పీకిస్తాన్ గెలుస్తుందా?

ఇది జంబూ ద్వీపం పక్కన ఉన్న దేశం పీకిస్తాన్‌కి సంబంధించిన ముచ్చట.

పీకిస్తాన్ ఒకప్పుడు జంబూ ద్వీపంలో ఒక భాగమే. ఐతే కొందరు శాంతికాముకులైన మైనారిటీలు, దుష్ట మెజారిటీతో పడలేక పీకిస్తాన్ అనే కొత్త దేశం సృష్టించారు. మైనారిటీల నాయకుడు చిన్నా, “మీకొక దేశాన్ని జంబూ ద్వీపం నుంచి పీకి ఇస్తాను” అని వాగ్ధానం చేశాడు కాబట్టి అదే పేరు ఖరారు చేశారు.

ఐతే పీకిస్తాన్ అంత సులభంగా ఏర్పడలేదు. పీకిస్తాన్ ప్రాంతంలో ఉన్న మెజారిటీలని బయటకు తరిమెయ్యడానికి మైనారిటీలకు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కాని ఆశ్చర్యమేమిటంటే జంబూ ద్వీపంలో మాత్రం మైనారిటీలు పీకిస్తాన్‌కి వెళ్ళక్కర్లేదు అని నిర్ణయించారు. ఇది మత ఛాందసులైన మెజారిటీల కుటిల నీతికి ఒక ఉదాహరణ.

బోలెడు రక్త పాతం తరువాత పీకిస్తాన్ ఏర్పడింది.(రక్తపాతం ఎందుకంటే పీకిస్తానులోని కొందరు మెజారిటీలు పీకిస్తాన్ నాయకుడు చిన్నా మాటలు నమ్మి తాము అక్కడే ఉండచ్చేమో అని కదలకుండా మొరాయించారు. అలాంటి మూర్ఖులని మైనారిటీలకు చంపక తప్పలేదు.) అప్పటినుంచే పీకిస్తాన్‌కి జంబూ ద్వీపానికి మధ్య ఆగర్భ శత్రుత్వం మొదలయ్యింది. ఇందులో తప్పు పూర్తిగా మెజారిటీలదే అని మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది.

పీకిస్తాన్ దృష్టిలో మెజారిటీలు వారికి చేసిన ద్రోహాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది షాక్మీర్ అనే రాష్ట్రాన్ని జంబూ ద్వీపం ఉంచేసుకోవడం. Instrument of accession ప్రకారం షాక్మీర్ మహారాజు జంబూ ద్వీపంతో కలిసిపోవడానికి నిర్ణయించుకున్నాడు అనుకోండి. ఆ రకంగా అప్పటి చట్టాల ప్రకారం షాక్మీర్ జంబూ ద్వీపానికి చెందినట్టే. కాని అది మైనారిటీలకు వ్యతిరేకంగా మెజారిటీలూ శ్వేతజాతీయులూ కలిసి చేసిన మోసం అని పీకిస్తాన్‌లో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు.

అందువల్ల పీకిస్తాన్‌ జంబూ ద్వీపంతో మూడు ప్రత్యక్ష్య యుద్ధాలు చేసింది. మూడో యుద్ధంలో ఇంకో ఘోరం జరిగిపోయింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు, షాక్మీర్ రాక పోగా పీకిస్తాన్లో ఒక భాగమైన కంగాల్‌దేశ్, జంబూ ద్వీపం సహాయంతో స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. (గిట్టని వాళ్ళు దానికి కారణం పీకిస్తాన్ పాలకులు కంగాల్‌దేశ్ ప్రజలని రాచి రంపాన పెట్టడం అన్నప్పటికీ, స్నేహంగా ఉన్న పీకిస్తాన్‌నీ, కంగాల్‌దేశ్‌నీ జంబూ ద్వీపంలోని మెజారిటీలే కుట్ర పన్ని విడదీశారని మీకు వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా.)

దీంతో ఒళ్ళు మండి, పీకిస్తాన్ జంబూ ద్వీపం మీద ధర్మ యుద్ధం ప్రారంభించింది. అది ఇంకా నడుస్తూనే ఉంది. మామూలు మనుషులు ఐతే ఎన్నో ఏళ్ళుగా సాగుతున్న ఈ గొడవల వల్ల నష్టపోయిన సమయానికీ డబ్బుకీ క్రుంగిపోయి ఉండేవారు. కానీ పీకిస్తాన్ అలాంటి దేశం కాదు. తను నాశనమైనా సరే జంబూ ద్వీపం బాగు పడకూడదు అనే ఉన్నతమైన ఆశయం దానిది.

ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. మరి ఇంతకు ముందు చేసినవి ధర్మయుద్ధాలు కావా అని? అవి ధర్మ యుద్ధాలే కాని ప్రత్యక్ష ధర్మ యుద్ధాలు. వాటిలో చావు తప్పి కన్ను లొట్టబోయింది కనుక పీకిస్తాన్ ఇక ప్రచ్ఛన్న యుద్ధం మొదలు పెట్టాలని నిశ్చయించింది.

ఇందులో భాగంగా కొందరికి మిలటరీ ట్రైనింగ్ ఇచ్చి జంబూ ద్వీపంలో ప్రవేశ పెట్టడం మొదలు పెట్టింది. ఈ ఉత్తములు జంబూ ద్వీపంలో బాంబులు పేల్చి, వేర్పాటు వాదులని ఎగదోసి, కొన్ని ప్రాంతాల్లొ మెజారిటీలని తరిమేసి, లోపలనుంచి నరుక్కు రావడం మొదలు పెట్టారు.

