గోడంటే గోడా కాదు

ఆ రోజు ఆదివారం. రాజకీయ నాయకులు కూడా కాస్త తీరికగా ఉండే రోజు.

దుర్జన్ సింగ్ ( ఈయననే ముదురు సింగ్ అని కూడా పిలుస్తారు) మార్నింగ్ వాక్‌కు బయలు దేరాడు. వెనకాల దండుగా సెక్యూరిటీ బయలుదేరింది. గేటు దాటి బయటకు వెళ్తున్న దుర్జన్ సింగ్ ప్రహరీ గోడలో ఏర్పడ్డ చిన్న కంత చూశాడు. వెంటనే సెక్యూరిటీ హెడ్ వైపు తిరిగి, “ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? వెంటనే ఆ కన్నాన్ని పూడ్చేయ్యండి. అసలే ఉగ్రవాదులు ప్రతి చిన్న అవకాశం కోసం చూస్తూ ఉంటారు,” అంటూ కోప్పడ్డాడు.

“సారీ సార్! చిన్న కంతే కదా అని..” నసిగాడు అతను. “చిన్నదా పెద్దదా అన్నది కాదు ఇక్కడ సమస్య! ఇది సెక్యూరిటీ లోపం! ఇది మీ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. రేపు నేను లోపల తోట పనేదో చేసుకుంటూంటే, ఎవరో ఉగ్రవాది ఆ కంతలోంచి ఒక AK-47 దూర్చి నన్ను లేపేస్తే?” మండిపడ్డాడు దుర్జన్ సింగ్.

“ఆ లేపేస్తారు. ఈ దేశానికి అంత అదృష్టం కూడా!” అనుకున్నాడు సెక్యూరిటీ హెడ్. పైకి, “సారీ సర్, ఈ రోజు సాయంత్రానికే రిపేర్ అయిపోతుంది,” హామీ ఇచ్చాడు.

దుర్జన్ సింగ్ తృప్తిగా తలాడించి, సపరివార సమేతంగా (అంటే బాడీ గార్డ్‌లతో సహా) ఇంటి బయటకు నడిచాడు. అలా రోడ్డు మీద వెళ్తూంటే, అదే వీధిలో ఉన్న ఇంకో బంగ్లా దగ్గర విషరాజు పాటిల్ కనిపించాడు. ఆయన తన బంగ్లా బయట ఉన్న ఒక మొక్క చుట్టూ కంచె కడుతున్నాడు.

“అదేంటి విషరాజ్‌జీ, మీరు తోట పని చేస్తున్నారు?” ఆశ్చర్యంగా అడిగాడు దుర్జన్ సింగ్.

“అంటే ఈ రోజు మా తోటమాలి సెలవు తీసుకున్నాడు. అతనొచ్చేదాకా వెయిట్ చేస్తే ఈ మొక్కను ఏ మేకో తినేస్తుంది. ఏ టైంలో చేయాల్సిన పనులు ఆ టైంలో చేసెయ్యాలి దుర్జన్‌జీ,” హితవు చెప్పాడు విషరాజ్ పాటిల్.

“బాగా చెప్పారు. మీ పని అయిపోయినట్టుందిగా, పదండి ఢిల్లీ అమ్మని చూసి వద్దాం,” అన్నాడు దుర్జన్ సింగ్. “ఢిల్లీ అమ్మ దర్శనానికి నేనెప్పుడైనా రెడీనే,” అంటూ దుర్జన్ సింగ్‌ని ఫాలో అయ్యాడు విషరాజ్.

వీళ్ళిద్దరూ వెళ్ళేప్పటికి ఢిల్లీ అమ్మ వాళ్ళబ్బాయి సాహుల్ మీద కోప్పడుతూంది. వీళ్ళు రావడం చూసి, “చూడండి విషరాజ్ గారూ, దుర్జన్ గారూ, ఎన్నో సార్లు చెప్పాను, అల్మారాకి తాళం వేసి వెళ్ళమని. సాహుల్ ఎప్పుడూ వినడు. ఎంత నమ్మకస్తులైన నౌఖర్లైనా, మన జాగ్రత్తలో మనముండాలి, ఏమంటారు?” అడిగింది.

