చాచా హెన్రూ – షాక్మీర్ ఆట

అక్టోబర్ 1947. జంబూ ద్వీపపు రాజ దర్బార్. అదేంటి, 1947లో రాజులు లేరు కద, లవ్లీ భాయ్ పటేల్ 600కు పైగా రాజ సంస్థానాలను జంబూ ద్వీపంలో విలీనం చేశాడు కదా, ఇంకా రాజులేమిటీ అని ఆశ్చర్యపోతున్నారా? ఉన్నాడండి ఉన్నాడు. మహాత్ముడి అభిమానాన్ని సంపాదించుకున్న వాడు. ఆయన మనకు ఇచ్చి వెళ్ళిన అమూల్య బహుమతి. చాచా హెన్రూ!

చాచా హెన్రూ అచ్చం జంబూ ద్వీపానికి ఒక చక్రవర్తిలానే ప్రవర్తించేవాడు. గాంక్రెస్‌లో చాల మందికి ఆయన మీద పీకల దాకా కోపం ఉన్నా మహాత్ముడి మొహం చూసి ఎవరూ ఏం మాట్లాడే వారు కారు. హెన్రూ గాంక్రెస్‌లో ఎంత “పాపులర్” అంటే గాంక్రెస్ పార్టీ ఎన్నికలలో ప్రెసిడెంటుగా పోటి చేసిన రెండు సార్లూ చిత్తుగా ఓడిపొయాడు. (ఐతే మహాత్ముడు అలగడం వల్ల, మిగతా పోటీదారులు ఆయన్ని మన్నించి పోటీనుంచి వైదొలగడం వల్ల, గాంక్రెస్ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు.)

మరి అంత “పాపులారిటీ” ఉండేదా? కాని హాశ్చర్యం! ఇప్పుడు ఉన్న గాంక్రెస్ పార్టీలో అందరూ హెన్రూ భక్తులే. ఇప్పటి గాంక్రెస్ వారు మహాత్ముడిని కూడా ఆయన పుట్టిన రోజునే తలుచుకుంటారు. మరి హెన్రూని? హెన్రూ పేరు మర్చిపోయే అవకాశం లేకుండా మరుగు దొడ్లనుండి విమానాశ్రయాల వరకూ అన్నిటికీ ఆయన పేరు తగిలించేశాయి, వరుసగా జంబూ ద్వీపాన్ని పరిపాలించిన గాంక్రెస్ ప్రభుత్వాలు.

దీనికి రెండు ముఖ్యమైన కారణాలు. ఒకటి 1939 గాంక్రెస్ ఎన్నికలలో ఎవరి చేతిలో ఐతే హెన్రూ చిత్తుగా ఓడిపోయాడో ఆయన (సుభాష్ సూర్య బోస్) అర్ధాంతరంగా అనుమానాస్పద పరిస్థితుల్లో 1945లో మరణించడం. “లోహ పురుషుడు” అని ప్రఖ్యాతి గాంచిన లవ్లీ భాయ్ పటేల్ అనారోగ్యంతో, జంబూ ద్వీపానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే, అంటే 1950లో, కన్ను మూయడం. తరువాత గాంక్రెస్‌లో హెన్రూకి అడ్డు అదుపూ లేకుండా పోయాయి. తన తల తిక్క సోషలిజం ఇడియాలజీతో జంబు ద్వీపాన్ని తను పరమపదించే వరకూ దుంప నాశనం చేశాడు మన చాచా హెన్రూ.

సరే ఆయన చేసిన “గొప్ప” పనులు రాయాలంటే నా అకౌంట్‌లోని డిస్క్ స్పేస్ సరిపోదు కానీ, మనం మళ్ళీ 1947లో రాజ దర్బార్‌కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ టపా చాచా హెన్రూ షాక్మీర్‌తో ఎలా ఫుట్‌బాల్ ఆడుకున్నాడు అన్న విషయం గురించి కద!

అక్టోబర్ 1947. హెన్రూ తన సింహాసనం మీద కూర్చుని పద-మజా నాయుడు తనకు రాసిన ప్రేమలేఖలు చదువుకుంటున్నాడు, తనలో తాను ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ.

“హెన్రూజీ, షాక్మీర్ రాజు రహి సింగ్ మీకొక లేఖ పంపించాడు,” అంటూ ఆయనకు అది అందజేశాడు హెన్రూ సెక్రెటరీ. “ఆగండి. పద-మజా రాసిన ఈ తొంభయ్ తొమ్మిదో లేఖ చదవగానే దాని చదువుతా,” అన్నాడు హెన్రూ. లవ్లీ భాయ్ పటేల్ నిస్సహాయంగా పళ్ళు కొరికాడు.