ఈ వ్యూహం మంచి ఫలితాలని ఇవ్వడం మొదలు పెట్టింది. జంబూ ద్వీపం లాంటి దేశాన్ని జయించాలంటే అనేక వేల చిన్న చిన్న గాయాలు చేసి రక్తస్రావం కలిగించడం వల్లనే వీలవుతుందని పీకిస్తాన్‌కి బాగా అర్థమయ్యింది.

ఇక పీకిస్తాన్‌కి తగినట్టు జంబూ ద్వీపంలోనే దానికి ఎంతోమంది స్నేహితులు దొరికారు. వీటిలో ఎర్ర పార్టీ, గాంక్రెస్ చెప్పుకోదగ్గవి. (ముఖ్యంగా గాంక్రెస్ నాయకుడు హెన్రూ షాక్మీర్ సమస్యని తగుదునమ్మా అని ఐక్య రాజ్య సమితికి పంపించి పీకిస్తాన్‌కి తీరని మేలు చేశాడు. ఆ కథ ఇంకోసారి చెప్పుకుందాం.)

గత కొన్ని ఏళ్ళుగా ప్రజలను భయభ్రాంతులని చేసే ఆకస్మిక విస్ఫోటాలూ, షాక్మీర్‌లోని మెజారిటీల ఊచకోత, ఇంకా ఇలాంటివే మరెన్నో చర్యలతో జంబూ ద్వీపం అట్టుడికిపోతూంది. ఆశ్చర్యంగా జంబూ ద్వీపం నుండి సహాయం పొందిన కంగాల్‌దేశ్ కూడా అటు వైపునుంచి జంబూ ద్వీపం పై తన వంతు ధర్మ యుద్ధం చేయడం మొదలెట్టింది. సహాయం పొందిన వారిపైనే కంగాల్‌దేశ్ మైనారిటీలు తిరగబడ్డారంటే, అసలు జంబూ ద్వీపపు మెజారిటీలు ఎంత నీచులయ్యుంటారో మీరే ఊహించండి.

పీకిస్తాన్ తన ధర్మయుద్ధంలో సఫలం అవుతుందా?

Advertisements
This entry was posted in చరిత్ర అడక్కు. Bookmark the permalink.

11 Responses to పీకిస్తాన్ గెలుస్తుందా?

 1. chaitanya says:

  మురళి గారు అదిరింది మీ టపా. హెన్రు గురించి టప కోసం ఎదురుచూస్తుంటాను

 2. మిసీ అనే సంస్థ పైన ఉన్న నిషేదాన్ని కూడా ఎత్తేసిన చెత్త సమాజం మనది. India Todayలో వ్రాసినట్టు మనది నిజంగా Impotent Indiaనే.

 3. రవి says:

  జంబూ ద్వీపం, పీకిస్తాను మధ్య కలహాలు పచ్చగా వర్ధిల్లాలన్న విశాల దృక్పథంలో లార్జి బుష్ వంటి కొన్ని విశాల హృదయాలు పని చేస్తున్నాయి అధ్యక్షా. అయినా ఆ హెన్రూ గారు హెంత గొప్ప వారు, వారి గురించి ఇలా చెప్పడం భావ్యమా? 🙂

 4. nomi says:

  very good post. all are true facts…

 5. pedaraydu says:

  నిజంగా భారత దేశం చాలా దీనావస్తలో వుంది. ఉత్తరాన ఉన్న పొరుగుదేశాలన్ని అదే పద్దతిలో వ్యవహరిస్తున్నాయి. భారత దేశం సహాయమందించిన ప్రతిసారీ వంచిస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తానుకు కూడా సహాయమందిస్తున్నా వారు బలపడిన తరువాత మనకు పక్కలో బల్లెంలా తయరయే అవకాశాలే ఎక్కువ. ఈ ముష్కరుల తాకిడికి మన దేశంలోని వారుకూడా సహకారమందించటం శోచనీయం.

 6. chilamakuru vijayamohan says:

  India impotent కాదండి ఇండియాను ఎక్కువకాలం పరిపాలించిన వాళ్ళు impotent.

 7. హెన్రూ గురించి త్వరలోనే రాయాలని కోరుతున్నా!

 8. Murali says:

  చైతన్య గారు, సుజాత గారూ,

  తప్పకుండా! త్వరలోనే పావురాలు ఎగరేస్తూ, ట్రైబల్స్‌తో డాన్స్ చేస్తూ, హెన్రూ తేటగీతి మీదకు రాబోతున్నాడహో!

  -మురళి

 9. నరేంద్ర భాస్కర్ S.P says:

  నరేంద్ర భాస్కర్ S.P.
  నమస్తే!
  చిన్నప్పుడు పీకిస్తాన్ నీ పిలక పీకేస్తాన్ అనే ఒక స్లోగన్ ఉపయోగించే వాళ్ళం, దాని వెనుకున్న మర్మం ఇదా, నిన్న సుప్రిం కోర్టు ఈ దేశాన్ని దేవుడు కోదా బాగు పరచలేడాని తీర్పు లో పేర్కొన్నాక ఆ మాట నిజం చేయడానికి ఇందిరా ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీలకు రిజర్వేషన్లు ప్రకటించి ఆ మాటను నిజం చేయడానికి శాయ శక్తులా ప్రయత్నిస్తోంది, హెన్రూ గురించి త్వరలో రాయాలని అర్జెంటుగా నేనూ డిమాండు చేస్తున్నాను- ఇండియాను ఎక్కువకాలం పరిపాలించిన వాళ్ళు ఇంపొటెంటు అని నేనూ సమర్దిస్తాను.బాగా రాసారు భయ్యా
  నెనర్లు

 10. Sreelatha says:

  Very nice.

 11. Mahesh Reddy G says:

  chala bagaa undhi vyasam, nijamgaane vaallu napusakulu, inkaa vaalu gadde mida kurchovadam sarikaadu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s