కౌటిల్యుడు ఎందుకు అవసరం?

నా పూర్వపు టపా “పుణ్యభూమి నా దేశం”లో ఆఖరున నేను మనకు ప్రస్తుతం కౌటిల్యుడి లాంటి వాడు కావాలని చెప్పడం జరిగింది. అది చాలామందికి నచ్చలేదు. “ఆ భాగం తప్ప మిగతాది బాగుంది,” లాంటి వ్యాఖ్యలు వచ్చాయి. కాబట్టి దీనికి ఒక వివరణ అవసరమనిపించింది.

ఎక్కువగా కౌటిల్యుడు అనే పేరు వినగానే అందరికి కుటిల రాజనీతి అన్న పదాలు స్ఫురిస్తాయి. చాల మందికి ఆయన పేరు వినగానే western philosophersలో Machiavelli గుర్తుకు వస్తాడు. తద్వారా కౌటిల్యుడు మనకు ఆదర్శం అంటే ఇబ్బంది పడతారు.

ఐతే కౌటిల్యుడు (ఈయన చాణక్యుడిగా అందరికి పరిచితం) ఇవేవీ కాడు. ఆయన ముఖ్యంగా ఒక మహోన్నత జాతీయవాది (nationalist).

దాదాపూ రెండువేల నాలుగు వందల ఏళ్ళకిందే, కౌటిల్యుడు ప్రజలలో జాతీయ భావం ఎంత అవసరమో గుర్తించాడు.

కౌటిల్యుడు ముఖ్యంగా ఒక శిక్షకుడు. ఒక గురువు. కాని ఎప్పుడు భారతావని ఆపదలో ఉన్నా ఆయన తన గురుకులాన్ని వదిలి వచ్చి భారతాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఛేదించాడు. అది దుష్ట నందుల వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడినప్పుడు కానీ, లేదా అలెగ్జాండర్ మన్నల్ని ముట్టడించినప్పుడు కానీ.

కౌటిల్యుడికి ఏనాడూ పదవి మీద అధికారం మీద వ్యామోహం లేదు. తన కర్తవ్యం ముగియగానే ఆయన మళ్ళీ తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.

ఈ రోజు మనకు కావల్సింది అలాంటి కౌటిల్యుడే. అధికారం కోసం కాకుండా, దేశ క్షేమం కోసం పోరాడేవాడు. గమ్యం హర్షణీయం అయినప్పుడు దారిలో వచ్చే ఆటంకాలను సామ దాన భేద దండోపాయలతో నిర్మూలించే వాడు.

భారత దేశం మళ్ళీ చాలా రోజుల తరువాత ఒక కూడలికి (crossroads) చేరుకుంది. ఈ కూడలి దాటి సుగమమైన మార్గాన పయనించేందుకు, మనందరికి కౌటిల్యుడి శక్తి యుక్తులు కావాలి.

కౌటిల్యుడి సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలనుకునే వారు, ఈ టీవీ సీరియల్ చూడవచ్చు. మొత్తం 8 DVDలుగా ఉన్న ఈ ధారావాహికం మీకు ఇంటెర్నెట్‌లో ఎన్నో చోట్ల లభ్యమైనప్పటికీ, నేను మాత్రం ఈ కింది లింకు రికమెండ్ చేస్తాను.

http://www.amazon.com/Indo-American-Video-Corporation-Chanakya/dp/B000EJ1NVM

వేర్పాటు వాదమే లక్ష్యంగా పెట్టుకున్న మన వామ పక్షాలు లేవనెత్తేటువంటి తప్పుడు ప్రశ్నలకు (“కాశ్మీర్ ఇస్తే పాకిస్తాన్‌తో గొడవ తీరిపోతుంది కద. మనందరం ఒకటే. ఎవరి దగ్గర ఉంటే ఏమిటి?”, “వచ్చిన బంగ్లాదేశీ కాందిశీకులు ఎలాగూ వచ్చారు. పాపం, వాళ్ళకు శాశ్వత పౌరసత్వం ఇస్తే సరిపోతుంది కద?”, “అసలు భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదు. ఇదంతా బ్రిటీషువాళ్ళ సృష్టి కాదా?”) సమాధానాలు తెలుసుకోవాలంటే కౌటిల్యుడిని అధ్యయనం చేయడం చాలా అవసరం.