“బాగా చెప్పారు అమ్మా, ఈ తెలివితేటలు చూసే కద ప్రతి గాంక్రెస్ కార్యకర్త మిమ్మల్ని ఆరాధించేది,” ఛాన్స్ వదులుకోకుండా ఒక పొగడ్త ఇరికించేశాడు దుర్జన్ సింగ్.

“మీరొకరు, నాకు పొగడ్తలు ఇష్టం లేదు అన్నా వినిపించుకోరు కద,” ముసి ముసిగా నవ్వుతూ అంది ఢిల్లీ అమ్మ.

“మీకు పొగడ్తలే కాదు, అధికారం అన్నా ఇష్టం లేదు అని మాకందరికీ తెలుసు. కానీ మమ్మల్ని పాలించడం మీ కర్తవ్యం, తప్పదు మరి,” గోముగా అన్నాడు దుర్జన్ సింగ్.

“సర్లెండి, రేపు పార్లమెంట్‌లొ చాలా ముఖ్యమైన సెషన్ ఉంది. మన వాళ్ళందరిని పోగెసుకుని రండి,” ఆర్డర్ పాస్ చేసింది అమ్మ.

“చిత్తం,” అన్నారు భృత్యులు ఇద్దరూ.

***

పార్లమెంట్ సెషన్ మహా జోరుగా నడుస్తూంది. ఎగస్పార్టీ వాళ్ళు భీకరంగా వాదిస్తున్నారు.

“కంగాల్‌దేశ్ నుండి జంబూ ద్వీపానికి వచ్చే కాందిశీకుల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతూంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉండిపోతున్నారు. లోకల్ రాజకీయ నాయకుల సహాయంతో రేషన్ కార్డులు సంపాదించుకుని తద్వారా పౌరసత్వం కూడా తెచ్చుకుంటున్నారు. మన వనరులు అన్యాయంగా వాడుకుంటున్నారు. దీనికి కారణం మనకూ, కంగాల్‌దేశ్‌కు మధ్య ఉన్న సరిహద్దు రేఖ మీద కంచె లేకపోవడమే,” ఆవేశంగా వాదిస్తున్నాడు కె.ఎల్. అవధాని.

“అబ్బబ్బా ఎప్పుడూ ఇదే గొడవా? మీ హాయాంలో కాస్త కట్టారుగా? మేమేమన్నా అడ్డు పడ్డామా? ఎప్పుడూ మీ అజెండానేనా?” అరిచింది ఢిల్లీ అమ్మ.

“అవును, ఐనా జంబూ ద్వీపం ఎప్పుడూ అతిథులని సాదరంగా ఆహ్వానిస్తుంది. అతిథి మర్యాదలకు మనం పెట్టింది పేరు. ఇలా కంచెలు కట్టేస్తే కంగాల్‌దేశస్తులు ఫీల్ కారూ?” బాధ పడ్డాడు విషరాజ్ పాటిల్.

“మరే, ఐనా వాళ్ళు ఒకప్పుడు జంబూ ద్వీప వాసులే కద! వాళ్ళు అక్కడుంటే ఏంటి, ఇక్కడుంటే ఏంటి? ఇదంతా S.R.R. కుట్ర,” వత్తాసు పలికాడు దుర్జన్ సింగ్.

“యూ బ్లడీ, అసలు అఖండ జంబూ ద్వీపాన్ని విచ్ఛిన్నం చేసింది మీ పార్టీనే కదరా! కలిసుంటే ఈ ప్రాబ్లమే ఉండేది కాదు కద!” విరుచుకు పడ్డాడు కె.ఎల్. అవధాని.

రూలింగ్ పార్టీ మెంబర్స్ , ఎగస్పార్టీ మెంబర్స్ పార్లమెంట్‌లోనే ముష్టి యుద్ధం మొదలు పెట్టారు.