కాసేపయ్యక రహి సింగ్ లెటర్ చదివాడు హెన్రూ. “ఈ రహి సింగ్ జంబూ ద్వీపానికే షాక్మీర్ ఇచ్చేస్తాడట,” అన్నాడు. అక్కడున్న అందరూ తప్పట్లు కొట్టారు. “ఇంక ఆలస్యమేముంది? వెంటనే మన సైన్యాలని త్రీ నగర్‌కి పంపిద్దాం. ఆల్‌రెడీ పీకిస్తాన్ సైనికులు సరిహద్దులు దాటి అక్కడికి చేరుకున్నారట. జై, జంబూ ద్వీప్!” ఆవేశంగా గర్జించాడు లవ్లీ భాయ్ పటేల్.

“ఎహె, మీరు ఊరుకోండి, ఊ అంటే సైన్యం అంటారు. ఇలా తొందరపడే ఆ 600 రాజ సంస్థానాలు వెంటనే జంబూ ద్వీపంలో విలీనం చేశారు. షాక్మీర్‌ని నాకు వదిలెయ్యండి. మన భావి తరాలు ఎప్పుడూ మర్చి పోలేని విధంగా నేను సర్దుబాటు చేస్తాగా షాక్మీర్ సమస్యను,” చిలిపిగా అన్నాడు హెన్రూ.

“ఇంకెలా చేస్తారు?” అయోమయంగా అడిగాడు లవ్లీ భాయ్ పటేల్.

“మరదే అంతర్జాతీయ దౌత్యం అంటే. International Diplomacy. మీకు అర్థం కాదులెండి. ఈ రహి సింగ్ గాడెవడండీ మనకు షాక్మీర్ ఇవ్వడానికి? వాడి మొహం చూస్తేనే నాకు చిరాకు! ఇప్పుడే రాస్తా వాడికి రిప్లై లెటర్. మన షాక్ అబ్దుల్లా లేడూ? ఆయనకి షాక్మీర్ కట్టబెడితే అప్పుడు మన సైన్యాలని పంపిస్తాను అని తెగేసి చెప్తాను,” గర్వంగా అన్నాడు హెన్రూ.

“ఎవరు షాక్ అబ్దుల్లానా? చిన్నాతో కుమ్మక్కై షాక్మీర్‌ని పీకిస్తాన్లో కలిపేయడానికి ప్రయత్నించాడు? ఆ నీచుడా?” దిగ్భ్రాంతి చెందాడు లవ్లీ భాయ్ పటేల్.

“ఏమండోయి పటేల్ గారూ! మాటలు మర్యాదగా రానివ్వండి. షాక్ అబ్దుల్లా నాకు ప్రియ మిత్రుడు. షాక్మీర్‌ని పాలించగల సమర్థుడు ఆయన ఒక్కడే. ముందు ఈ లెటర్ రహి సింగ్‌కి అర్జెంట్‌గా పంపండి,” గద్దించాడు హెన్రూ.

“కాని మీ లెటర్ ఆయనకి వెళ్ళి, ఆయన లెటర్ మీకు వచ్చేసరికి పుణ్యకాలం మించిపోతుందండీ బాబూ! ఎంతో మంది అమాయకులు అన్యాయంగా హతమైపోతారు. మనము మన సైన్యాన్ని వెంటనే పంపించాలి,” రిక్వెస్ట్ చేశాడు లవ్లీ భాయ్ పటేల్.

“నేనేం వినదల్చుకోలేదు. ఇక మీరంతా బయలుదేరండి. అసలే ఎడ్డి-వీనా వచ్చే టైం అయ్యింది,” సిగ్గు పడ్డాడు హెన్రూ. (ఎడ్డి-వీనా జంబూ ద్వీపపు ఆఖరి వైస్‌రాయ్ భార్య. హెన్రూకి చాలా కావల్సిన వాళ్ళలో ఒకతి.)

“కానీ…” లవ్లీ భాయ్ ఏదో చెప్పేంతలోనే, తన వేళ్ళు చెవుల్లో కుక్కుకుని, “నా నా నా నా నానా, నా నా నా నా నానా,” అంటూ అరవడం మొదలు పెట్టాడు.

చేసేది లేక అందరూ అక్కడినుంచి బయలు దేరారు.