Advertisements
This entry was posted in చరిత్ర అడక్కు. Bookmark the permalink.

6 Responses to కౌటిల్యుడు ఎందుకు అవసరం?

 1. sravista says:

  muraligaru,
  koutilyudu a desanikaina chala avasaram.mee abhiprayam tho ekibhavistunnanu.chanakyudi gurinchi konta telusu.meeru suchinchina link dwara mari konta telusukovadaniki prayatnistanu.
  thanks for that.abhinandanalatho………

 2. “గమ్యం హర్షణీయం అయినప్పుడు దార్లో ఎదురయ్యే ఆటంకాలను సామ దాన భేద దండోపాయాలతో నిర్మూలించేవాడు”….ఇలాంటి వాడు ఎప్పటికైనా దొరుకుతాడని ఆశ లేదు.

  చివరి పేరాలో మీరు ప్రస్తావించిన ప్రశ్నలు ‘తప్పుడు ‘ అన్నది పరమ సత్యం!

 3. రవి says:

  మురళీ,

  కౌటిల్యుడు ఆంటే, ఆర్య చాణక్యుడు అని తెలుసు. అయితే, గణతంత్ర రాజ్యాలు(Democracy)వేళ్ళొనుకుని ఉన్న మన భారతంలో వాటిని నిర్మూలించి, ఓ మహా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పూనుకున్నాడు. ఆ తర్వాత గుప్త రాజులు అదే బాటను అనుసరించి, మహా సామ్రాజ్య స్థాపన కు పూనుకున్నారు అని కొంత మంది చారిత్రకుల (ఉధా : రాహుల్ సాంకృత్యాయన్) అభిప్రాయం. దీనివల్ల కలిగిన లాభాలు ఉండవచ్చు, అయితే, జరిగిన నష్టాలు మాత్రం చరిత్ర పుటల్లో మరుగున పడ్డాయని రాహుల్ జీ ఉవాచ.

 4. Murali says:

  రవి,

  రాహుల్ సాంకృత్యాయన్ చెయ్యి తిరిగిన కమ్యూనిస్టు. ఆయన బౌద్ధం మీద చాలా పరిశోధన చేసి బుద్ధుడు బోధించింది కమ్యూనిజమే అని తేల్చి చెప్పిన మేధావి. ఆయనకు చాణక్యుడి మాటలు ఎందుకు రుచిస్తాయి లెండి.

  ఇక గణతంత్రాలు అంటారా? అలక్ష్యేంద్రుడు (Alexander) భారత దేశంపై దండెత్తి వచ్చినప్పుడు ఏ ఒక్క గణతంత్రం ఆ దాడిని తిప్పి కొట్టే పరిస్థితిలో లేదు. అందరినీ ఒక నాయకత్వం కింద యవనులకు ఎదురుగా నడిపించడం తప్ప చాణక్యుడికి దారీ లేదు…

  -మురళి

 5. రవి says:

  మురళీ,

  “రాహుల్ సాంకృత్యాయన్ చెయ్యి తిరిగిన …..”

  :-):-)…

  “ఒక్క గణతంత్రం ఆ దాడిని తిప్పి కొట్టే పరిస్థితిలో లేదు” …. నిజమా?? నేను నిజమని అనుకోవట్లేదు (నేను చదివిన, ఊహించిన ఆ కాలపు పరిస్థితులను బట్టి), అయితే, అంత authoritative గా చెప్పేంత సమాచారం నా వద్ద లేదు.

  “అందరినీ ఒక నాయకత్వం కింద యవనులకు ఎదురుగా నడిపించడం తప్ప చాణక్యుడికి దారీ లేదు”

  ఇప్పుడు చరిత్ర ముగిసిన తర్వాత ఇలాంటి conclusions కు రావడం వీజీయే.

 6. Vasu says:

  🙂 🙂 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s