***

మరుసటి ఆదివారం, మళ్ళీ వ్యాహ్యాళికి బయలుదేరాడు దుర్జన్ సింగ్. ప్రహరీ గోడ మీదున్న కంత పూడ్చివేయబడి ఉండడం చూసి మెచ్చుకోలుగా తల ఊపాడు.

దారిలో ఆయనకు విషరాజ్ పాటిల్ తన మొక్క చుట్టూ కట్టిన కంచెను తృప్తిగా చూస్తూ కనిపించాడు. “గుడ్. మొక్క సేఫ్ అన్న మాట ఇంక. రండి ఢిల్లీ అమ్మను చూసి వద్దాం,” ఆహ్వానించాడు దుర్జన్ సింగ్.

వాళ్ళిద్దరూ రాగానే, అమ్మ ఆనందంగా ఎదురొచ్చింది. “మొత్తానికి సాహుల్‌కి విషయం అర్థమయినట్టుందండీ. మరిచిపోకుండా అల్మారాలకు తాళాలు వేస్తున్నాడు. కాబోయే ప్రధానికి ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి. ఏమంటారూ?” ప్రశ్నించింది.

“మీరన్నదానికి ఎప్పుడన్నా ఎదురు చెప్పామా, అమ్మా?” ముక్త కంఠంతో అన్నారు దుర్జన్ సింగ్, విషరాజ్ పాటిల్ ఇద్దరూ.

సర్వే జన సుఖినోభవంతు!

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

7 Responses to గోడంటే గోడా కాదు

 1. శేఖర్ says:

  మీ ఉద్దేశం యిక్కడ, ఎవరికివారు వారి సొంత విషయాలలో మాత్రం జాగ్రత్తపడ్డా(చివరికి సాహుల్ తాళం వెయ్యడం, దుర్జన్ యింటి ప్రహరీ కంత పూడ్చడం, విషరాజ్ యింట్లో మొక్కకి చుట్టూ కంచె కట్టడం), అదే పరిస్తితి దేశానికి ఉన్నా(కంగాల్‌దేశస్తుల వలన) అటువైపు కంచె కట్టట్లేదేననే కదా! ఆ ఏముందండీ అక్కడ ౫౦(యాభై)శాతానికి మించి కమీషను ఇవ్వడానికి ఏ గుత్తేదారు ముందుకు రావట్లేదట. ఎవరైనా(మీరైనా సరే), ౭౦-౮౦(డెభ్భై – ఎనభై) శాతం కమీషను ఇచ్చేట్లైతే ఇచ్చేస్తార్ట. మరి మీరు సిద్దమేనా?

 2. రవి says:

  కెవ్వు కేక! అదిరిపోయింది టపా..ఆఫీసులో వీరకుమ్ముడు మధ్య మంచి రిలాక్సింగ్ మీ టపా..

 3. chaitanya says:

  బాగ చెప్పారు.

 4. భలేగా రాశారు. పేపర్లలో ఎంత చదివినా అర్థం కాని విషయాలను సింపుల్ గా, వ్యంగ్యంగా వివరిస్తున్నారు. అన్నట్టు మీరు పెట్టిన పేర్లలో కె.ఎల్. అవధాని సూపర్!

 5. Murali says:

  సుజాత గారు,

  కె.ఎల్. అవధాని నాకూ నచ్చింది కాని నా పర్సనల్ ఫేవరెట్ మాత్రం “బ్యాండు” రంగడు.

  చాచా హెన్రూ గురించి రాయమని మీరు నా మీద చాలనే ఒత్తిడి తెచ్చారు. కాని మీ కామెంట్ అక్కడ కనపడలేదు. చదివారా అసలు?

  మీరిచ్చిన లింక్ http://www.manishi-mansulomaata.blogspot.com/ పని చేయట్లేదు. FYI.

  -మురళి

 6. Karthik says:

  Bossu adaragottesthunnara
  meru rase perlu baga vunnayandi….
  meru chese vyangyam chala bagundi manchi hasyam ga vundi.
  bandu rangadu anna peru vinnaka naku inko peru gurthuku vochindi
  adi tingu rangadu…..
  aaa durjan singh ki,aa visharaj patil ki tingu rangallu ani perlu pedithe baguntademo.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s