***

లవ్లీ భాయ్ పటేల్ చెప్పినట్టే రహి సింగ్ తన అభిజాత్యాన్ని దిగమింగుకుని షాక్మీర్‌ని షాక్ అబ్దుల్లాకి ఇవ్వడానికి ఒప్పుకోవడానికీ, జంబూ ద్వీపం త్రీ నగర్‌కి సైన్యం పంపడానికి రెండు రోజులయ్యింది. ఆ రెండు రోజుల్లో పీకిస్తాన్ సైనికులు మర్డర్లూ, మానభంగాలూ, దొమ్మీలూ, దోపిడీలు కావించి ఎంతోమంది షాక్మీర్ ప్రజలని పొట్టన పెట్టుకున్నారు.

చివరకు ఎలాగైతేనేం జంబూ ద్వీపపు సైన్యం పీకిస్తాన్ సైనికులని తరిమి కొట్టింది. షాక్మీర్‌లో మూడింటిలో రెండు భాగాలు జంబూ ద్వీపం వశమయ్యాయి. పీకిస్తాన్ చావు తప్పి కన్ను లొట్టబోతూ మిగిలిన షాక్మీర్‌ని కూడా ఖాళీ చేసే సమయంలో హెన్రూ ఇంకొక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.

అదేంటంటే…

***

“హయ్ షాక్మీర్ మనదే, హొయ్ షాక్మీర్ మనదే,” అంటూ లవ్లీ భాయ్ పటేల్, ఆయన అనుచరులు అందరూ ఆనందంగా కోయ డాన్స్ చేస్తున్నారు. ఇది చూసి హెన్రూకి వొళ్ళు మండిపోయింది. “ఆపండెహె మీ కాకి గోల,” విసుక్కున్నాడు వాళ్ళని.

“ఏం, ఎందుకాపాలమ్మా? కొంత జన నష్టం వాటిల్లినా, షాక్మీర్ మనకే వచ్చేసింది కద?” దేశ భక్తి ఉప్పొంగుతూండగా అన్నాడు లవ్లీ భాయ్ పటేల్.

“ఆ! వచ్చేస్తుంది! ఇందుకే మీకు అంతార్జాతీయ దౌత్యం తెలీదు అనేది. International diplomacy. వెంటనే యుద్ధం ఆపేసి ఐక్య రాజ్య సమితికి కబురు పంపించండి. వాళ్ళ చేతుల్లొ ఈ సమస్య పెడదాం. ఆ తరువాత ఎన్నికలు జరుపుతాం. షాక్మీర్ ప్రజలు ఎవరు కావాలంటే ఆ దేశంతో షాక్మీర్ విలీనమవుతుంది. అది సరైన పద్ధతి,” ఇంటెలిజెంట్‌గా అన్నాడు హెన్రూ.

“అన్నామంటే అన్నామంటారు కానీ మీకేమన్న మెంటలా, హెన్రూజీ? తీరిపోయిన సమస్యని వాళ్ళు వచ్చి పరిష్కరించేదేంటి? మళ్ళీ ఈ ఎన్నికలేంటి? Instrument of accession ప్రకారం షాక్మీర్ మనదే కద?” కోపంగా అరిచాడు లవ్లీ భాయ్ పటేల్.

“ఆ, నాకిలాగే కావాలి. అప్పుడు కానీ నా రాజకీయ దురంధరతను చూసి నాకు బోనెల్ ప్రైజు ఇవ్వరు. ఊ ఊ ఊ, నాకు బోనెల్ ప్రైజ్ కావాలి. లేకపోతే మహాత్ముడిని మీరు ఒప్పుకునేదాకా ఉపవాసం చేయమంటా,” గుణిశాడు హెన్రూ.

అందరు గతుక్కుమన్నారు. “ప్లీజ్! ఆ పని మాత్రం చేయకండి. అసలే ఆయనకు మీరంటే గురి ఎక్కువ. చెంగున ఎగిరి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతాడు,” భయంగా అన్నాడు లవ్లీ భాయ్.

“అలా రండి దారికి!” గర్వంగా అన్నాడు హెన్రూ.

***

ఐక్య రాజ్య సమితి “ఏంటీ సంవత్సరం మనకన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయి,” అని ఆనంద పడి షాక్మీర్ సమస్యలో తల దూర్చింది. వెంటనే అది చేసే మొదటి పని చేసింది. అదేంటంటే సీజ్ ఫైర్! ఎక్కడ వారు అక్కడే ఉండిపోవాలి. తద్వారా పీకిస్తాన్ దగ్గర ఒక వంతు షాక్మీర్, జంబూ ద్వీపం దగ్గర రెండు వంతులూ మిగిలి పోయాయి. ఈ రెండు షాక్మీర్ ముక్కల మధ్య ఒక నియంత్రణ రేఖ ( Line of Control) రూపు దిద్దుకుంది.

