు సపోర్ట్ ఇస్తారన్న నమ్మకం నాకుంది,” వివరించాడు ఆ బిచ్చగాడు.

“ఎందుకు మా వోట్లు చీలుస్తావు? నాకు మద్దతు ప్రకటించు. నీకు ఏ మునిసిపల్  చైర్మన్‌గిరో ట్రై చేద్దాం,” బుజ్జగిస్తున్నట్టు అన్నాడు వాజశేఖర్.

“వాజా కంటే ఈ కూజాకే గ్లామర్ ఎక్కువ. నాకే మద్దతు ప్రకటించు. నీకు ఏదో ఒక పదవి ఇస్తాంలే,” బేరాలు మొదలు పెట్టింది కూజా.

ఈ మంతనాలు ఇలా సాగుతుండగా, ఇంకెవరో వచ్చి తాము రిచంజీవి పై పోటీకి సిద్ధం అని ప్రకటించేంతలో అక్కడినుండి జారుకోవడం మంచిది అని వేగంగా నిష్క్రమించారు విలేఖరులంతా.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

15 Responses to రిచంజీవి పై నేను పోటీకి సిద్ధం!

 1. anamika says:

  adirindi le.

 2. Brij says:

  Koojaa naa :))

 3. Srini Chimata says:

  bAgundi… Murali gAru.

  Your satires are really enjoyable. Keep writing them on a regular basis.

 4. ఇంతకీ మీరు కూడా పోటికి సిద్దమా? 😀

 5. రవి says:

  🙂 లాభ కృష్ణ, హారీ కృష్ణ ల గురించి కూడా రాయండి.

 6. పేర్లు బాగున్నాయండీ! ముఖ్యంగా వాజ సరిగ్గా సరిపోయింది కూడాను!

 7. ravindra says:

  koojaa, vaaja sekhar, richanjeevi… funny… especially koojaa

 8. Murali says:

  ప్రతాప్!

  తెలుగు బ్లాగర్లంతా నాకు వోటు వేస్తాం అంటే నేను రెడీ!

  ఇలాంటి స్ట్రాంగ్ బేస్ లేనిదే నేను బరిలోకి దిగను. 😉

 9. dr.subba says:

  excellent

 10. R.R.Iswara says:

  Chilakamarti vaaru gurtukostunnaaru sumandee!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s