ఆ తరువాత ఐక్య రాజ్య సమితి ముందు పీకిస్తాన్ తన సైన్యాలని షాక్మీర్ నుంచి వెనక్కు తీసుకోవాలనీ, ఆ తరువాత జంబూ ద్వీపం తన సైన్యాన్ని మిగిలిన షాక్మీర్ నుంచి వెనక్కు రప్పించాలనీ, అప్పుడు షాక్మీర్‌లో ఎన్నికలు (plebiscite) పెట్టాలని తీర్మానం చేసింది.

పీకిస్తాన్ తన సైనికులని ఎప్పుడూ వెనక్కి తీసుకోలేదు. ముందు ఖాళీ చేయాల్సింది వాళ్ళు కాబట్టి జంబూ ద్వీపం కూడా తన సైన్యాన్ని అక్కడే ఉంచేసింది. నియంత్రణ రేఖ అలాగే ఉండి పోయింది. హెన్రూ బోనెల్ ప్రైజ్ రాకుండానే బాల్చీ తన్నేశాడు. ప్రస్తుతం హెన్రూ ముని మనమడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు.

షాక్మీర్ మాత్రం ఇంకా కాలుతూనే ఉంది. జై చాచా హెన్రూ కి!

Advertisements
This entry was posted in చరిత్ర అడక్కు. Bookmark the permalink.

21 Responses to చాచా హెన్రూ – షాక్మీర్ ఆట

 1. :))ఇంకా నయం దాదా హెన్రూ హైద్రాబాదులో కూడా వేలెట్టి వాసన చూడలేదు. ఇప్పటికీ మనం భరించాల్సివచ్చేది ఆ ఇంపుని కూడా.

 2. Sreelatha says:

  Simply superb!

 3. రవి says:

  ఈ ముదనష్టపు హెన్రూ గురించి మనం మన చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం!

  అప్పట్లోనే హెన్రూ కి లవ్లీ భాయ్ మాత్రమే కాక, జావపాయ్ అనే ఆయన కూడా చెప్పేడట, సమస్యను ఆ ఐక్య రాజ్య సమితి కి తీసుకెళ్ళకు అని. ఎంతయినా, హెన్రూ , హెన్రూ యే కదా!

 4. 🙂 ఇలా పేర్లను మార్చి ఒక ఒరవడిని కనిపెట్టడం మీ బ్లాగుకు హైలెట్!

 5. chaitanya says:

  మీ టపా అదిరింది. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.
  పద-మజా నాయుడు ఎవరు ? (ఎడ్డి-వీనా గురించి తెలుసు) కాని ఈవిడ ఎవరు ?
  రాం గోపాల్ వర్మా సినిమా లా ట్విస్ట్ పెట్టారు చివరలో !! ” ప్రస్తుతం హెన్రూ ముని మనమడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు” అని. బహుశా ఆయన గురించి కూడా టపా రాస్తారు అనుకుంటా. మరి హెన్రూ కూతురు, మనుమడు, గురించి కూడా రాయండి. ఆసక్తి తో తుదుపరి హెన్రూ వంశస్తుల టపా కోసం ఎదురుచూస్తూంటాను.

 6. మురళి గారూ,

  మీరు అసలు విషయం రాయడం మర్చిపోయారు. “మా ముత్తాతలు షాక్మీర్లో ఆట్లాడుకున్నారు, ఇప్పుడు నేను షాక్మీర్తో ఆట్లాడతా.” ఇదీ హెన్రూ గారి ఆంతర్యం.

 7. వ్యంగ్యంగా చెప్పినా ఒక historical blunder గురించి చెప్పారు. కాకపోతే, కొన్ని mistakes కాలం గడిస్తేగానీ blunder అని తెలీవు. అలాంటిదే ఇదీనూ!

 8. పెదరాయ్డు says:

  హెన్రూ గారు ఎంతచేసినా(నిజంగానే చాలా చేసారు) ఆయన యొక్క స్వార్థం , కోటరీ నిర్ణయాలవలు మనకు చాలా నష్టాన్నీ కష్టాన్నీ మిగిల్చాయి.

 9. శేఖర్ says:

  బావుంది.

 10. Srividya says:

  Too good… 🙂
  మీ టపా అదిరింది.

 11. (నిజంగానే చాలా చేసారు) ఆయన యొక్క స్వార్థం , కోటరీ నిర్ణయాల

  నిజంగానే చాలా రంగాల్లో చాలా చేసారు కానీ మనకు చాలా నష్టాన్నీ కష్టాన్నీ మిగిల్చింది ఆయన యొక్క స్వార్థం కాదు అహంభావం అనండి, హెన్రూ ఒక కరడుగట్టిన ఆటోక్రాటు (అందరికీ అర్థమయ్యే భాషలో ఒక నియంత).

  ఐక్య రాజ్య సమితి “ఏంటీ సంవత్సరం మనకన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయి,”

  అనుకునే ఉండాలి. చేతకాని దద్దమ్మలా నానాజాతి సమితి సమాధైపోయినాక ఐరాస పుట్టి అప్పటికి రెండేళ్ళైంది. కానీ అప్పటిదాకా అది తీర్చిన తగాదాలూ లేవు; దాని విశ్వసనీయత, సామర్థ్యాల మీద ప్రపంచంలో ఎవరికీ ఎటువంటి భ్రమలూ లేవు హెన్రూకి తప్ప.

 12. jaanaki says:

  దొంగ చచ్చినాడు, వాడి కాష్టం అలా కాల్చుకున్నాడన్నమాట! వాడి కాష్టం, వాడిష్టం! మరి షాక్మీరు వాడబ్బ సొమ్మా ఇన్నాళ్ళూ కాలుతూనే ఉండడానికి?

  పద మజా నాయుడు, ఎడ్డి వీనా ల కథ బలే బాగుంది. ఏం చేస్తాం? రోగిష్టి పెళ్ళాం కదా! అయినా ఎడ్డి వీనా, హెన్రూ ల మధ్య సాన్నిహిత్యం మానసికమే అని ఈ మధ్య మధ్య ఏదో పుస్తకం వచ్చిందంటగా!

  మీరు హెన్రూ ముని మనవడి సామర్థ్యం గురించి, టపా రాయకపోటే ఇప్పుడు మహాత్ముడు లేడు కాబట్టి నేనే ఉపవాసం చేసేస్తా రాసేదాకా!

  వ్యంగ్యం మహా బాగుంది.

 13. కొన్ని నిజాలకి కొంత కల్పనని జోడించి బాగా వ్యంగ బాణాలు వదిలారు.
  గుడ్. బాగా రాశారు.

 14. jhansi says:

  padmaja naidu is nehru`s girl friend…..

  saarojini naidu`s daughter…

 15. హెన్రూ బాగా రొమాంటిక్కు..కళ్ళు మూసుకుని కలలు కంటే సమస్యలన్నీ మాయమైపోతాయనుకునే రకం

 16. chaitanya says:

  నెనర్లు ఝాన్సీ గారు పదమజ నాయుడు గురించి తెలియచేసినందుకు .

 17. Murali says:

  మహేష్ గారూ,

  నేను మీతో ఏకీభవించను. ఇది బ్లండర్ అని తెలియడానికి, కాల గతి, వెనుక చూపూ అక్కర్లేదు.

  It was a rank bad move made against a lot of opposition from within his own party and the Indian army.

  -మురళి

 18. Murali says:

  నాగన్న గారూ,

  Thanks! ఇలా ముందు కూడా చాలా మంది రాశారు కాని నా అంత consistentగా రాయలేదేమో మరి. 🙂

  -మురళి

 19. Murali says:

  సుగాత్రి గారూ,

  నిజమే. నెహ్రూ ఎప్పుడూ కాష్మీర్ తన జాగీరు అనుకునేవాడు. He expressly told Vallabh Bhai Patel to keep out of Kashmir.

  -మురళి

 20. Murali says:

  చైతన్య గారూ,

  నెహ్రూ ముని మనమడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు అని చెప్పడంలో నా ఆంతర్యం, మూడు తరాలు మారినా, ఇంకా కాష్మీర్ సమస్య అలాగే ఉంది, నెహ్రూ గారు చేసిన పని వల్ల, అని.

  ఇక ఆ వంశంలో మిగతా వాళ్ళ గురించి రాయడమా? చూద్దాం. దానికీ సమయం సందర్భం వస్తాయి…

  -మురళి

 21. sirishasri says:

  wah!wah!wav!
  wa…………………….. (iMkaa cry …….lOnE shukhmiiru..)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s